అన్వేషించండి

Israel Strike On Iran: ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ రక్షణ మంత్రితో పాటు ఆర్మీ చీఫ్ మృతి.. రిపోర్ట్స్!

ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ రక్షణ మంత్రి అమీర్ నాసిర్జాదే, గార్డ్స్ కమాండర్ మహమ్మద్ పాక్పూర్ మృతిచెందారని సమాచారం. ఈ మేరకు కథనాలు వస్తున్నాయి.

టెహ్రాన్: ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య మరో యుద్ధం మొదలైంది. ఇరు దేశాలు ఎయిర్ స్ట్రైక్స్, బాంబు దాడులు చేసుకోవడంతో పరిస్థితి మరీ భయానకంగా మారింది. ఈ క్రమంలో ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ఇరాన్ రక్షణ మంత్రి అమీర్ నాసిర్జాదే, రివల్యూషనరీ గార్డ్స్ కమాండర్ మహమ్మద్ పాక్పూర్ చనిపోయినట్లు తెలుస్తోంది. ఇజ్రాయెల్ ఆర్మీతో సంబంధం ఉన్న రెండు వర్గాలు, మరో వర్గం సైతం వీరిద్దరూ మృతిచెందారని తెలిపాయి. రాజధాని టెహ్రాన్‌లో అత్యున్నత స్థాయి సమావేశంలో పాల్గొన్న సమయంలో ఇజ్రాయెల్ బలగాలు జరిపిన దాడుల్లో వీరిద్దరూ చనిపోయారని అంతర్జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. అయితే ఇరాన్ ప్రభుత్వం గానీ, అధికారులు గానీ దీనిపై స్పందించాల్సి ఉంది. ఇటీవల సైతం దాడుల్లో వారు చనిపోయారని ప్రచారం జరగగా, తరువాత ఇరాన్ ప్రభుత్వం ఆ వార్తల్ని తీవ్రంగా ఖండించింది. 

గల్ఫ్ దేశాల్లో సెగలు రేపుతున్న యుద్ధం..

మధ్యప్రాచ్యంలో యుద్ధ జ్వాలలు గల్ఫ్ దేశాలకు వ్యాపించాయి. ఇరాన్ తమపై జరుగుతున్న దాడులకు ప్రతీకారంగా 'ఆపరేషన్ గ్రేట్ రివెంజ్'ను ప్రారంభించింది. అమెరికా సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని వందలాది బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించింది. ముఖ్యంగా ఖతార్‌లోని అల్-ఉదైద్ ఎయిర్ బేస్, బహ్రెయిన్‌లోని అమెరికా 5వ నౌకాదళ ప్రధాన కార్యాలయంపై దాడులు జరగడంతో యుద్ధ వాతావరణం నెలకొంది. తమ భూభాగాలను అమెరికా దాడులకు వేదికగా ఉపయోగిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఇరాన్ హెచ్చరించడంతో గల్ఫ్ దేశాలు అప్రమత్తమయ్యాయి.

 

ఈ పరిణామాలతో దుబాయ్, అబుదాబి, దోహా వంటి ప్రధాన నగరాల్లో జనజీవనం స్తంభించిపోయింది. అంతర్జాతీయ విమానాశ్రయాలు మూసివేయబడగా, గగనతలంపై ఆంక్షలు విధించారు. క్షిపణి దాడుల భయంతో ప్రజలు ఇళ్లకే పరిమితం కాగా, ప్రభుత్వాలు అత్యవసర పరిస్థితిని ప్రకటించాయి. కువైట్, యూఏఈలలోని అమెరికా స్థావరాల సమీపంలో భారీ పేలుళ్లు సంభవించడంతో స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు. అనేక దేశాలు తమ రక్షణ వ్యవస్థలను సిద్ధం చేసి, ఇరాన్ క్షిపణులను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాయి. ఈ పరిణామాలు గల్ఫ్ ప్రాంతాన్ని అస్థిరతలోకి నెట్టాయి.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Breaking News: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కలిసిన మంత్రి నారాయణ.. రాజధాని ప్రాజెక్టుల ప్రారంభోత్సవానికి ఆహ్వానం
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కలిసిన మంత్రి నారాయణ.. రాజధాని ప్రాజెక్టుల ప్రారంభోత్సవానికి ఆహ్వానం
Breaking News: బుధవారం ఉదయం వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జగన్ కీలక భేటీ
బుధవారం ఉదయం వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జగన్ కీలక భేటీ
Donald Trump Assassination Attempt:టర్కీలో ట్రంప్‌పై మర్డర్ అటెంప్ట్‌! క్యాటరింగ్ కంటైనర్‌లో తప్పించుకున్న అమెరికా అధ్యక్షుడు!
టర్కీలో ట్రంప్‌పై మర్డర్ అటెంప్ట్‌! క్యాటరింగ్ కంటైనర్‌లో తప్పించుకున్న అమెరికా అధ్యక్షుడు!
Colombia Earthquake: కొలంబియాలో 7.4 తీవ్రతతో భూకంపం! వేలల్లో ఇళ్లు ధ్వంసం, వంద మందికిపైగా మృతి! 
కొలంబియాలో 7.4 తీవ్రతతో భూకంపం! వేలల్లో ఇళ్లు ధ్వంసం, వంద మందికిపైగా మృతి! 

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan: అమరావతి పనుల ప్రారంభోత్సవానికి పవన్ కళ్యాణ్‌కు మంత్రి నారాయణ ఆహ్వానం.. డిప్యూటీ సీఎం హాజరవుతారా
అమరావతి పనుల ప్రారంభోత్సవానికి పవన్ కళ్యాణ్‌కు మంత్రి నారాయణ ఆహ్వానం.. డిప్యూటీ సీఎం హాజరవుతారా
IND vs SL Test Series: గాయంతో టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. లంక టెస్ట్ సిరీస్ నుంచి మ‌రో ఆల్‌రౌండర్ అవుట్!
గాయంతో టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. లంక టెస్ట్ సిరీస్ నుంచి మ‌రో ఆల్‌రౌండర్ అవుట్!
Sridhar Babu: బీఆర్ఎస్ హయాంలోనే తక్కువ ధర! భూ కేటాయింపుల ఆరోపణలపై కేటీఆర్‌కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్
బీఆర్ఎస్ హయాంలోనే తక్కువ ధర! భూ కేటాయింపుల ఆరోపణలపై కేటీఆర్‌కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్
Free NEET Coaching: నీట్ ఫ్రీ లాంగ్ టర్మ్ కోచింగ్.. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన TGSWREIS
నీట్ ఫ్రీ లాంగ్ టర్మ్ కోచింగ్.. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన TGSWREIS
Indias Top 10 Business Families: భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
Bigg Boss Agnipariksha: 'బిగ్ బాస్'లో డర్టీ పాలిటిక్స్... అగ్నిపరీక్ష సెలక్షన్స్‌లో మోసం జరిగిందా?
'బిగ్ బాస్'లో డర్టీ పాలిటిక్స్... అగ్నిపరీక్ష సెలక్షన్స్‌లో మోసం జరిగిందా?
Ayyanna Patrudu: వారికి ఎమ్మెల్యే పదవి ఎందుకు? అసెంబ్లీకి రాకుంటే అనర్హత వేటు వేయాలి: స్పీకర్ అయ్యన్నపాత్రుడు
వారికి ఎమ్మెల్యే పదవి ఎందుకు? అసెంబ్లీకి రాకుంటే అనర్హత వేటు వేయాలి: స్పీకర్ అయ్యన్నపాత్రుడు
Adilabad Crime News: ఆదిలాబాద్, మహారాష్ట్రలో టూవీలర్స్ మాయం.. అంతర్రాష్ట్ర గ్యాంగ్ అరెస్ట్, 44 బైక్స్ స్వాధీనం
ఆదిలాబాద్, మహారాష్ట్రలో టూవీలర్స్ మాయం.. అంతర్రాష్ట్ర గ్యాంగ్ అరెస్ట్, 44 బైక్స్ స్వాధీనం
Embed widget