తొలి ఎలక్ట్రిక్ కారు Urban Cruiser BEV తెస్తున్న టయోటా.. ఒక్క ఛార్జ్‌తో 500 KM రేంజ్
టయోటా భారత్ లో అర్బన్ క్రూయిజర్ (Toyota Urban Cruiser BEV) ని విడుదల చేయనుంది. దీని రేంజ్, ఫీచర్లు, డిజైన్, ధర వివరాలు ఇక్కడ అందిస్తున్నాం.

Toyota కంపెనీ భారత మార్కెట్‌లో తన మొదటి మాస్-మార్కెట్ ఎలక్ట్రిక్ కారును విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది. ఈ కొత్త ఎలక్ట్రిక్ SUV పేరు Toyota Urban Cruiser BEV. టయోటా కంపెనీ 2026 మొదటి అర్ధభాగంలో భారత మార్కెట్లో అర్బన్ క్రూజర్ బీఈవీని లాంచ్ చేయాలని ప్లాన్ చేస్తోంది. ఈ SUV వేగంగా అభివృద్ధి చెందుతున్న భారత EV మార్కెట్‌లో Toyota స్ట్రాంగ్ ఎంట్రీగా భావిస్తున్నారు. ఈ ఎస్‌యూవీ ప్రత్యేకత ఏమిటంటే టయోటా Urban Cruiser BEV నిజానికి మారుతి సుజుకీ ఈ విటారా (Maruti Suzuki e Vitara) బ్యాడ్జ్-ఇంజనీర్డ్ వెర్షన్ అనిపిస్తుంది. ఈ రెండు కార్లు సుజుకి గుజరాత్ ప్లాంట్‌లో తయారు అవుతున్నాయి. ఈ SUV కొత్త Heartect-e ప్లాట్‌ఫారమ్‌పై ఆధారపడి పనిచేస్తుంది.
ఫ్యూచరిస్టిక్ లుక్‌తో వస్తున్న అర్బర్ క్రూజర్ BEV
Toyota Urban Cruiser BEV డిజైన్ చాలా వరకు Maruti e Vitaraని పోలి ఉంటుంది. అయితే ఇందులో Toyota ప్రత్యేక గుర్తింపు స్పష్టంగా కనిపిస్తుంది. SUV ముందు భాగంలో సన్నని LED హెడ్‌లైట్‌లు ఇస్తున్నారు. ఇవి క్రోమ్ స్ట్రిప్‌తో అనుసంధానమై ఉంటాయి. ఇందులో క్లోజ్డ్ గ్రిల్, నిలువు ఎయిర్ వెంట్స్, Toyota సిగ్నేచర్ హామర్‌హెడ్ డిజైన్ చూడవచ్చు. సైడ్ ప్రొఫైల్‌లో బాడీ క్లాడింగ్, కొత్త డిజైన్ ఏరో అల్లాయ్ వీల్స్ దీనికి స్పోర్టీ లుక్ ఇస్తాయి. వెనుక వైపున కనెక్ట్ చేసిన LED టెయిల్‌లైట్‌లు దీనికి ప్రీమియం లుక్ ఇస్తాయి. పరిమాణం పరంగా, ఈ SUV పొడవుగా, వెడల్పుగా ఉంటుంది. ఇది క్యాబిన్‌లో ఎక్కువ స్థలాన్ని అందిస్తుంది.
ఇంటీరియర్ ప్రీమియం, మరింత సౌకర్యవంతంగా
Urban Cruiser BEV క్యాబిన్ మోడ్రన్ డిజైన్, సౌకర్యంపై ఫోకస్ చేసింది. ఇందులో డ్యూయల్-టోన్ ఇంటీరియర్, లో సెట్ డాష్‌బోర్డ్, పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ లభిస్తుంది. ఇది వైర్‌లెస్ Android Auto, ఆపిల్ కార్ ప్లే (Apple CarPlay)కి సపోర్ట్ చేస్తుంది. దీనితో పాటు, డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, కొత్త మల్టీ ఫంక్షన్ స్టీరింగ్ వీల్ వస్తున్నాయి. సౌకర్యం కోసం వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, పనోరమిక్ సన్‌రూఫ్, స్లైడింగ్ రియర్ సీట్లు వంటి ఫీచర్లు ఆశించవచ్చు.
బ్యాటరీ, జర్నీ రేంజ్.. సేఫ్టీ ఫీచర్లు
Toyota Urban Cruiser BEVలో 49 kWh, 61 kWhతో రెండు బ్యాటరీ ఎంపికలు ఇవ్వనున్నారు. పెద్ద బ్యాటరీతో, ఈ SUV ఒకసారి పూర్తి ఛార్జింగ్ చేస్తే దాదాపు 500 నుండి 550 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు. ఫీచర్ల విషయానికి వస్తే ఇందులో 360-డిగ్రీ కెమెరా, కనెక్టెడ్ కార్ టెక్నాలజీ, వైర్‌లెస్ ఛార్జింగ్, ప్రీమియం సౌండ్ సిస్టమ్ ఇవ్వనున్నారు. సేఫ్టీ కోసం 7 ఎయిర్‌బ్యాగ్‌లు, లెవెల్-2 ADAS, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ వంటి మోడ్రన్ ఫీచర్‌లను పొందే అవకాశం ఉంది.
ధర, లాంచ్ సమాచారం
Toyota Urban Cruiser BEV ఎక్స్-షోరూమ్ ప్రారంభ ధర దాదాపు 20 లక్షల రూపాయలు ఉంటుందని అంచనా. ఈ ధరలో ఈ SUV Hyundai Creta EVతో పాటు Maruti e Vitara వంటి మోడళ్లకు పోటీనిస్తుంది.






















