అన్వేషించండి

Ranji Trophy Winner: తొలిసారి రంజీ ట్రోఫీ టైటిల్‌ నెగ్గిన జమ్మూ కాశ్మీర్.. ఫైనల్లో కర్ణాటకపై ఘనవిజయం

Jammu And Kashmir Champion First Time Ranji Trophy: జమ్మూ కాశ్మీర్ తొలిసారిగా రంజీ ట్రోఫీ విజేతగా అవతరించింది. పరాస్ డోగ్రా కెప్టెన్సీలో జమ్మూ కాశ్మీర్ రంజీ ట్రోఫీ 2026 ఛాంపియన్లుగా నిలిచింది.

బెంగళూరు: జమ్మూ కాశ్మీర్ క్రికెట్ జట్టు చరిత్ర సృష్టించింది. జమ్మూ కాశ్మీర్ జట్టు రంజీ ట్రోఫీ ఛాంపియన్‌గా అవతరించింది. రంజీ ట్రోఫీ చరిత్రలో జమ్మూ కాశ్మీర్ టైటిల్ గెలవడం ఇదే తొలిసారి. అంతేకాకుండా, ఆ జట్టు రంజీ ట్రోఫీ ఫైనల్‌కు చేరుకోవడం సైతం ఇదే తొలిసారి. 2025-26 రంజీ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ డ్రాగా ముగిసినప్పటికీ, తొలి ఇన్నింగ్స్‌లో ఆధిక్యం (ఫస్ట్ ఇన్నింగ్స్ లీడ్) ఆధారంగా జమ్మూ కాశ్మీర్‌ను విజేతగా ప్రకటించడంతో సంబరాలు మొదలయ్యాయి.

67 ఏళ్ల నిరీక్షణకు తెర.. తొలిసారి ఛాంపియన్‌గా జమ్మూ కాశ్మీర్
రంజీ ట్రోఫీ ఫైనల్ పోరులో జమ్మూ కాశ్మీర్ మొదట బ్యాటింగ్‌కు దిగి తొలి ఇన్నింగ్స్‌లో 584 పరుగుల భారీ స్కోరు చేసింది. కర్ణాటక జట్టు తన తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 293 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో జమ్మూ కాశ్మీర్‌కు తొలి ఇన్నింగ్స్‌లో 291 పరుగుల ఆధిక్యం లభించింది. అయినప్పటికీ, జమ్మూ కాశ్మీర్ తమ ప్రత్యర్థి కర్ణాటకకు ఫాలో-ఆన్ ఇవ్వకుండా, రెండో ఇన్నింగ్స్ ఆడి 4 వికెట్ల నష్టానికి 342 పరుగులు చేసింది. అనంతరం ఇరు జట్ల కెప్టెన్లు మ్యాచ్‌ను డ్రాగా ముగించేందుకు అంగీకరించారు. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సాధించిన జమ్మూ కాశ్మీర్‌ను అంపైర్లు విజేతగా ప్రకటించారు. 


Ranji Trophy Winner: తొలిసారి రంజీ ట్రోఫీ టైటిల్‌ నెగ్గిన జమ్మూ కాశ్మీర్.. ఫైనల్లో కర్ణాటకపై ఘనవిజయం

జమ్మూకాశ్మీర్ తొలిసారి రంజీ ఛాంపియన్‌గా నిలిచింది. ఈ విజయం జమ్మూ కాశ్మీర్ క్రికెట్ జట్టు చరిత్రలో ఒక చారిత్రాత్మక ఘట్టం. రంజీ ట్రోఫీ గెలవాలనే వారి 67 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు ఈ విజయంతో తెరపడింది.

కర్ణాటక టీంలో ఎందరో స్టార్ ప్లేయర్లు
ఈ టైటిల్ పోరులో కర్ణాటక జట్టులో పలువురు స్టార్ ప్లేయర్లు ఉన్నారు. ముఖ్యంగా టీమిండియాకు పలు ఫార్మాట్లలో ఆడిన కె.ఎల్. రాహుల్, మయాంక్ అగర్వాల్, కరుణ్ నాయర్, దేవదత్ పడిక్కల్, ప్రసిద్ధ్ కృష్ణ వంటి స్టార్ ప్లేయర్లు కర్ణాటక జట్టులో ఉన్నప్పటికీ ఓటమి తప్పలేదు. కర్ణాటక తరపున మయాంక్ అగర్వాల్ తొలి ఇన్నింగ్స్‌లో 160 పరుగులతో శతక ఇన్నింగ్స్ ఆడాడు. లేకపోతే పరిస్థితి మరీ దారుణంగా ఉండేది.

ఫైనల్‌లో జమ్మూ కాశ్మీర్ హీరోలు వీరే..
జమ్మూ కాశ్మీర్ విజయంలో కీలక పాత్ర పోషించిన ఆటగాళ్లు వీరే..
శుభమ్ పుండిర్: తొలి ఇన్నింగ్స్‌లో 121 పరుగులు (12 ఫోర్లు, 2 సిక్సర్లు).

యావర్ హసన్: 88 పరుగులు చేశాడు

పరాస్ డోగ్రా (కెప్టెన్): 70 పరుగులు చేశాడు

అబ్దుల్ సమద్: 61 పరుగులు.

ఆకిబ్ నబీ దార్: బౌలింగ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు పడగొట్టాడు.

కామ్రాన్ ఇక్బాల్: రెండో ఇన్నింగ్స్‌లో 160 పరుగులతో సెంచరీ ఇన్నింగ్స్.

సాహిల్ లోత్రా: రెండో ఇన్నింగ్స్‌లో 101 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Devdutt Padikkal Historic Ton: కోహ్లీ సరసన నిలిచి, ఎలైట్ లిస్ట్‌లోకి పడిక్కల్.. మెయిడిన్ టెస్టు సెంచరీతో సత్తా చాటిన దేవదత్
కోహ్లీ సరసన నిలిచి, ఎలైట్ లిస్ట్‌లోకి పడిక్కల్.. మెయిడిన్ టెస్టు సెంచరీతో సత్తా చాటిన దేవదత్
IND vs SL 1st Test Day 1 Updates: పడిక్కల్ మైండ్ బ్లోయింగ్ సెంచరీ, రాహుల్ ఫిఫ్టీ.. గాలే టెస్టులో టీమిండియా జోరు!
పడిక్కల్ మైండ్ బ్లోయింగ్ సెంచరీ, రాహుల్ ఫిఫ్టీ.. గాలే టెస్టులో టీమిండియా జోరు!
Devdutt Padikkal Century: శ్రీలంకపై తొలి టెస్టులో సెంచరీ బాదిన దేవదత్ పడిక్కల్.. 24 ఏళ్ల తరువాత తొలి బ్యాటర్‌గా
శ్రీలంకపై తొలి టెస్టులో సెంచరీ బాదిన దేవదత్ పడిక్కల్.. 24 ఏళ్ల తరువాత తొలి బ్యాటర్‌గా
IND vs SL Galle Test: భారత్ చారిత్రాత్మక 600వ టెస్ట్ సమరానికి వరుణుడి ముప్పు.. గాలే వేదికగా గిల్ సేన బోణీ కొడుతుందా.? 
భారత్ చారిత్రాత్మక 600వ టెస్ట్ సమరానికి వరుణుడి ముప్పు.. గాలే వేదికగా గిల్ సేన బోణీ కొడుతుందా.? 

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
జాబ్ సెక్యూరిటీ, EMI కంటే వైద్య ఖర్చులతోనే ఉద్యోగుల్లో టెన్షన్: తాజా అధ్యయనంలో వెల్లడి
జాబ్ సెక్యూరిటీ, EMI కంటే వైద్య ఖర్చులతోనే ఉద్యోగుల్లో టెన్షన్: తాజా అధ్యయనంలో వెల్లడి
Devdutt Padikkal Historic Ton: కోహ్లీ సరసన నిలిచి, ఎలైట్ లిస్ట్‌లోకి పడిక్కల్.. మెయిడిన్ టెస్టు సెంచరీతో సత్తా చాటిన దేవదత్
కోహ్లీ సరసన నిలిచి, ఎలైట్ లిస్ట్‌లోకి పడిక్కల్.. మెయిడిన్ టెస్టు సెంచరీతో సత్తా చాటిన దేవదత్
CM Revanth Reddy: రేషన్ కార్డు అంటే కేవలం బియ్యం ఇచ్చే సాధనం కాదు.. ప్రజల ఆత్మగౌరవం: సీఎం రేవంత్ రెడ్డి
రేషన్ కార్డు అంటే కేవలం బియ్యం ఇచ్చే సాధనం కాదు.. ప్రజల ఆత్మగౌరవం: సీఎం రేవంత్ రెడ్డి
Bigg Boss Agnipariksha 2 : కంటెస్టెంట్స్‌ను హర్ట్ చేస్తున్నారా? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలు వివాదంపై బిందు మాధవి రియాక్షన్
కంటెస్టెంట్స్‌ను హర్ట్ చేస్తున్నారా? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలు వివాదంపై బిందు మాధవి రియాక్షన్
ఏడాదికి ఒక్కసారి మాత్రమే సర్వీస్, 200 KM రేంజ్‌తో రాబోతున్న Ather Konarc
ఏడాదికి ఒక్కసారి మాత్రమే సర్వీస్, 200 KM రేంజ్‌తో రాబోతున్న Ather Konarc
Pawan Kalyan Speech: డబ్బు కోసం ఓటేయరాదు, ఏదైనా నమ్మే ముందు పరిశీలించాలి : యువతకు పవన్ కళ్యాణ్ కీలక సూచనలు
డబ్బు కోసం ఓటేయరాదు, ఏదైనా నమ్మే ముందు పరిశీలించాలి : యువతకు పవన్ కళ్యాణ్ కీలక సూచనలు
Adilabad Bike Theft Gang: ఆదిలాబాద్‌లో బైక్ కనిపిస్తే మాయం.. పార్ట్స్ చేసి అమ్మేస్తున్న గ్యాంగ్ అరెస్ట్: ఎస్పీ అఖిల్ మహాజన్
ఆదిలాబాద్‌లో బైక్ కనిపిస్తే మాయం.. పార్ట్స్ చేసి అమ్మేస్తున్న గ్యాంగ్ అరెస్ట్: ఎస్పీ అఖిల్ మహాజన్
రూ.1 లక్ష డౌన్ పేమెంట్ చేసి Toyota Hyryder కొంటే EMI ఎంత చెల్లించాలి
రూ.1 లక్ష డౌన్ పేమెంట్ చేసి Toyota Hyryder కొంటే EMI ఎంత చెల్లించాలి
Embed widget