అన్వేషించండి

CM Revanth Reddy: హకీంపేట ఎడ్యుకేషన్ హబ్ పనుల ఆలస్యంపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం.. అధికారులకు వార్నింగ్

హకీంపేట ఎడ్యుకేషన్ హబ్ నిర్మాణ పనుల్లో జాప్యంపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్లక్ష్యంగా ఉన్న అధికారులపై చర్యలకు, పనులు వేగవంతం చేయాలని కలెక్టర్‌ను ఆదేశించారు.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • సీఎం రేవంత్ హకీంపేట పాఠశాల నిర్మాణ జాప్యంపై తీవ్ర ఆగ్రహం.
  • పనులు వేగవంతం, కార్మికుల పెంపు, స్వయంగా పర్యవేక్షిస్తానని సీఎం.
  • కొడంగల్ ఎత్తిపోతల భూసేకరణ వెంటనే పూర్తిచేయాలని సీఎం ఆదేశం.
  • కొడంగల్ అభివృద్ధి, రోడ్లపై సీఎం దృష్టి, ఆగస్టు 30న సమీక్ష.

దుద్యాల: వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం హకీంపేట ఎడ్యుకేషన్ హబ్‌లో కొనసాగుతున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ భవన నిర్మాణ పనుల జాప్యంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్మాణ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన ఆయన, అధికారుల తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తాను గత 25 ఏళ్లుగా ప్రజా జీవితంలో ఉన్నానని, కాంట్రాక్టర్లు, అధికారుల పనితీరు తనకు బాగా తెలుసని సీఎం పేర్కొన్నారు. ఏడాది క్రితం పనులు మొదలుపెట్టినప్పటికీ.. ఇప్పటికీ పిల్లర్ల స్థాయిలోనే ఎందుకు నిలిచిపోయాయని ప్రశ్నించారు. ఇలాగైతే వచ్చే ఏడాది నుంచి ఇక్కడ తరగతులు ఎలా ప్రారంభిస్తారని అధికారులను నిలదీశారు. కాగితాలపై లెక్కలు చూపిస్తే నమ్మే వ్యక్తిని కానని స్పష్టం చేశారు.

అలా పనిచేస్తే విధుల్లోంచి తొలగిస్తాం.. అధికారులకు వార్నింగ్
గుట్టలు, కొండలతో కూడిన స్థలం కావడం వల్ల భూ కేటాయింపులు, ప్రారంభ పనుల్లో కొంత ఆలస్యం జరిగిందని ఈ సందర్భంగా TG EWIDC MD గణపతిరెడ్డి, సీఎంఓ ముఖ్య కార్యదర్శి శ్రీధర్  వివరించారు. గడిచిన 15 రోజులుగానే పనుల్లో వేగం పెరిగిందని సీఎంకు తెలియజేశారు. దీనిపై స్పందించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందిస్తూ.. సుమారు రూ. 200 కోట్ల భారీ వ్యయంతో చేపడుతున్న ఈ ప్రాజెక్టుకు తగినంత మంది నిపుణులైన కార్మికులు లేకుండా వేగంగా పూర్తి చేయడం సాధ్యపడదని చెప్పారు. నిర్లక్ష్యంగా వ్యవహరించే అధికారులను తక్షణమే విధుల్లోంచి తొలగించాలని, పనుల్లో ఏమాత్రం ఆలస్యం జరిగినా సహించేది లేదని వికారాబాద్ కలెక్టర్ దీపక్ తివారీని ఆదేశించారు.

పనుల వేగాన్ని పెంచేందుకు ప్రస్తుతం ఉన్న కార్మికుల సంఖ్యను 400కు పెంచామని, ఉదయం, సాయంత్రం రెండు షిఫ్టుల్లో పనులు నిర్వహించేలా ప్లాన్ రూపొందించామని అధికారులు వివరించారు. రాత్రి వేళ పనులకు తగినంత లైట్ల ఏర్పాటు లేకపోవడాన్ని సీఎం గుర్తించి, ఉదయం 5 గంటల నుంచే పనులు ప్రారంభించేలా 12 నుండి 13 గంటల వ్యవధిలో రెండు విడతల్లో కార్మికులతో పనులు చేయించాలని సూచించారు. ఇకపై ఈ పనుల ప్రగతిని నిరంతరం పర్యవేక్షించేందుకు నెలకు ఒకటి రెండు రోజులు హకీంపేట హబ్‌లోనే రాత్రి బస చేస్తానని, దానికి తగిన ఏర్పాట్లు చేయాలని కడా (KADA) అధికారి వెంకట్‌రెడ్డిని రేవంత్ రెడ్డి ఆదేశించారు.

Also Read: KTR Luxettipet Rythu Sadasu: మాది పోరంబోకు జాతి కాదు.. వలసపాలకుల సంక నాకే దగుల్బాజీ జాతి అసలే కాదు - రేవంత్‌కు కేటీఆర్ మాస్ కౌంటర్

కొడంగల్ ఎత్తిపోతల, అభివృద్ధి పనులపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష: భూసేకరణకు ఆదేశాలు
మక్తల్ - నారాయణపేట్ _ కొడంగల్ ఎత్తిపోతల ప్రాజెక్టు భూసేకరణ ప్రక్రియలో ఎలాంటి జాప్యం జరగడానికి వీల్లేదని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను స్పష్టంగా ఆదేశించారు. ఈ ఎత్తిపోతల ప్రాజెక్టు పురోగతితో పాటు కొడంగల్ నియోజకవర్గంలో కొనసాగుతున్న వివిధ అభివృద్ధి పనులపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు ప్రాజెక్ట్ పురోగతిపై పిపిటి ద్వారా వివరాలను అందించారు. భూసేకరణ వేగవంతం చేసేందుకు అవసరమైన సర్వేయర్ల నియామకానికి, నిధుల మంజూరుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి, త్వరితగతిన భూసేకరణ పూర్తి చేసి టెండర్ల ప్రక్రియను ప్రారంభించాలని స్పష్టం చేశారు.


CM Revanth Reddy: హకీంపేట ఎడ్యుకేషన్ హబ్ పనుల ఆలస్యంపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం.. అధికారులకు వార్నింగ్

కొడంగల్ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ కింద చేపట్టిన వివిధ అభివృద్ధి పనులను శాఖల వారీగా సీఎం రేవంత్ రెడ్డి సమగ్రంగా సమీక్షించి అధికారులకు కీలక సూచనలు చేశారు. కొడంగల్ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించిన ఆయన, రాబోయే ఆగస్టు 30న స్వయంగా నియోజకవర్గానికి వచ్చి పనుల పురోగతిని పునఃసమీక్షిస్తానని, అక్కడే బస చేస్తానని చెప్పారు. తన నియోజకవర్గంలోని ప్రతి గ్రామం, తండాలో రోడ్లు, ఇతర ప్రాథమిక మౌలిక వసతుల కల్పనపై సీఎం ప్రత్యేక ఆదేశాలు జారీ చేశారు. ఏ తండాలోనూ రోడ్డు లేదనే ఫిర్యాదు రాకూడదని, ప్రతీ గ్రామం నుంచి మండల కేంద్రానికి ఖచ్చితంగా బీటీ రోడ్డు అనుసంధానం ఉండాలని స్పష్టం చేశారు. 

కొత్తగా ఏర్పాటైన గ్రామ పంచాయతీలకు భవనాల నిర్మాణం వేగవంతం చేయాలని, పనులను నిరంతరం పర్యవేక్షించేందుకు ఈఈ (EE) స్థాయి అధికారిని ప్రత్యేకంగా నియమించాలని సూచించారు. మరోవైపు ఎల్‌నినో ప్రభావం, వర్షాభావ పరిస్థితుల ముప్పును దృష్టిలో ఉంచుకుని, నియోజకవర్గంలో ఎక్కడా తాగునీటి ఎద్దడి తలెత్తకుండా ఇప్పటి నుంచే పక్కా ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. 

Frequently Asked Questions

దుద్యాల హకీంపేట ఎడ్యుకేషన్ హబ్‌లో పనులు ఎందుకు ఆలస్యం అవుతున్నాయి?

గుట్టలు, కొండలతో కూడిన స్థలం కావడం వల్ల భూ కేటాయింపులు, ప్రారంభ పనుల్లో కొంత ఆలస్యం జరిగిందని అధికారులు వివరించారు. సీఎం దీనిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

హకీంపేట ప్రాజెక్టు పనుల వేగాన్ని పెంచడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు?

కార్మికుల సంఖ్యను 400కు పెంచి, రెండు షిఫ్టుల్లో పనులు నిర్వహించేలా ప్లాన్ చేశారు. పనుల పురోగతిని పర్యవేక్షించడానికి సీఎం స్వయంగా హబ్‌లో రాత్రి బస చేస్తానని ప్రకటించారు.

కొడంగల్ ఎత్తిపోతల ప్రాజెక్టు భూసేకరణపై సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలేమిటి?

భూసేకరణ ప్రక్రియలో ఎలాంటి జాప్యం జరగడానికి వీల్లేదని సీఎం స్పష్టం చేశారు. సర్వేయర్ల నియామకానికి, నిధుల మంజూరుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు.

కొడంగల్ నియోజకవర్గ అభివృద్ధికి సీఎం ఎలాంటి ప్రాధాన్యత ఇస్తున్నారు?

కొడంగల్ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించిన సీఎం, ఆగస్టు 30న నియోజకవర్గాన్ని సందర్శించి పనులను పునఃసమీక్షిస్తానని తెలిపారు. ప్రతి గ్రామం, తండాలో రహదారులు, ఇతర మౌలిక వసతులు కల్పించాలని ఆదేశించారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Hyderabad Bonalu Traffic Diversions: బోనాల పండుగ.. హైదరాబాద్‌లో 2 రోజులపాటు ట్రాఫిక్‌ మళ్లింపులు- ఈ రూట్లలో వెళ్తే జాగ్రత్త
బోనాల పండుగ.. హైదరాబాద్‌లో 2 రోజులపాటు ట్రాఫిక్‌ మళ్లింపులు- ఈ రూట్లలో వెళ్తే జాగ్రత్త
Aid for Peddi Sudarshan Reddy Family: పెద్ది సుదర్శన్ రెడ్డి ఫ్యామిలీకి బీఆర్ఎస్ పెద్ద సాయం.. స్వయంగా నర్సంపేటకు వెళ్లనున్న కేసీఆర్
పెద్ది సుదర్శన్ రెడ్డి ఫ్యామిలీకి బీఆర్ఎస్ పెద్ద సాయం.. స్వయంగా నర్సంపేటకు వెళ్లనున్న కేసీఆర్
Breaking News: పోక్సో కేసులో తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ కార్యదర్శి పృధ్వీశ్వర్ రెడ్డిపై బీఫ్ఐ సస్పెన్షన్!
పోక్సో కేసులో తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ కార్యదర్శి పృధ్వీశ్వర్ రెడ్డిపై బీఫ్ఐ సస్పెన్షన్!
Medical Student Incident: మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్
మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్
Advertisement

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
MLA Prem Sagar Rao: మంచిర్యాల అభివృద్ధిని చూసి ఓర్వలేక అవినీతి ఆరోపణలు, 2015లోనే లోన్ చెల్లించా: ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు
మంచిర్యాల అభివృద్ధిని చూసి ఓర్వలేక అవినీతి ఆరోపణలు, 2015లోనే లోన్ చెల్లించా: ప్రేమ్ సాగర్ రావు
Aid for Peddi Sudarshan Reddy Family: పెద్ది సుదర్శన్ రెడ్డి ఫ్యామిలీకి బీఆర్ఎస్ పెద్ద సాయం.. స్వయంగా నర్సంపేటకు వెళ్లనున్న కేసీఆర్
పెద్ది సుదర్శన్ రెడ్డి ఫ్యామిలీకి బీఆర్ఎస్ పెద్ద సాయం.. స్వయంగా నర్సంపేటకు వెళ్లనున్న కేసీఆర్
Viveka Murder Case: వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ
వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ
Medical Student Incident: మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్
మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్
Sai Sudharsan Ruled Out: శ్రీలంక టెస్ట్ సిరీస్ కు ముందు ఇండియాకు బిగ్ షాక్.. గాయంతో స్టార్ బ్యాటర్ అవుట్, పడిక్కల్ కి లక్కీ ఛాన్స్!
శ్రీలంక టెస్ట్ సిరీస్ కు ముందు ఇండియాకు బిగ్ షాక్.. గాయంతో స్టార్ బ్యాటర్ అవుట్, పడిక్కల్ కి లక్కీ ఛాన్స్!
32 Kg Weight Loss Journey : ఈ 5 ఫుడ్స్ మానేసి.. 32 కిలోలు తగ్గిన మహిళ, అసలు సీక్రెట్స్ ఇవే
ఈ 5 ఫుడ్స్ మానేసి.. 32 కిలోలు తగ్గిన మహిళ, అసలు సీక్రెట్స్ ఇవే
మొదటి జీతం రాగానే ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి ? FD, RD లేదా SIP లలో ఏది బెస్ట్ ఆప్షన్?
మొదటి జీతం రాగానే ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి ? FD, RD లేదా SIP లలో ఏది బెస్ట్ ఆప్షన్?
Pruthvishwar Reddy: లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
Embed widget