Ind vs Nz Second ODI Highlights | రెండో వన్డేలో భారత్ పై 7వికెట్ల తేడాతో కివీస్ ఘన విజయం | ABP Desam
కివీస్ తో జరుగుతున్న రెండో వన్డేను గెలిచి రాజ్ కోట్ లోనే సిరీస్ గెలుపు రుచి చూద్దామనుకున్న కెప్టెన్ శుభ్ మన్ గిల్ ఆశలు నెరవేరలేదు. ముందు బ్యాటింగ్ కష్టాలు ఆ తర్వాత కేఎల్ రాహుల్ మెరుపులతో భారత్ కోలుకున్నా...బౌలింగ్ లో మాత్రం తేలిపోవటం...యంగ్ తో కలిసి మిచెల్ చేసిన పోరాటంతో భారత్ కు ఓటమి తప్పలేదు. టాస్ గెలిచిన న్యూజిలాండ్ భారత్ ను ముందు బ్యాటింగ్ కి ఆహ్వానించింది. వరుసగా వస్తున్న ఫెయిల్యూర్స్ నుంచి బయట పడాలని కెప్టెన్ గిల్ ఈ సారి విశ్వప్రయత్నం చేయగా..బ్యాడ్ లక్ హిట్ మ్యాన్ రోహిత్ శర్మ, కింగ్ విరాట్ కోహ్లీ మాత్రం ఫెయిల్ అయ్యారు. ఇద్దరూ చెత్త షాట్స్ కు బలయ్యారు. గిల్ 56 పరుగులు చేసి ఔట్ కావటం...అయ్యర్ కూడా ఆదుకోకపోవటంతో 118పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన భారత్ ను కేఎల్ రాహుల్ దేవుడిలా ఆదుకున్నాడు. జడ్డూ, నితీశ్ లను అడ్డం పెట్టుకుని స్ట్రైక్ రొటేట్ చేస్తూ అవసరమైనప్పుడు గేర్లు వేస్తూ సెంచరీ బాదేశాడు రాహుల్. 92 బాల్స్ లో 11ఫోర్లు ఓ సిక్సర్ తో 112 పరుగులు చేశాడు. ఫలితంగా భారత్ కనీసం 285పరుగుల టార్గెట్ ను న్యూజిలాండ్ కు ఇవ్వగలిగింది. కాన్వే, హెన్రీ నికోలస్ ల వికెట్లను భారత బౌలర్లు త్వరగానే కూల్చినా...విల్ యంగ్ తో కలిసి డేరెల్ మిచెల్ అద్భుతంగా పోరాడాడు. యంగ్ 87పరుగులు చేసి తృటిలో సెంచరీ కోల్పోగా..మిచెల్ మాత్రం 117 బాల్స్ లో 11ఫోర్లు 2 సిక్సర్లతో 131పరుగులు చేశాడు. చివర్లో ఫిలిప్స్ మెరుపులు మెరిపించటంతో న్యూజిలాండ్ భారత్ పై 7వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఫలితంగా సిరీస్ 1-1తో సమమైంది. సో సిరీస్ గెలవాలంటే తప్పనిసరిగా గెలవాల్సిన మ్యాచ్ ఆదివారం జరగనుంది.





















