అన్వేషించండి
CSR నిధులతో గవర్నమెంట్ స్కూల్స్ ఆధునీకరణ.. రహేజా, రాంకీ, యశోద సంస్థలతో Telangana ప్రభుత్వం ఒప్పందం
ప్రభుత్వ పాఠశాలలు, విద్యాభివృద్ధి కోసం రహేజా గ్రూప్, యశోద ఫౌండేషన్, రామ్ కీ ఫౌండేషన్, సంస్థలు ముందుకొచ్చాయి. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో విద్యాశాఖతో ఈ సంస్థలు ఒప్పందాలు కుదుర్చుకున్నాయి.
తెలంగాణ విద్యాభివృద్ధికి కార్పొరేట్ అండ
1/5

హైదరాబాద్: తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలల బలోపేతం, విద్యా రంగ అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు ప్రముఖ కార్పొరేట్ సంస్థలు ముందుకొచ్చాయి. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (CSR) నిధుల కింద ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు రహేజా గ్రూప్, రామ్ కీ ఫౌండేషన్, యశోద ఫౌండేషన్‌లు భారీ నిధులు అందజేయనున్నాయి.
2/5

సెక్రటేరియట్‌లో శనివారం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో ఆయా సంస్థల ప్రతినిధులు విద్యాశాఖతో అధికారికంగా ఒప్పందాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా రహేజా గ్రూప్ అధ్యక్షుడు నీల్ సి. రహేజా, రామ్ కీ ఫౌండేషన్ మేనేజింగ్ ట్రస్టీ అల్లా దాక్షాయణి, యశోదా గ్రూప్ డైరెక్టర్ గోరుకంటి దేవేందర్ రావు తమ ఒప్పంద పత్రాలను సీఎం రేవంత్ రెడ్డికి అందజేశారు.
Published at : 23 May 2026 08:03 PM (IST)
వ్యూ మోర్
Advertisement
Advertisement

Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion




















