అన్వేషించండి

Kaleshwaram Project Report: కాళేశ్వరం బ్యారేజీల కింద భూగర్భ సమస్యలు.. జీపీఆర్ పరీక్షలపై CWPRS నివేదికలో సంచలన విషయాలు!

CWPRS Report On Kaleshwaram Project | కాళేశ్వరం బ్యారేజీల కింద ఖాళీలు, ఇసుక జారడం వంటి భూగర్భ సమస్యలను జీపీఆర్ పరీక్షలలో CWPRS గుర్తించినట్లు తెలంగాణ ప్రభుత్వానికి రిపోర్ట్ ఇచ్చింది.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • కాళేశ్వరం బ్యారేజీల భూగర్భ లోపాలను జీపీఆర్ పరీక్షలు గుర్తించాయి.
  • మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల వద్ద ఖాళీలు, శిథిల రాళ్లున్నాయి.
  • ఏడు మేడిగడ్డ వెంట్స్ కింద తీవ్ర లోపాలు, తదుపరి పరీక్షలు అవసరం.

హైదరాబాద్: తెలంగాణలో రాజకీయంగా వివాదాస్పద అంశాల్లో ప్రతిష్టాత్మక కాళేశ్వరం ప్రాజెక్ట్ అతిముఖ్యమైనది. భారీ ఖర్చుతో నిర్మించిన ప్రాజెక్టుపై బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల మధ్య మూడేళ్ల నుంచి మాటల యుద్ధం కొనసాగుతోంది. ఈ క్రమంలో కాళేశ్వరం ఎత్తిపోతల పథకానికి సంబంధించి మరో కీలక విషయం బయటపడింది. ఈ ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ, అన్నారం, మరియు సుందిళ్ల బ్యారేజీల దిగువన భూగర్భంలో అనేక సాంకేతిక లోపాలు ఉన్నట్లు గ్రౌండ్ పెనట్రేటింగ్ రాడార్ (GPR) పరీక్షలలో తేలింది. బ్యారేజీల కొన్ని వెంట్స్ (నీరు ప్రవహించే మార్గాలు) కింద ఖాళీ ప్రదేశాలు ఏర్పడి నీరు చేరడం (కేవిటీస్), పెద్ద పరిమాణంలో బోల్డర్లు, దెబ్బతిన్న రాతి పొరలు,  రాళ్ల దిగువ భాగాన పూడిక పేరుకుపోవడం వంటి సమస్యలు ఉన్నట్లు  గుర్తించారు. ఈ జియోఫిజికల్ పరిశీలనల ఆధారంగా పుణెలోని ప్రసిద్ధ కేంద్ర జల, విద్యుత్తు పరిశోధనా సంస్థ (CWPRS) డైరెక్టరు సెల్వబాలన్ ఒక సమగ్ర నివేదికను తెలంగాణ నీటిపారుదల శాఖకు పంపారు. 

జీపీఆర్ పరీక్షలు చేసిన సీడబ్ల్యూపీఆర్‌ఎస్‌
3 బ్యారేజీల దిగువన సుమారు 30 మీటర్ల లోతు వరకు భూగర్భంలో ఉన్న పరిస్థితులు, సీపేజీ మార్గాలు, అనామలీస్‌ (భిన్నమైన పరిస్థితులు)ను అధ్యయనం చేయడానికి ఈ అధునాతన జీపీఆర్ పరీక్షలను సీడబ్ల్యూపీఆర్‌ఎస్‌ నిర్వహించింది. ఈ అధ్యయనంలో భాగముగా మూడు బ్యారేజీల్లోని మొత్తం 225 వెంట్లకు గాను 217 వెంట్స్ వద్ద  క్షేత్రస్థాయి అధ్యయనాలు జరిగాయి. ఈ నివేదికలోని వివరాల ప్రకారం, మేడిగడ్డ బ్యారేజీలోని 7 వెంట్స్ దిగువన అత్యంత తీవ్రమైన అనామలీస్ నమోదయ్యాయి. 

కీలకమైన మేడిగడ్డలోని 7వ బ్లాక్‌కు చెందిన 17, 18, 19, 20, 21 వెంట్లలోనూ, 8వ బ్లాక్‌లోని 7వ వెంట్‌లోనూ, 5వ బ్లాక్‌లోని 35వ వెంట్‌లోనూ ఈ భూగర్భ లోపాలను  గుర్తించినట్లు నివేదికలో తెలిపారు. ఇదే ప్రాజెక్టులోని అన్నారం బ్యారేజీలోని 5వ బ్లాక్‌లో ఉన్న 47వ వెంట్ ఎగువ భాగంలోనూ, సుందిళ్ల బ్యారేజీలో 25, 31, మరియు 53వ వెంట్స్ వద్ద ఎగువ, దిగువ ప్రాంతాలలో సమస్యలు ఉన్నట్లు తేలింది. ఈ 3 బ్యారేజీలలో కలిపి మొత్తం 11 వెంట్స్ కింద మాత్రమే ఎలాంటి సమస్యలు లేదా అనామలీస్ లేవని, మిగతా వాటిలో చిన్న సమస్యలు ఉన్నాయని నివేదికలో వెల్లడించినట్లు సమాచారం. 

Also Read: Revanth Reddy Criminal Waste Remarks: రేవంత్ రెడ్డి క్రిమినల్ వేస్ట్ కామెంట్స్ కలకలం - కాక్రోచ్ తరహాలో క్రిమినల్ వేస్ట్ పార్టీ ఆవిర్భవిస్తుందా?

నిర్మాణ లోపాలను ఈ పరీక్షలు నిర్ధారించలేదు
మేడిగడ్డ వద్ద నీటి ఉధృత ప్రవాహాల కారణంగా ఇసుక కొట్టుకుపోయి, రాఫ్ట్ దిగువన పెద్ద ఎత్తున శూన్య ప్రాంతాలు ఏర్పడ్డాయి. 6 వెంట్స్ వద్ద పదికి పైగా విభిన్నమైన అనామలీస్ జోన్లను శాస్త్రవేత్తలు నమోదు చేశారు. ఇటువంటి పరిస్థితులు నీటి అంతర్గత సీపేజ్, పైపింగ్ వంటి ప్రమాదకర పరిణామాలకు దారితీసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే, జీపీఆర్ పరీక్షలు కేవలం భూగర్భ పరిస్థితులను అంచనా వేయడానికి మాత్రమే పరిమితమని, నేరుగా స్ట్రక్చరల్ లోపాలను ఇవి నిర్ధారించలేవని సీడబ్ల్యూపీఆర్‌ఎస్ స్పష్టం చేసింది. అందువల్ల పునరావాస లేదా మరమ్మతు పనులు ప్రారంభించే ముందు బోర్‌హోల్, కోర్ డ్రిల్లింగ్, ఎలక్ట్రికల్ రెసిస్టివిటీ టోమోగ్రఫీ (ERT) వంటి ఇంజినీరింగ్ పరీక్షలు నిర్వహించడం అనివార్యమని సూచించింది.

ప్రాజెక్టు బ్యారేజీల నిర్మాణ సమయంలో ముందస్తు భూగర్భ అన్వేషణ పరీక్షలు చేపట్టకపోవడం వల్లే ఈ సమస్యలు ముందుగా గుర్తించలేకపోయినట్లు ఇంజినీరింగ్ టీమ్ పేర్కొంది. తెలంగాణ ప్రభుత్వం ఈ నివేదికను బయటపెట్టడం గానీ, మంత్రులు, రాష్ట్ర ఇరిగేషన్ శాఖ అధికారులు గానీ కేంద్ర జల, విద్యుత్తు పరిశోధనా సంస్థ ( సీడబ్ల్యూపీఆర్‌ఎస్‌) నివేదికపై స్పందిస్తే మరింత క్లారిటీ రానుంది.  

Frequently Asked Questions

కాళేశ్వరం ప్రాజెక్టులో ప్రధానంగా గుర్తించిన లోపాలు ఏమిటి?

మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల కింద భూగర్భంలో ఖాళీ ప్రదేశాలు, దెబ్బతిన్న రాతి పొరలు, పూడిక పేరుకుపోవడం వంటి సాంకేతిక లోపాలు ఉన్నట్లు గుర్తించారు. ఈ సమస్యలు ప్రాజెక్టు సురక్షితత్వానికి ప్రమాదకరం.

ఈ లోపాలను ఏ పరీక్షల ద్వారా గుర్తించారు?

గ్రౌండ్ పెనట్రేటింగ్ రాడార్ (GPR) పరీక్షల ద్వారా ఈ భూగర్భ లోపాలను గుర్తించారు. పుణెలోని కేంద్ర జల, విద్యుత్తు పరిశోధనా సంస్థ (CWPRS) ఈ పరీక్షలు నిర్వహించి నివేదిక సమర్పించింది.

ఏ బ్యారేజీలలో తీవ్రమైన లోపాలు వెల్లడయ్యాయి?

మేడిగడ్డ బ్యారేజీలోని ఏడు వెంట్స్ దిగువన అత్యంత తీవ్రమైన అనామలీస్ నమోదయ్యాయి. అన్నారం, సుందిళ్ల బ్యారేజీలలో కూడా కొన్ని వెంట్స్ వద్ద సమస్యలు గుర్తించారు.

జీపీఆర్ పరీక్షల పరిమితులు ఏమిటి?

జీపీఆర్ పరీక్షలు కేవలం భూగర్భ పరిస్థితులను అంచనా వేస్తాయి, కానీ నిర్మాణ లోపాలను నేరుగా నిర్ధారించలేవు. మరింత ఖచ్చితత్వానికి బోర్‌హోల్ వంటి ఇతర ఇంజినీరింగ్ పరీక్షలు అవసరం.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Rayadurgam Land Auction: రాయదుర్గం భూములకు రికార్డు ధర.. TGIIC వేలంలో రూ.264 కోట్లు పలికిన ఎకరా భూమి
రాయదుర్గం భూములకు రికార్డు ధర.. TGIIC వేలంలో రూ.264 కోట్లు పలికిన ఎకరా భూమి
Supreme Court: రాయదుర్గం భూముల వేలానికి లైన్ క్లియర్... స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరణ
రాయదుర్గం భూముల వేలానికి లైన్ క్లియర్... స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరణ
Revanth Reddy US Visit Cancelled: రేవంత్ అమెరికా పర్యటన రద్దుకు కారణమేంటి? సీఎంల విదేశీ టూర్లకు కేంద్రం అనుమతి ఎందుకు? కాదని వెళ్తే ఏమవుతుంది?
రేవంత్ అమెరికా పర్యటన రద్దుకు కారణమేంటి? సీఎంల విదేశీ టూర్లకు కేంద్రం అనుమతి ఎందుకు? కాదని వెళ్తే ఏమవుతుంది?
CM Revanth's US trip cancelled | లండన్‌లో ఆగిన రేవంత్.. కేంద్ర అనుమతి నిరాకరణకు కారణమేంటి??
CM Revanth's US trip cancelled | లండన్‌లో ఆగిన రేవంత్.. కేంద్ర అనుమతి నిరాకరణకు కారణమేంటి??
Advertisement

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rahul Gandhi: పట్టువదలని రాహుల్ గాంధీ.. ఎట్టకేలకు FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
రాహుల్ గాంధీ తగ్గేదేలే.. పెల్లెట్ గన్ వినియోగంపై FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
Supreme Court: రాయదుర్గం భూముల వేలానికి లైన్ క్లియర్... స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరణ
రాయదుర్గం భూముల వేలానికి లైన్ క్లియర్... స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరణ
Konda Surekha: తెలంగాణ మంత్రి కొండా సురేఖపై కాంగ్రెస్ ఎమ్మెల్యేల తిరుగుబాటు! బర్తరఫ్‌ చేయాలని డిమాండ్!
తెలంగాణ మంత్రి కొండా సురేఖపై కాంగ్రెస్ ఎమ్మెల్యేల తిరుగుబాటు! బర్తరఫ్‌ చేయాలని డిమాండ్!
Revanth Reddy US Visit Cancelled: రేవంత్ అమెరికా పర్యటన రద్దుకు కారణమేంటి? సీఎంల విదేశీ టూర్లకు కేంద్రం అనుమతి ఎందుకు? కాదని వెళ్తే ఏమవుతుంది?
రేవంత్ అమెరికా పర్యటన రద్దుకు కారణమేంటి? సీఎంల విదేశీ టూర్లకు కేంద్రం అనుమతి ఎందుకు? కాదని వెళ్తే ఏమవుతుంది?
CM Revanth's US trip cancelled | లండన్‌లో ఆగిన రేవంత్.. కేంద్ర అనుమతి నిరాకరణకు కారణమేంటి??
CM Revanth's US trip cancelled | లండన్‌లో ఆగిన రేవంత్.. కేంద్ర అనుమతి నిరాకరణకు కారణమేంటి??
KTR Comments on Voters: ఇప్పటికీ ప్రజలే తప్పు చేశారంటున్న కేటీఆర్ - ఇది రాజకీయ వ్యూహమా? ప్రజల్ని కించపర్చడమా?
ఇప్పటికీ ప్రజలే తప్పు చేశారంటున్న కేటీఆర్ - ఇది రాజకీయ వ్యూహమా? ప్రజల్ని కించపర్చడమా?
Irumudi Review - 'ఇరుముడి' రివ్యూ: సెంటిమెంట్‌తో కొట్టిన రవితేజ... మాస్ కాదు, ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా ఎలా ఉందంటే?
'ఇరుముడి' రివ్యూ: సెంటిమెంట్‌తో కొట్టిన రవితేజ... మాస్ కాదు, ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా ఎలా ఉందంటే?
Embed widget