తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ (TGSWREIS) 2027 నీట్ యూజీ పరీక్షకు సిద్ధమవుతున్న విద్యార్థులకు ఉచిత లాంగ్ టర్మ్ కోచింగ్ అందిస్తోంది. ఇది మెడికల్ కోర్సుల్లో ప్రవేశానికి సహాయపడుతుంది.
Free NEET Coaching: నీట్ ఫ్రీ లాంగ్ టర్మ్ కోచింగ్.. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన TGSWREIS
NEET UG 2027 | నీట్ యూజీ ఉచిత లాంగ్ టర్మ్ కోచింగ్ కోసం అభ్యర్థుల నుండి TGSWREIS దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఆసక్తి ఉన్నవారు ఆగస్టు 22లోగా అప్లై చేసుకోవాలి.

- తెలంగాణ గురుకులాల నీట్ యూజీ 2027కు ఉచిత శిక్షణ ప్రకటన.
- హైదరాబాద్‌లో 200 మందికి వసతితో కూడిన ఉచిత శిక్షణ.
- ఇంటర్ బైపీసీ పూర్తిచేసినవారు ఆగస్టు 22 వరకు దరఖాస్తు చేయండి.
Free NEET UG 2027 Long Term Coaching | హైదరాబాద్: గత రెండు నెలలపాటు నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్‌పై ఆందోళన కొనసాగింది. యువత ఆందోళన తీవ్రరూపం దాల్చడంతో ఎట్టకేలకు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేయడం తెలిసిందే. మెడిసిన్ కోర్సులో నీట్ ఎంట్రన్స్ చాలా కీలకం. పేద విద్యార్థులు వైద్య విద్య అభ్యసించడం కల లాంటిదే. అయితే వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశం పొందేందుకు నీట్ (NEET UG 2027) పరీక్షకు సిద్ధమవుతున్న విద్యార్థులకు తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ (TGSWREIS) శుభవార్త చెప్పింది.
నీట్ యూజీ 2027 ఉచిత లాంగ్ టర్మ్ కోచింగ్
2027 లో జరగనున్న నీట్ యూజీ పరీక్ష కోసం అర్హులైన అభ్యర్థులకు ఉచితంగా లాంగ్ టర్మ్ కోచింగ్ ఇవ్వనున్నట్లు సొసైటీ కార్యదర్శి కంభంపాటి శారద తెలిపారు. ఆసక్తి ఉన్న విద్యార్థులు ఆగస్టు 22వ తేదీ లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ 2026-27 అకాడమిక్ ప్రోగ్రామ్ కింద హైదరాబాద్‌లో మొత్తం 200 మంది విద్యార్థులకు ఈ ఉచిత శిక్షణ అందిస్తారు. ఇందులో 100 మంది బాలురకు చిలుకూరులోని టీజీఎస్‌డబ్ల్యూఆర్ ఫౌండేషన్ సీవోఈలో, మరో 100 మంది బాలికలకు మహేంద్ర హిల్స్ ఫౌండేషన్ వద్ద వేర్వేరుగా వసతితో కూడిన శిక్షణ ఇవ్వనున్నారు.
వెబ్ సైట్ నుంచి అప్లికేషన్ ఫారమ్ డౌన్‌లోడ్ చేసుకోండి..
2025-26 విద్యాసంవత్సరంలో ఇంటర్ బైపీసీ పూర్తి చేసిన అభ్యర్థులు, 2026 నీట్ పరీక్ష రాసిన వారు ఈ ఉచిత శిక్షణకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు అని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీలకు చెందిన విద్యార్థులు ఎవరైనా ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అప్లికేషన్ కోసం ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. TGSWREIS అధికారిక వెబ్‌సైట్ నుంచి అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని, పూర్తి చేసిన దరఖాస్తును అవసరమైన డాక్యుమెంట్లతో జత చేసి, డీసీఓ (DCO) ద్వారా చిలుకూరు లేదా మహేంద్రహిల్స్‌లోని సంబంధిత కాలేజీల్లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది.
Frequently Asked Questions
TGSWREIS అందించే ఉచిత కోచింగ్ దేనికి సంబంధించింది?
ఈ ఉచిత శిక్షణకు ఎవరు అర్హులు?
2025-26 విద్యాసంవత్సరంలో ఇంటర్ బైపీసీ పూర్తి చేసి, 2026 నీట్ పరీక్ష రాసిన SC, ST, OBC, EWS విద్యార్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ ఎప్పుడు, ఎలా దరఖాస్తు చేయాలి?
దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ ఆగస్టు 22. TGSWREIS వెబ్‌సైట్ నుండి అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని, అవసరమైన పత్రాలతో DCO ద్వారా సంబంధిత కాలేజీల్లో సమర్పించాలి. దరఖాస్తు ఫీజు లేదు.
ఉచిత కోచింగ్ ఎక్కడ, ఎంతమందికి అందిస్తారు?
హైదరాబాద్‌లోని చిల్కూరు (100 మంది బాలురు) మరియు మహేంద్ర హిల్స్ (100 మంది బాలికలు) వద్ద మొత్తం 200 మంది విద్యార్థులకు వసతితో కూడిన శిక్షణ అందిస్తారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు






















