అన్వేషించండి

Ayyanna Patrudu: వారికి ఎమ్మెల్యే పదవి ఎందుకు? అసెంబ్లీకి రాకుంటే అనర్హత వేటు వేయాలి: స్పీకర్ అయ్యన్నపాత్రుడు

Independence Day 2026 | అసెంబ్లీకి రాకుండా కొందరు ఎమ్మెల్యేలు ప్రయోజనాలు పొందుతున్నారని, జగన్ అడుగుతున్నది ప్రతిపక్ష సీటు కాదని, ప్రతిపక్ష హోదా అని అయ్యన్నపాత్రుడు వ్యాఖ్యానించారు.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ఆగస్టు 14, 15న అసెంబ్లీని సందర్శించడానికి ప్రజలకు అనుమతి.
  • ముందస్తు అనుమతి లేదు, ఫోన్లను మాత్రం అనుమతించరు.
  • 60 రోజులు గైర్హాజరైన ఎమ్మెల్యేలపై చర్యలకు స్పీకర్ నివేదిక.
  • జగన్‌కు ప్రతిపక్ష హోదా నిబంధనల ప్రకారం సాధ్యం కాదన్నారు.

అమరావతి: ఏపీ ప్రభుత్వం ఇండిపెండెన్స్ డే వేడుకలకు ఏర్పాట్లు చేస్తోంది. అయితే ఆగస్టు 14, 15 తేదీల్లో ఇండిపెండెన్స్ డే సందర్భంగా అసెంబ్లీకి వచ్చి వీక్షించవచ్చు అని ఏపీ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు తెలిపారు. పిల్లలతో పాటు వచ్చి అసెంబ్లీని వీక్షించేందుకు అవకాశం కల్పిస్తున్నామని, అందరూ దీన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. వైసీపీ ఎమ్మెల్యేలు సభకు రావడం లేదని, అలాంటివి వాళ్లకు ఎమ్మెల్యే పదవి ఎందుకు.. సభ్యత్వం రద్దు చేసే అంశం చర్చల స్థాయిలో ఉందన్నారు. డ్యూటీ చేయని ఎమ్మెల్యేలకు జీతాలు కట్ చేసేలా కేంద్రం చట్టం తేవాలని ఆకాంక్షించారు.

రాష్ట్ర శాసనసభ చరిత్రలోనే ఒక అపూర్వ ఘట్టానికి శ్రీకారం చుడుతూ, స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ప్రజాపండగలా నిర్వహించేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. గతంలో నందమూరి తారకరామారావు (NTR) తరచూ చెప్పే “మన సభ – జన సభ” అనే స్ఫూర్తితో అసెంబ్లీ గేట్లను ప్రజల కోసం తెరవనున్నట్లు ఆయన ప్రకటించారు. నిబంధనల ప్రకారం సభలో అవసరమైనంత సంఖ్యాబలం లేనప్పుడు ప్రతిపక్ష హోదా ఇవ్వడం సాధ్యపడదని, అది పూర్తిగా స్పీకర్ విచక్షణ పరిధిలోని అంశమని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రితో సమానంగా ప్రతిపక్ష నేతకు సమయం కేటాయించడం కుదరదని, చట్టసభలోని ప్రతి సభ్యుడికి మాట్లాడే అవకాశం సమపాళ్లలో లభిస్తుందని స్పీకర్ గారు స్పష్టం చేశారు.

ఆ రోజుల్లో వచ్చి అసెంబ్లీని వీక్షించండి..

అయ్యన్నపాత్రుడు మీడియాతో మాట్లాడుతూ.. ఆగస్టు 14, 15, జనవరి 26 వంటి రోజులు మనకు ఎంతో ముఖ్యమైన పండుగ రోజులని పేర్కొన్నారు. స్పీకర్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత స్కూలు పిల్లలకు, సాధారణ ప్రజలకు స్వాతంత్య్ర, గణతంత్ర దినోత్సవ వేడుకల సమయంలో అసెంబ్లీ ప్రాంగణంలోకి ప్రవేశం లేకపోవడాన్ని గమనించాను. అయితే ప్రజలు లేని చోట కేవలం లైటింగ్ పెట్టి ఉత్సవాలు నిర్వహించడం సరైంది కాదని అభిప్రాయపడ్డారు. అందువల్ల ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఈ రెండు రోజుల్లో సాయంత్రం వేళల్లో అసెంబ్లీ గేట్లు తెరిచే ఉంచుతామని, ఎలాంటి ముందస్తు అనుమతి లేకుండా స్కూలు పిల్లలతో సహా ప్రజలంతా వచ్చి అసెంబ్లీని వీక్షించవచ్చునని తెలిపారు. 

అసెంబ్లీ అందరిదీ కాబట్టి ప్రజలంతా ఈ వేడుకల్లో భాగస్వాములు కావాలనే ఈ ఏర్పాటు చేశామని, లోపలికి రావడానికి అనుమతి ఉన్నప్పటికీ ఫోన్లను మాత్రం అనుమతించమని స్పష్టం చేశారు. అంతేకాకుండా ఆ రెండు రోజుల్లో ప్రత్యేకంగా పోలీస్ బ్యాండ్ ప్రదర్శన కూడా ఉంటుందని తెలిపారు.

ఆ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలి..

మరొక వైపు, వరుసగా 60 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాని ఎమ్మెల్యేల సభ్యత్వాన్ని రద్దు చేయాలనే అంశంపై చర్చ జరగాలని కోరుతూ కేంద్రానికి నివేదిక పంపినట్లు స్పీకర్ అయ్యన్నపాత్రుడు తెలిపారు. కొంతమంది ఎమ్మెల్యేలు సభకు వరుసగా గైర్హాజరవుతూ చివరి నిమిషంలో వచ్చి సంతకాలు చేసి వెళ్తున్నారని విమర్శించారు. వైఎస్‌ఆర్‌సిపి నేత బొత్స సత్యనారాయణ మాజీ సీఎం జగన్ కంటే సీనియర్ నాయకుడని అన్నారు. తమ పార్టీ ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోమని నన్ను అడిగే బదులు తమ 11 మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి తన వద్దకు పంపవచ్చని వ్యాఖ్యానించారు. జగన్ ప్రతిపక్ష సీటు కాకుండా ప్రతిపక్ష హోదా అడుగుతున్నారని, అయితే అసెంబ్లీ నిబంధనల ప్రకారం అది సాధ్యం కాదని తేల్చి చెప్పారు. 

Frequently Asked Questions

ఏపీ అసెంబ్లీని ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఎప్పుడు వీక్షించవచ్చు?

ఆగస్టు 14 మరియు 15 తేదీలలో సాయంత్రం వేళల్లో ప్రజలు అసెంబ్లీని సందర్శించవచ్చు. స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు ఈ అవకాశాన్ని కల్పించారు.

అసెంబ్లీని సందర్శించడానికి ఎవరికి అనుమతి ఉంది?

పిల్లలతో పాటు సాధారణ ప్రజలందరికీ అసెంబ్లీలోకి ప్రవేశం ఉంటుంది. దీనికి ముందస్తు అనుమతి అవసరం లేదు.

అసెంబ్లీలోకి వచ్చే సందర్శకులకు ఏమైనా ఆంక్షలు ఉన్నాయా?

అవును, అసెంబ్లీ లోపలికి ప్రవేశించినప్పటికీ, ఫోన్లను మాత్రం అనుమతించరు.

అసెంబ్లీ సందర్శన సమయంలో ఏమైనా ప్రత్యేక కార్యక్రమాలు ఉంటాయా?

ఆగస్టు 14 మరియు 15 తేదీలలో అసెంబ్లీ వద్ద ప్రత్యేకంగా పోలీస్ బ్యాండ్ ప్రదర్శన ఉంటుంది.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

YS Jagan: శాసన మండలిలో నిలదీద్దాం! అసెంబ్లీపై ప్రెస్‌మీట్‌లు పెడదాం! ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో వైఎస్ జగన్!
శాసన మండలిలో నిలదీద్దాం! అసెంబ్లీపై ప్రెస్‌మీట్‌లు పెడదాం! ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో వైఎస్ జగన్!
Amaravati: అమరావతి సీడ్ యాక్సెస్‌ రోడ్‌ మరింత స్పీడ్‌! హైకోర్టు తీర్పు రాగానే పనులు వేగవంతం!
అమరావతి సీడ్ యాక్సెస్‌ రోడ్‌ మరింత స్పీడ్‌! హైకోర్టు తీర్పు రాగానే పనులు వేగవంతం!
Ayyanna Patrudu: వారికి ఎమ్మెల్యే పదవి ఎందుకు? అసెంబ్లీకి రాకుంటే అనర్హత వేటు వేయాలి: స్పీకర్ అయ్యన్నపాత్రుడు
వారికి ఎమ్మెల్యే పదవి ఎందుకు? అసెంబ్లీకి రాకుంటే అనర్హత వేటు వేయాలి: స్పీకర్ అయ్యన్నపాత్రుడు
Breaking News: గురువారం కర్నూలు పర్యటనకు వైఎస్ జగన్ ! విరూపాక్షికి పరామర్శ!
గురువారం కర్నూలు పర్యటనకు వైఎస్ జగన్ ! విరూపాక్షికి పరామర్శ!
Advertisement

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Indias Top 10 Business Families: భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
Adilbad Crime News: ఆదిలాబాద్, మహారాష్ట్రలో టూవీలర్స్ మాయం.. అంతర్రాష్ట్ర గ్యాంగ్ అరెస్ట్, 44 బైక్స్ స్వాధీనం
ఆదిలాబాద్, మహారాష్ట్రలో టూవీలర్స్ మాయం.. అంతర్రాష్ట్ర గ్యాంగ్ అరెస్ట్, 44 బైక్స్ స్వాధీనం
Cases Against YSRCP Leaders: గుంటూరు, కోనసీమ జిల్లాల్లో అంబటి రాంబాబు, పినిపె విశ్వరూప్ సహా వైసీపీ నేతలపై కేసులు నమోదు
గుంటూరు, కోనసీమ జిల్లాల్లో అంబటి రాంబాబు, పినిపె విశ్వరూప్ సహా వైసీపీ నేతలపై కేసులు నమోదు
NTR Surgery : ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
Love Entertainer OTT : మూడేళ్ల తర్వాత ఓటీటీలోకి ప్రేమదేశం - రెండు ఓటీటీల్లో లవ్ రొమాంటిక్ మూవీ
మూడేళ్ల తర్వాత ఓటీటీలోకి ప్రేమదేశం - రెండు ఓటీటీల్లో లవ్ రొమాంటిక్ మూవీ
Telangana News: 10 శాతం కమీషన్ వివాదం! డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భార్య నందిని భట్టిపై గవర్నర్‌కు ఫిర్యాదు
10 శాతం కమీషన్ వివాదం! డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భార్య నందిని భట్టిపై గవర్నర్‌కు ఫిర్యాదు
Miss Apoorva: 'బిగ్ బాస్' అగ్నిపరీక్షలో మిస్ గ్రాండ్ తెలంగాణ టైటిల్ విన్నర్... అపూర్వ ఫోటోలు
'బిగ్ బాస్' అగ్నిపరీక్షలో మిస్ గ్రాండ్ తెలంగాణ టైటిల్ విన్నర్... అపూర్వ ఫోటోలు
Tata Sons Chairman Chandrasekaran Resigns:టాటా గ్రూప్‌లో సంచలనం! అనూహ్యంగా తప్పుకున్న చంద్రశేఖరన్! భారీగా నష్టపోయిన షేర్లు!
టాటా గ్రూప్‌లో సంచలనం! అనూహ్యంగా తప్పుకున్న చంద్రశేఖరన్! భారీగా నష్టపోయిన షేర్లు!
Embed widget