ఈ షో ఆగస్టు 15వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. ఇది 'బిగ్ బాస్' తెలుగు సీజన్ 10 ముందు సెగలు పుట్టిస్తోంది.
Bigg Boss Agnipariksha: 'బిగ్ బాస్'లో డర్టీ పాలిటిక్స్... అగ్నిపరీక్ష సెలక్షన్స్‌లో మోసం జరిగిందా?
Bigg Boss 10 Agnipariksha: 'బిగ్ బాస్' తెలుగు సీజన్ 10 కోసం అగ్నిపరీక్ష సీజన్ 2 స్టార్ట్ చేశారు. అది ఆగస్టు 15న మొదలవుతుంది. అగ్నిపరీక్ష ఆడిషన్స్‌లో మోసం జరిగిందని గుసగుస.

- బిగ్ బాస్ అగ్నిపరీక్ష-2 ఆడిషన్స్‌లో అవకతవకలు, పక్షపాత ఆరోపణలు వెల్లువెత్తాయి.
- వేల దరఖాస్తుల నుండి 15 మంది ఎంపికలో అవకతవకలు, పక్షపాతం.
- జడ్జ్ అభిజిత్‌ను ప్రశ్నించిన కంటెస్టెంట్‌ను తొలగించడం తీవ్ర వివాదమైంది.
'బిగ్ బాస్' తెలుగు సీజన్ 10 (Bigg Boss 10 Telugu) మొదలు అవ్వకముందే 'అగ్ని పరీక్ష సీజన్ 2' (Bigg Boss Agnipariksha Season 2) సెగలు పుట్టిస్తోంది. సోషల్ మీడియాలో ఈ షో గురించి డిస్కషన్ మొదలు అయ్యింది. ఆగస్టు 15వ తేదీ నుంచి ప్రారంభం కాబోతున్న 'బిగ్ బాస్' తెలుగు అగ్నిపరీక్ష సీజన్ 2 కోసం వాడీవేడిగా ఆడిషన్స్ జరిగాయట. అందులో మోసాలు, డర్టీ పాలిటిక్స్ చోటు చేసుకున్నట్టు గుసగుస. ఆ వివరాల్లోకి వెళితే...
వేలల్లో అప్లికేషన్స్... వందలోపే ఆడిషన్స్!
'బిగ్ బాస్' తెలుగు సీజన్ 2 కోసం వేల సంఖ్యలో అప్లికేషన్లు వచ్చినట్టు తెలిసింది. అవన్నీ చూసి, అందులో నుంచి వడపోసి చివరకు 70 మందిని ఫైనల్ చేశారట. ఆ 70 మందిని ఆడిషన్ చేసి చివరకు 15 మందిని 'బిగ్ బాస్' అగ్నిపరీక్ష సీజన్ 2 కోసం కంటెస్టెంట్లుగా సెలెక్ట్ చేశారు. ఆ ఎంపికలో అవకతవకలు, డర్టీ పాలిటిక్స్ జరిగాయట.
'బిగ్ బాస్' అగ్నిపరీక్ష ఆడిషన్స్ షోలో కంటెస్టెంట్ల మధ్య పోటీ కంటే జ్యూరీ సభ్యులకు, కంటెస్టెంట్లకు మధ్య ఎక్కువ గొడవలు జరిగాయట. నవదీప్, అభిజీత్, బిందు మాధవి జడ్జీలుగా వ్యవహరించారు. ఆ ముగ్గురి నుంచి ఒక్క గ్రీన్ సిగ్నల్ వచ్చిన కంటెస్టెంట్లకు మళ్ళీ ఛాన్స్ ఇచ్చారట. ఇద్దరి నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిన వాళ్ళకు మరో ఛాన్స్ ఇవ్వలేదట. టీమ్ పాలిటిక్స్, డర్టీ పాలిటిక్స్ చేసి చివరకు తమకు కావాల్సిన వాళ్ళను సెలెక్ట్ చేశారట.

అభిజిత్ కెరీర్‌పై కామెంట్స్... అగ్నిపరీక్షలో ఫైర్!
బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 విన్నర్ అభిజిత్‌కు, ఓ కంటెస్టెంట్‌కు మధ్య హాట్ హాట్ డిస్కషన్ జరిగింది. అది ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్ టాపిక్‌గా మారింది. 'బిగ్ బాస్ షో తర్వాత రెండు మూడేళ్లు మీరు ఎక్కడా కనిపించలేదు?' అని అభిజిత్ కెరీర్‌ను ఉద్దేశించి ఓ కంటెస్టెంట్ కామెంట్ చేశారు. దాంతో వాతావరణం వేడెక్కింది. ఆ మాటలకు అభిజిత్ స్పందిస్తూ... ''మాకు వేరే పనులు లేవని అనుకుంటున్నావా? ఏం మాట్లాడుతున్నావ్ అసలు?'' అని ఫైర్ అయ్యారు. ఆ కంటెస్టెంట్‌కు రెడ్ సిగ్నల్ చూపించి బయటకు పంపించారు.
మరొక కంటెస్టెంట్‌పై యాంకర్ శ్రీముఖి నిప్పులు చెరిగారు. రూల్స్ అతిక్రమించి మరీ జ్యూరీని (జడ్జీలను) తప్పుదారి పట్టించడానికి ప్రయత్నించిన వ్యక్తిపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉప్పల్ బాలును వెంటనే వెనక్కి పంపించేశారని తెలుస్తోంది. రైతు బిడ్డ కేటగిరీలో ఓ అమ్మాయికి, రివర్స్ రైటింగ్ టాలెంట్ ఉన్న మరొకరికి ఛాన్స్ ఇచ్చారట. పదిహేను మంది అగ్నిపరీక్ష కంటెస్టెంట్స్ నుంచి చివరకు ఐదారుగురు కంటెస్టెంట్లను బిగ్ బాస్ ఇంట్లోకి పంపే అవకాశం ఉంది.
Also Read: Janhvi Kapoor OTT Debut - ఓటీటీలోకి జాన్వీ కపూర్... తమిళ వెబ్ సిరీస్‌లో ఆమె పాత్ర అదేనా?
Before You Go
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Frequently Asked Questions
'బిగ్ బాస్ అగ్నిపరీక్ష సీజన్ 2' ఎప్పుడు ప్రారంభం కానుంది?
'బిగ్ బాస్ అగ్నిపరీక్ష సీజన్ 2' ఆడిషన్స్‌లో ఎలాంటి సమస్యలు వచ్చాయి?
ఆడిషన్స్‌లో మోసాలు, డర్టీ పాలిటిక్స్ జరిగాయని గుసగుసలు ఉన్నాయి. జ్యూరీ సభ్యులు, కంటెస్టెంట్‌ల మధ్య గొడవలు కూడా జరిగాయి.
అభిజిత్, ఒక కంటెస్టెంట్ మధ్య గొడవ ఎందుకు జరిగింది?
'బిగ్ బాస్ షో తర్వాత మీరు ఎక్కడా కనిపించలేదు' అని ఒక కంటెస్టెంట్ అభిజిత్ కెరీర్‌పై వ్యాఖ్యానించడంతో అభిజిత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ కంటెస్టెంట్‌ను బయటకు పంపించేశారు.
'బిగ్ బాస్ అగ్నిపరీక్ష' ఆడిషన్స్‌కు న్యాయ నిర్ణేతలు ఎవరు?
నవదీప్, అభిజీత్, బిందు మాధవి ఈ ఆడిషన్స్‌కు జడ్జీలుగా వ్యవహరించారు. వారిలో ఒక్కరు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా మళ్ళీ అవకాశం ఇచ్చారట.
ట్రెండింగ్ వార్తలు





















