అన్వేషించండి

YS Jagan: శాసన మండలిలో నిలదీద్దాం! అసెంబ్లీపై ప్రెస్‌మీట్‌లు పెడదాం! ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో వైఎస్ జగన్!

YS Jagan: వైఎస్‌ఆర్‌సీపీ అధినేత వైఎస్ జగన్ తాడేపల్లిలో తన పార్టీ ప్రజాప్రతినిధులతో సమావేశమయ్యారు. ప్రభుత్వ వైఫల్యాలై నిలదీయాలని దిశానిర్దేశం చేశారు.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ప్రధాన ప్రతిపక్ష హోదా నిరాకరణను జగన్ తీవ్రంగా తప్పుపట్టారు.
  • డీఎస్సీ అక్రమాలు, ఫీజు బకాయిలపై జగన్ ప్రభుత్వాన్ని నిలదీశారు.
  • రైతు సమస్యలు, పీపీపీ పాలసీని జగన్ తీవ్రంగా ఖండించారు.
  • అక్రమ కేసులు, మండలి డిప్యూటీ చైర్మన్ అభ్యర్థిని ప్రకటించారు.

YS Jagan: వైఎస్సాఆర్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాడేపల్లిలోని పార్టీ ఆఫీస్‌లో శాసనసభా పక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్రంలో నడుస్తున్న రాజకీయాలు, ప్రభుత్వం నడుస్తున్న తీరుపై విమర్శలు చేశారు. ప్రజాసమస్యపై గళమెత్తాలని సభ్యులకు సూచించారు.

శాసనసభలో 40 శాతం ఓట్లు పొందిన పార్టీగా వైఎస్‌ఆర్సీపీని ప్రధాన ప్రతిపక్షంగా గుర్తించడానికి ప్రభుత్వం నిరాకరించడాన్ని జగన్ తీవ్రంగా తప్పుపట్టారు. ప్రతిపక్ష హోదా ఇస్తే సభలో మాట్లాడేందుకు తగిన సమయం ఇవ్వాల్సి వస్తుందని ఆ భయంతోనే చంద్రబాబు నాయుడు ఈ నిర్ణయం తీసుకున్నారని ఆయన ఆరోపించారు. అసెంబ్లీలో మాట్లాడే అవకాశం లేకపోయినా, ప్రభుత్వం ప్రస్తావించే ప్రతి అంశానికి ఆధారాలతో ప్రెస్‌మీట్‌లు ద్వారా ప్రజలు వివరిద్దామని అన్నారు. 

డీఎస్సీ అక్రమాలకు నైతిక బాధ్యతగా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ 

డీఎస్సీలో అక్రమాలు జరిగాయని చాలా కాలంగా వైసీపీ విమర్శలు చేస్తోంది. మెరిట్ లిస్ట్‌లో జరిగిన మార్పులు, అక్రమాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని జగన్ ఆరోపించారు. స్పోర్ట్స్ కోటా పేరుతో జీవోలు జారీ చేసి, పరీక్ష రాయకుండానే ఉద్యోగాలు ఇచ్చేలా కుట్రలు చేశారని ఆరోపించారు. ఈ మొత్తం వ్యవహారంపై సీబీఐ దర్యాప్తు జరగాలని, నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండే చేశారు. 

ఫీజు రియింబర్స్‌మెంట్‌ నిధులు నిలిపివేయడంపై జగన్ ఆందోళన వ్యక్తం చేశారు. ఒక్కో త్రైమాసికానికి 700 కోట్ల రూపాయలు చొప్పున మొత్తం 9100 కోట్లు. వసతి దీవెన కింద మరో 3300 కోట్లు వెరసి 12400 కోట్లు బకాయిలు ఉన్నాయని ఆయన లెక్కలు వివరించారు. ప్రభుత్వం కేవలం  2900 కోట్లు మాత్రమే ఇచ్చిందని, మిగిలిన నిధుల కోసం శాసన మండలిలో ప్రభుత్వాన్ని నిలదీయాలని ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేశారు. 

Also Read: వైసీపీ ఫేక్ అకౌంట్లతో జాగ్రత్త.. కూటమి అభిమానులకు ఎన్డీయే సోషల్ మీడియా కోఆర్డినేషన్ కమిటీ విజ్ఞప్తి!

రాష్ట్రంలోని రైతులు ఎదుర్కొంటున్న గిట్టుబాటు ధర లేమి, పెట్టుబడి నష్టాలు, ఉచిత పంటల బీమా రద్దు వంటి అంశాలపై వైఎస్‌ఆర్‌సీపీ పోరాటం చేయాలని జగన్ చెప్పారు. నీటి విడుదల విషయంలో రైతులను మోసం చేస్తున్నారని జగన్ ఆరోపించారు. అదే విధంగా,కొత్తగా ప్రవేశ పెట్టిన పీపీపీ పాలసీని ఆంధ్రప్రదేశ్ ఫర్ సేల్ అని ఆయన అభివర్ణించారు. ప్రభుత్వమే నిధులు ఇస్తూ, వడ్డీలు కడుతూ, రాయితీలు ఇస్తూ, చివరకు ప్రజల నుంచి యూజర్ ఛార్జీలు పేరుతో వసూలు చేసుకోవడానికి ప్రైవేటు సంస్థలకు అనుమతించడం పెద్ద స్కామ్ అని ఆయన అన్నారు. 

కేసులపై న్యాయపోరాటం

రాష్ట్రంలో విపక్ష నేతలను అణచివేసేందుకు అక్రమ కేసులు పెడుతున్నారని జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యంగా బీసీ నాయకులైన చింతాడ రవి, ముస్తాఫా, విరూపాక్షి, కారుమూరు సునీల్‌ వంటి వారిపై తప్పుడు సాక్ష్యాలు సృష్టించి అరెస్టు చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. శాంతియుత నిరసనలకు అవకాశం లేకుండా చేయడం ప్రజాస్వామ్య విరుద్ధమని దీనిపై కచ్చితంగా కోర్టులను ఆశ్రయిస్తామని వెల్లడించారు. 

శాసన మండలిలో డిప్యూటీ చైర్మన్ అభ్యర్థిగా మాధవరావు

అసెంబ్లీకి దూరంగా ఉన్నా, మండలిలో తమకు ఉన్న బలాన్ని వాడుకుని ప్రజాసమస్యలపై పోరాటం చేయాలని  వైసీపీ నిర్ణయించింది. శాసనమండలి డిప్యూటీ చైర్మన పదవికి తూమాటి మాధవరావును వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థిగా జగన్ ప్రతిపాదించారు. సభ్యులంతా సమన్వయంతో పని చేసి పూర్తి కసరత్తుతో సాక్ష్యాధారాలతో ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని సూచించారు. 

Also Read: Ayyanna Patrudu: వారికి ఎమ్మెల్యే పదవి ఎందుకు? అసెంబ్లీకి రాకుంటే అనర్హత వేటు వేయాలి: స్పీకర్ అయ్యన్నపాత్రుడు

Frequently Asked Questions

YSRCPని ప్రధాన ప్రతిపక్షంగా గుర్తించకపోవడానికి జగన్ కారణం ఏమిటని ఆరోపించారు?

సభలో మాట్లాడేందుకు తగిన సమయం ఇవ్వాల్సి వస్తుందనే భయంతో చంద్రబాబు నాయుడు ఈ నిర్ణయం తీసుకున్నారని జగన్ ఆరోపించారు. దీనిపై ప్రెస్‌మీట్‌ల ద్వారా ప్రజలకు వివరిస్తామని అన్నారు.

డీఎస్సీ అక్రమాలపై జగన్ ఏ దర్యాప్తును డిమాండ్ చేశారు?

డీఎస్సీ మెరిట్ లిస్ట్‌లో మార్పులు, స్పోర్ట్స్ కోటా పేరిట జరిగిన అక్రమాలపై సీబీఐ దర్యాప్తు జరగాలని జగన్ డిమాండ్ చేశారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని కూడా కోరారు.

ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధుల బకాయిలపై జగన్ ఏమి చెప్పారు?

ఫీజు రీయింబర్స్‌మెంట్, వసతి దీవెన కింద ప్రభుత్వం విద్యార్థులకు మొత్తం రూ.12,400 కోట్లు బకాయి ఉందని జగన్ వివరించారు. శాసన మండలిలో ఎమ్మెల్సీలు దీనిపై ప్రభుత్వాన్ని నిలదీయాలని సూచించారు.

కొత్త పీపీపీ పాలసీని జగన్ ఎలా అభివర్ణించారు?

కొత్త పీపీపీ పాలసీని

Advertisement

టాప్ హెడ్ లైన్స్

YS Jagan: శాసన మండలిలో నిలదీద్దాం! అసెంబ్లీపై ప్రెస్‌మీట్‌లు పెడదాం! ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో వైఎస్ జగన్!
శాసన మండలిలో నిలదీద్దాం! అసెంబ్లీపై ప్రెస్‌మీట్‌లు పెడదాం! ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో వైఎస్ జగన్!
Amaravati: అమరావతి సీడ్ యాక్సెస్‌ రోడ్‌ మరింత స్పీడ్‌! హైకోర్టు తీర్పు రాగానే పనులు వేగవంతం!
అమరావతి సీడ్ యాక్సెస్‌ రోడ్‌ మరింత స్పీడ్‌! హైకోర్టు తీర్పు రాగానే పనులు వేగవంతం!
Ayyanna Patrudu: వారికి ఎమ్మెల్యే పదవి ఎందుకు? అసెంబ్లీకి రాకుంటే అనర్హత వేటు వేయాలి: స్పీకర్ అయ్యన్నపాత్రుడు
వారికి ఎమ్మెల్యే పదవి ఎందుకు? అసెంబ్లీకి రాకుంటే అనర్హత వేటు వేయాలి: స్పీకర్ అయ్యన్నపాత్రుడు
Breaking News: గురువారం కర్నూలు పర్యటనకు వైఎస్ జగన్ ! విరూపాక్షికి పరామర్శ!
గురువారం కర్నూలు పర్యటనకు వైఎస్ జగన్ ! విరూపాక్షికి పరామర్శ!
Advertisement

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Indias Top 10 Business Families: భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
Adilbad Crime News: ఆదిలాబాద్, మహారాష్ట్రలో టూవీలర్స్ మాయం.. అంతర్రాష్ట్ర గ్యాంగ్ అరెస్ట్, 44 బైక్స్ స్వాధీనం
ఆదిలాబాద్, మహారాష్ట్రలో టూవీలర్స్ మాయం.. అంతర్రాష్ట్ర గ్యాంగ్ అరెస్ట్, 44 బైక్స్ స్వాధీనం
Cases Against YSRCP Leaders: గుంటూరు, కోనసీమ జిల్లాల్లో అంబటి రాంబాబు, పినిపె విశ్వరూప్ సహా వైసీపీ నేతలపై కేసులు నమోదు
గుంటూరు, కోనసీమ జిల్లాల్లో అంబటి రాంబాబు, పినిపె విశ్వరూప్ సహా వైసీపీ నేతలపై కేసులు నమోదు
NTR Surgery : ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
Love Entertainer OTT : మూడేళ్ల తర్వాత ఓటీటీలోకి ప్రేమదేశం - రెండు ఓటీటీల్లో లవ్ రొమాంటిక్ మూవీ
మూడేళ్ల తర్వాత ఓటీటీలోకి ప్రేమదేశం - రెండు ఓటీటీల్లో లవ్ రొమాంటిక్ మూవీ
Telangana News: 10 శాతం కమీషన్ వివాదం! డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భార్య నందిని భట్టిపై గవర్నర్‌కు ఫిర్యాదు
10 శాతం కమీషన్ వివాదం! డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భార్య నందిని భట్టిపై గవర్నర్‌కు ఫిర్యాదు
Miss Apoorva: 'బిగ్ బాస్' అగ్నిపరీక్షలో మిస్ గ్రాండ్ తెలంగాణ టైటిల్ విన్నర్... అపూర్వ ఫోటోలు
'బిగ్ బాస్' అగ్నిపరీక్షలో మిస్ గ్రాండ్ తెలంగాణ టైటిల్ విన్నర్... అపూర్వ ఫోటోలు
Tata Sons Chairman Chandrasekaran Resigns:టాటా గ్రూప్‌లో సంచలనం! అనూహ్యంగా తప్పుకున్న చంద్రశేఖరన్! భారీగా నష్టపోయిన షేర్లు!
టాటా గ్రూప్‌లో సంచలనం! అనూహ్యంగా తప్పుకున్న చంద్రశేఖరన్! భారీగా నష్టపోయిన షేర్లు!
Embed widget