అన్వేషించండి

Kakinada Fire Cracker Explosion: బాణసంచా తయారీ కేంద్రం వద్ద అంతా బూడిదే.. ముక్కలుగా మృతదేహాలు, భయానక దృశ్యాలు

Kakinada Fire Cracker Explosion | కాకినాడ జిల్లా సామర్లకోట మండలంలో వేట్లపాలెం - మేడపాడు గ్రామాల మధ్య ఓ బాణసంచా తయారీ కేంద్రంలో పేలుడులో ప్రాణ నష్టం సంభవించింది. మృతదేహాలు ముక్కలుగా పడిపోయాయి.

సామర్లకోట: కాకినాడ జిల్లా సామర్లకోట మండలంలోని వేట్లపాలెం, మేడపాడు గ్రామాల మధ్య ఉన్న ఒక బాణసంచా తయారీ కేంద్రంలో శనివారం భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాద ధాటికి తయారీ కేంద్రం మంటల్లో కాలి బూడిదైంది. ఈ పేలుడు ఘటనలో 18 మంది కార్మికులు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారని తెలుస్తోంది. మృతుల్లో మహిళలే ఎక్కువగా ఉన్నారని స్థానికులు తెలిపారు. గాయపడిన వారిని కాకినాడ జీజీహెచ్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. చుట్టుపక్కల 5 గ్రామాల పరిధిలో దట్టమైన పొగ అలుముకుందని, అసలేం జరిగిందా అని భయాందోళనకు గురైనట్లు చెబుతున్నారు.

ప్రమాదం జరిగిన సమయంలో కొంతమంది మహిళా కార్మికులు మందుగుండు సామాగ్రిని తయారు చేస్తున్నారు. ఒక్కసారిగా పేలుడు సంభవించడంతో బాణసంచా తయారు చేస్తున్న కార్మికుల శరీరాలు ముక్కలు ముక్కలుగా కొంతదూరం వరకు పడ్డాయి. ఘటనా స్థలం యుద్ధ వాతావరణాన్ని తలిపించేలా హృదయవిదారకరంగా మారింది. స్థానికులు, అధికారులు స్పందించి, క్షతగాత్రులను వెంటనే అంబులెన్స్‌లో చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.Kakinada Fire Cracker Explosion: బాణసంచా తయారీ కేంద్రం వద్ద అంతా బూడిదే.. ముక్కలుగా మృతదేహాలు, భయానక దృశ్యాలు

అప్పటివరకూ ఎంతో ప్రశాంతంగా ఎప్పటిలాగే కార్మికులు బాణసంచా తయారీ చేస్తున్నారు. మధ్యాహ్నం సమయంలో ఒక్కసారిగా తయారీ కేంద్రంలో భారీ శబ్ధంతో పేలుడు సంభవించింది. శబ్ధం విన్న చుట్టుపక్కల వారు వెంటనే అక్కడికి చేరుకునే సరికి.. అక్కడ మొత్తం బూడిదగా మారింది. బాణసంచా తయారు చేస్తున్న కార్మికుల మృతదేహాలు గుర్తుపట్టలేనట్లుగా మారాయి. కొందరి కాళ్లు, చేతులు, ఇతర శరీర భాగాలు ముక్కలై కొంత దూరంలో ఎగిరిపడ్డాయంటే ఏ స్థాయిలో పేలుడు సంభవించిందో అర్థమవుతోంది. చుట్టుపక్కల 4, 5 కిలోమీటర్ల వరకు పేలుడు శబ్ధం వినిపించినట్లు స్థానికులు చెబుతున్నారు.

రంగంలోకి కలెక్టర్, ఎస్పీ.. సహాయక చర్యలు ముమ్మరం
సామర్లకోట మండలం వేట్లపాలెం వద్ద బాణాసంచా తయారీ కేంద్రంలో జరిగిన భారీ పేలుడు ఘటన జిల్లాను ఉలిక్కిపడేలా చేసింది. ప్రమాద సమాచారం అందిన వెంటనే జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. ప్రమాద తీవ్రత దృష్ట్యా జిల్లా కలెక్టర్ షణ్మోహన్, జిల్లా ఎస్పీ బిందు మాధవ్ వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్నారు. స్వయంగా పరిస్థితులను పర్యవేక్షిస్తూ, సహాయక చర్యలను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. Kakinada Fire Cracker Explosion: బాణసంచా తయారీ కేంద్రం వద్ద అంతా బూడిదే.. ముక్కలుగా మృతదేహాలు, భయానక దృశ్యాలు

రెవెన్యూ & పోలీస్ సిబ్బంది సంఘటనా స్థలంలో సహాయక చర్యలను సమన్వయం చేస్తున్నారు. అగ్నిమాపక శాఖ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చి, శిథిలాల కింద ఉన్న వారిని వెలికితీసేందుకు శ్రమిస్తున్నారు. క్షతగాత్రులకు తక్షణ చికిత్స అందేలా చర్యలు తీసుకుంటున్నారు.


Kakinada Fire Cracker Explosion: బాణసంచా తయారీ కేంద్రం వద్ద అంతా బూడిదే.. ముక్కలుగా మృతదేహాలు, భయానక దృశ్యాలు

జీజీహెచ్‌కు క్షతగాత్రుల తరలింపు
ప్రమాదంలో గాయపడిన వారిని 108 అంబులెన్స్‌ల ద్వారా చికిత్స నిమిత్తం కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రి (GGH)కి తరలించారు. అక్కడ వారికి మెరుగైన వైద్యం అందించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. కాగా, ఈ ప్రమాదానికి గల పూర్తి కారణాలు, మృతుల సంఖ్యపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఉన్నతాధికారులు ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలిస్తున్నారు. 


Kakinada Fire Cracker Explosion: బాణసంచా తయారీ కేంద్రం వద్ద అంతా బూడిదే.. ముక్కలుగా మృతదేహాలు, భయానక దృశ్యాలు

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

MLA Chintamaneni Prabhakar: వెదురుపావులూరు టోల్ ప్లాజా ఘటనలో ఎమ్మెల్యే చింతమనేని ఏ సంబంధం లేదు, అసలేం జరిగిందంటే
వెదురుపావులూరు టోల్ ప్లాజా ఘటనలో ఎమ్మెల్యే చింతమనేని ఏ సంబంధం లేదు, అసలేం జరిగిందంటే
World Tourism Day Arrangements: ఏపీ పర్యాటకానికి సోషల్ మీడియా బూస్ట్.. పర్యాటక ప్రాంతాలకు గ్లోబల్ ప్రచారం.. ఇన్‌ఫ్లూయెన్సర్లతో మంత్రి దుర్గేష్ బంతి భోజనాలు
ఏపీ పర్యాటకానికి సోషల్ మీడియా బూస్ట్.. పర్యాటక ప్రాంతాలకు గ్లోబల్ ప్రచారం
Janasena Politcis: కూటమి బలంగా నిలబడాలి.. జనసేన గౌరవానికి భంగం వాటిల్లకూడదు: పిఠాపురంలో పవన్ కళ్యాణ్
కూటమి బలంగా నిలబడాలి.. జనసేన గౌరవానికి భంగం వాటిల్లకూడదు: పిఠాపురంలో పవన్ కళ్యాణ్
Deputy CM Pawan Kalyan: పిఠాపురంలో రూ. 6 కోట్లతో 11 చెరువుల సుందరీకరణ.. పీఠికాపుర వనం ప్రారంభించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
పిఠాపురంలో రూ. 6 కోట్లతో 11 చెరువుల సుందరీకరణ.. పీఠికాపుర వనం ప్రారంభించిన పవన్ కళ్యాణ్

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad Crime News: ఇలా వచ్చి అలా దోచేసి.. 11 నిమిషాల్లో రూ.2.5 కోట్ల బంగారం దోపిడీ- మేడిపల్లిలో ఘటన
ఇలా వచ్చి అలా దోచేసి.. 11 నిమిషాల్లో రూ.2.5 కోట్ల బంగారం దోపిడీ- మేడిపల్లిలో ఘటన
AP Local Body Elections BC Reservations: బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సాధ్యం కాని హామీ - అయినా మభ్యపెట్టేందుకు పార్టీలెందుకు ప్రయత్నిస్తాయి?
బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సాధ్యం కాని హామీ - అయినా మభ్యపెట్టేందుకు పార్టీలెందుకు ప్రయత్నిస్తాయి?
Telangana Governor Quota MLC: తెలంగాణ గవర్నర్ కోటా ఎమ్మెల్సీలు - బీసీ, ఎస్సీలకే చాన్స్ - కొండా లక్ష్మణ్ బాపూజీ కుటుంబానికి ఓ సీటు?
తెలంగాణ గవర్నర్ కోటా ఎమ్మెల్సీలు - బీసీ, ఎస్సీలకే చాన్స్ - కొండా లక్ష్మణ్ బాపూజీ కుటుంబానికి ఓ సీటు?
AP Dasara Holidays: ఏపీలో ఈ 12 నుంచి దసరా సెలవులు.. అంతకుముందే విద్యార్థులకు పండుగ
ఏపీలో ఈ నెల 12 నుంచి దసరా సెలవులు.. అంతకుముందే విద్యార్థులకు పండుగ
SIR Astrological Analysis: ఓటర్ల జాబితాపై వివాదం, SIR కేసు ఎలాంటి మలుపు తిరగబోతోంది? జ్యోతిష్య అంచనాలతో రాజకీయ ప్రకంపనలు!
ఓటర్ల జాబితాపై వివాదం, SIR కేసు ఎలాంటి మలుపు తిరగబోతోంది? జ్యోతిష్య అంచనాలతో రాజకీయ ప్రకంపనలు!
Rice Flour For Skin : రైస్ వాటర్ మాత్రమే కాదు.. బియ్యపు పిండితోనూ గ్లోయింగ్ స్కిన్ సొంతం చేసుకోవచ్చు.. ఇలా అప్లై చేయండి
రైస్ వాటర్ మాత్రమే కాదు.. బియ్యపు పిండితోనూ గ్లోయింగ్ స్కిన్ సొంతం చేసుకోవచ్చు.. ఇలా అప్లై చేయండి
BC Reservations In AP: బీసీ రిజర్వేషన్లపై ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు కీలక ఆదేశాలు.. అక్టోబర్ 28 వరకు డెడ్‌లైన్
బీసీ రిజర్వేషన్లపై ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు కీలక ఆదేశాలు.. అక్టోబర్ 28 వరకు డెడ్‌లైన్
WagonR కొనుగోలుపై రూ. 64,600 డిస్కౌంట్ ఇస్తున్న మారుతి కంపెనీ.. ఆఫర్ పూర్తి వివరాలు
WagonR కొనుగోలుపై రూ. 64,600 డిస్కౌంట్ ఇస్తున్న మారుతి కంపెనీ.. ఆఫర్ పూర్తి వివరాలు
Embed widget