అన్వేషించండి

Revanth Reddy Criminal Waste Remarks: రేవంత్ రెడ్డి క్రిమినల్ వేస్ట్ కామెంట్స్ కలకలం - కాక్రోచ్ తరహాలో క్రిమినల్ వేస్ట్ పార్టీ ఆవిర్భవిస్తుందా?

Revanth Reddy: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇంజినీరింగ్ విద్యార్థులపై చేసిన క్రిమినల్ వేస్ట్ వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. జెన్ జీ విద్యార్థులు కాక్రోచ్ తరహాలో క్రిమినల్ వేస్ట్ పార్టీ పెడతారా?

Cockroach Trend vs Criminal Waste Protest:  తెలంగాణ ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్ల ఉద్యోగార్హతలు, స్కిల్స్ లోపంపై మాట్లాడుతూ చేసిన  క్రిమినల్ వేస్ట్  వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర తుఫాను రేపాయి. ఏటా 1.10 లక్షల మంది ఇంజినీరింగ్ పట్టాలు పొందుతున్నా కనీసం ఒక ఉద్యోగ దరఖాస్తు కూడా సొంతంగా నింపలేకపోతున్నారని, ఇది విద్యావ్యవస్థ పరిధిలో క్రిమినల్ వేస్ట్ అని ఆయన వ్యాఖ్యానించడం విమర్శలకు దారితీసింది.  ఈ కామెంట్లపై ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ తో పాటు బీజేపీ నేత ఈటల రాజేందర్ వంటి వారు యువతను కించపర్చారని రేవంత్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. 

జెన్ జీకి క్షమాపణలు చెప్పాలంటున్న బీఆర్ఎస్

ఈ క్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రులు హరీష్ రావు, జగదీష్ రెడ్డిలు రేవంత్ రెడ్డిపై విరుచుకుపడ్డారు. సీఎం వెంటనే విద్యార్థులకు, ఉపాధ్యాయులకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రొఫెషనల్ అర్హతలు, కనీస పోటీ పరీక్ష రాసిన అనుభవం లేని సీఎం యువత ఆత్మగౌరవాన్ని దెబ్బతీశారని ఆరోపిస్తూ,  జెన్-జీ యువత ,  ఇంజినీరింగ్ విద్యార్థులు ఈ వ్యాఖ్యలపై తిరగబడాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. డిజిటల్ మాధ్యమాల్లో రేవంత్ వ్యాఖ్యలపై విద్యార్థుల నిరసనను ఒక రాజకీయ ఉద్యమంగా మార్చేందుకు బీఆర్ఎస్, బీజేపీ సోషల్ మీడియా విభాగాలు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నాయి.

కాక్రోచ్ తరహాలో క్రిమినల్ వేస్ట్ పార్టీ? 

తాజాగా సోషల్ మీడియాలో కాక్రోచ్  అనే పదాన్ని ఒక విమర్శగా ఉపయోగించినప్పుడు, దాన్ని ప్రతిఘటిస్తూ  కాక్రోచ్ జనతా పార్టీ  ఎలా పుట్టుకొచ్చిందో, సరిగ్గా అలాగే ఇప్పుడు రేవంత్ వ్యాఖ్యలను రీ-బ్రాండ్ చేస్తూ క్రిమినల్ వేస్ట్  అనే ట్యాగ్‌ను విద్యార్థులు ఒక నిరసన చిహ్నంగా మలుచునేలా చేసేందుకు రాజకీయ పార్టీలు ప్రోత్సాహం ఇస్తున్నాయి.  మేము క్రిమినల్ వేస్ట్ కాము.. నవ తెలంగాణ నిర్మాతలము  అనే హ్యాష్‌ట్యాగ్‌లు, మీమ్‌లు, షార్ట్ వీడియోలతో జెన్-జీ తీవ్రస్థాయిలో రీ-కౌంటర్లు ఇస్తోంది. ఈ భావోద్వేగాన్ని ప్రతిపక్షాలు క్యాష్ చేసుకోవడానికి క్రిమినల్ వేస్టే  పార్టీ పెట్టేలా యువజన సమూహాలను ఆన్‌లైన్ వేదికగా ప్రోత్సహించేందుకు సిద్ధమవుతున్నాయి.

ట్రెండ్‌ను బట్టే రాజకీయం

భారత రాజకీయాల్లో ముఖ్యంగా పొలిటికల్ మీమ్‌లతో ఆడుకునే ప్రస్తుత జెన్-జీ తరం ఎప్పటికప్పుడు సరికొత్త నెరేటివ్‌లను సృష్టిస్తుంది. ఒక వివాదాస్పద పదాన్ని పట్టుకుని దాన్నే ఒక ఐడెంటిటీగా మార్చుకోవడం గ్లోబల్ డిజిటల్ ట్రెండ్. గతంలో కేటీఆర్, ఇతర నేతలు ఉపయోగించిన పదాలను కాంగ్రెస్ ట్రోల్ చేయగా, ఇప్పుడు కాంగ్రెస్ సీఎం వ్యాఖ్యలను బీఆర్ఎస్ అస్త్రంగా మార్చుకుంది. డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లపై విద్యార్థులు ఆత్మగౌరవ నిరసనలు తెలుపడానికి ప్రతిపక్ష పార్టీలు వెనకుండి బ్యాకింగ్, టెక్నికల్ సపోర్ట్, ట్రెండింగ్ ప్రోత్సాహాన్ని అందించడం ఖాయంగా కనిపిస్తోంది.

రేవంత్ అన్నది విద్యార్థుల్ని కాదు.. విద్యా వ్యవస్థని!

అయితే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యల వెనుక ఉన్న అసలు ఉద్దేశం విద్యాసంస్కరణలేనని కాంగ్రెస్ వర్గాలు సమర్థిస్తున్నాయి. డిగ్రీలు ఉన్నా స్కిల్స్ లేని విద్యార్థులను తీర్చిదిద్దడానికి జర్మనీ, ఫిన్లాండ్ మోడల్స్‌లో మొదటి రెండేళ్లు బేసిక్ విద్య, చివరి రెండేళ్లు ప్రాక్టికల్ విదేశీ లాంగ్వేజెస్, అప్రెంటిస్‌షిప్ నైపుణ్యాలు ఇవ్వడమే తమ ప్రభుత్వ లక్ష్యమని వారు పేర్కొంటున్నారు. అయితే, విధానపరమైన లోపాన్ని ఎత్తిచూపే క్రమంలో వాడిన క్రిమినల్ వేస్ట్  అనే పదం కమ్యూనికేషన్ ఫెయిల్యూర్‌గా మారి, రాజకీయ ప్రత్యర్థులకు రాజకీయ ఆయుధంగా మారింది.  రాజకీయ ప్రయోజనాల కోసం ప్రతిపక్షాలు  జెన్-జీ అసంతృప్తిని క్రిమినల్ వేస్ట్ ఉద్యమంగా మార్చేందుకు ఎంత ప్రయత్నించినా, అది ఎంతకాలం మనుగడ సాగిస్తుందనేది ఆసక్తికరంగా మారింది.  

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Vijayasai Reddy: దసరా పండుగకు పార్టీ జెండా, ఎజెండా సిద్ధం.. విజయసాయిరెడ్డి కీలక ప్రకటన
దసరా పండుగకు పార్టీ జెండా, ఎజెండా సిద్ధం.. విజయసాయిరెడ్డి కీలక ప్రకటన
Telangana SIR Electoral Roll Purge: ఓట్ల తొలగింపుపై గల్లీ మౌనం - రికార్డు స్థాయి కోతలు జరుగుతున్నా రోడ్డెక్కని బాధితుల పోరాటాలు!
ఓట్ల తొలగింపుపై గల్లీ మౌనం - రికార్డు స్థాయి కోతలు జరుగుతున్నా రోడ్డెక్కని బాధితుల పోరాటాలు!
Jagan Cases ED Speed Up: జగన్, వివేకా కేసుల్లో ఈడీ దూకుడుకు రాజకీయ మార్పులు కారణమా? వైఎస్ఆర్‌సీపీ వ్యూహం ఏమిటి?
జగన్, వివేకా కేసుల్లో ఈడీ దూకుడుకు రాజకీయ మార్పులు కారణమా? వైఎస్ఆర్‌సీపీ వ్యూహం ఏమిటి?
AP Local Body Elections: కొలిక్కిరాని చర్చలు.. నేడు పవన్ కళ్యాణ్‌తో టీడీపీ నేతల భేటీ- చంద్రబాబుతో మాధవ్‌ సమావేశం
కొలిక్కిరాని చర్చలు.. నేడు పవన్ కళ్యాణ్‌తో టీడీపీ నేతల భేటీ- చంద్రబాబుతో మాధవ్‌ సమావేశం
Advertisement

వీడియోలు

Dussehra in Telangana and Andhra Pradesh | బతుకమ్మ కేవలం తెలంగాణలోనే ఎందుకు చేస్తారు?
Uses of GPS Vests Worn by Cricket Players | ప్లేయర్స్ వేసుకునే జీపీఎస్ జాకెట్ తో లాభం ఏంటి?
400-Year History of Mysore Dussehra 2026 | ప్రపంచ ప్రసిద్ధ మైసూర్ దసరా ప్రత్యేకత
Virat Kohli Test Retirement & Ajit Agarkar | కోహ్లీ రిటైర్మెంట్‌పై వసీం జాఫర్ సంచలన వ్యాఖ్యలు
Tilak Varma Fist Bump Runout vs West Indies | వెస్టిండీస్‌పై తిలక్ వర్మ మైండ్ బ్లాంక్ రనౌట్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vijayasai Reddy: దసరా పండుగకు పార్టీ జెండా, ఎజెండా సిద్ధం.. విజయసాయిరెడ్డి కీలక ప్రకటన
దసరా పండుగకు పార్టీ జెండా, ఎజెండా సిద్ధం.. విజయసాయిరెడ్డి కీలక ప్రకటన
Viral News: స్వీట్ బాక్స్ అడిగితే ఇల్లు ఖాళీ చేసే వరకు వదల్లేదు.. ఇన్‌ఫ్లుయెన్సర్‌కు చేదు అనుభవం!
స్వీట్ బాక్స్ అడిగితే ఇల్లు ఖాళీ చేసే వరకు వదల్లేదు.. ఇన్‌ఫ్లుయెన్సర్‌కు చేదు అనుభవం!
Jagan Cases ED Speed Up: జగన్, వివేకా కేసుల్లో ఈడీ దూకుడుకు రాజకీయ మార్పులు కారణమా? వైఎస్ఆర్‌సీపీ వ్యూహం ఏమిటి?
జగన్, వివేకా కేసుల్లో ఈడీ దూకుడుకు రాజకీయ మార్పులు కారణమా? వైఎస్ఆర్‌సీపీ వ్యూహం ఏమిటి?
Tamil Nadu Politics Shift: గో బ్యాక్ మోదీ నుంచి వెల్కమ్ మోదీ దాకా - తమిళ రాజకీయాల్లో చెరిగిపోతున్న కాషాయ ద్వేషం !
గో బ్యాక్ మోదీ నుంచి వెల్కమ్ మోదీ దాకా - తమిళ రాజకీయాల్లో చెరిగిపోతున్న కాషాయ ద్వేషం !
Papikondalu Tour: పాపికొండలు అందాలు చూసే వేళాయె.. నేటి నుంచి బోట్ల విహారయాత్ర తిరిగి ప్రారంభం
పాపికొండలు అందాలు చూసే వేళాయె.. నేటి నుంచి బోట్ల విహారయాత్ర తిరిగి ప్రారంభం
Babies Cry After Feeds : పిల్లలు పాలు తాగిన వెంటనే ఏడుస్తున్నారా? అది కడుపునొప్పి? లేక మరేదైనా సమస్యనా?
పిల్లలు పాలు తాగిన వెంటనే ఏడుస్తున్నారా? అది కడుపునొప్పి? లేక మరేదైనా సమస్యనా?
శ్రీశైలంలో శరన్నవరాత్రి 2026 Day 5: స్కందమాతగా భ్రమరాంబిక!
శ్రీశైలంలో శరన్నవరాత్రి 2026 Day 5: స్కందమాతగా భ్రమరాంబిక!
EV Tyres: ఎలక్ట్రిక్‌ కార్లకు సాధారణ కారు టైర్లు వాడుతున్నారా? ఈ తప్పులతో రేంజ్‌ తగ్గడమే కాదు.. ప్రమాదం కూడా!
సాధారణ కారు టైర్లు vs ఎలక్ట్రిక్‌ కార్‌ టైర్లు... రెండూ ఒకటి కాదా? తేడా ఏంటి?
Embed widget