అన్వేషించండి

Harish Rao: మంత్రి మాట నమ్మి రైతులు మోసపోయారు, మీకు ఉరిశిక్ష వేసినా తప్పులేదు: హరీష్ రావు

Telangana News | దేవాదుల మోటార్లు నడపకుండా కాంగ్రెస్ ప్రభుత్వం పంటలను ఎండబెడుతోందని, నీళ్లున్నా ఎత్తిపోయకపోవడం నేరపూరిత నిర్లక్ష్యమని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు తీవ్రంగా విమర్శించారు.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ప్రభుత్వ మాటలు నమ్మి రైతులు మోసపోయారని హరీష్ రావు మండిపడ్డారు.
  • దేవాదుల ప్రాజెక్టు నీరు ఇవ్వకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు.
  • నీరున్నా సరఫరా చేయకపోవడం కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యమేనని విమర్శించారు.
  • పంటలు ఎండిపోతుంటే, క్రాప్ హాలిడే, ఆర్థిక సాయం ఇవ్వాలని డిమాండ్.

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం మాటలు నమ్మి రైతులు నిలువునా మోసపోయారని, కలెక్టర్ల మాట ఓ తీరుగా, మంత్రి మాటలు మరోలా ఉంటున్నాయని.. ప్రభుత్వానికి పాలనపై క్లారిటీ ఉందా అని మాజీ మంత్రి హరీష్ రావు ప్రశ్నించారు. దేవాదుల ప్రాజెక్టు నుంచి 10 మోటార్లు నడిపి సాగునీరు అందిస్తామని ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారని నమ్మి రైతులు నారుమడులు పోసుకున్నారని, కానీ ఇప్పుడు నీళ్లను ఎత్తిపోయకుండా మోసం చేస్తోందని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు మండిపడ్డారు. కేసీఆర్ కట్టిన ప్రాజెక్టులను ఉద్దేశపూర్వకంగానే కాంగ్రెస్ ప్రభుత్వం పక్కన పెట్టి, రైతులకు నీళ్లు ఇవ్వకుండా వేధిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యం వల్ల వరంగల్, కరీంనగర్ జిల్లాలు ఆగమయ్యే పరిస్థితి వచ్చిందన్నారు. నీళ్లు ఉన్నా కిందకు విడిచిపెట్టడం నేరపూరిత నిర్లక్ష్యం కాదా.. మీకు ఉరిశిక్ష వేసినా తప్పులేదని వ్యాఖ్యానించారు. 

హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో మంగళవారం నాడు హరీష్ రావు మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పాలనలో మంత్రుల మాటలకు, అధికారుల చర్యలకు పొంతన ఉండటం లేదు.  ఒకవైపు మంత్రులు ప్రతీ ఎకరానికీ నీళ్లు ఇస్తామని చెబుతున్నారు. మరోవైపు వరంగల్ జిల్లా కలెక్టర్ నీళ్లు ఇవ్వలేమని చెబుతున్నారు. కాంగ్రెస్ పాలనలో ఎవరు చెప్పేది నిజమో, ఎవరు చెప్పేది తప్పో ప్రజలకు స్పష్టం చేయాలి. మంత్రుల మాటలు తప్పయితే వెంటనే రైతులకు బహిరంగ క్షమాపణ చెప్పాలి. 

నీళ్లున్నా ఎత్తిపోయకపోవడం చేతగానితనం 

‘పాకాల ప్రాజెక్టు కింద 29 వేల ఎకరాలు, రామప్ప కింద 5,500 ఎకరాల ఆయకట్టు ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వ హామీలు, మాటలు నిజమని నమ్మి రైతులు నాట్లు వేసుకుంటే ఇప్పుడు అధికారులు పాకాల కింద ఉన్న తూములను మూసివేశారు. ప్రపంచమంతా నీళ్లను కాపాడుకుంటూ ఉంటే, కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం కళ్ల ముందే ఉన్న నీటిని సముద్రంలోకి జారవిడుస్తూ వృథా చేస్తోంది.  సమ్మక్క బ్యారేజీలో 3 టీఎంసీల నీళ్లు నిండుగా ఉన్నాయని, దేవాదుల వద్ద 73 మీటర్ల నీటిమట్టం ఉంటేనే మోటార్లు రన్ చేయొచ్చు. ప్రస్తుతం 78 మీటర్ల ఎత్తులో నీళ్లు ప్రవహిస్తున్నా నీటిని ఎందుకు ఎత్తిపోయడం లేదని ప్రశ్నించారు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన కృత్రిమ కరువని, నీళ్లు ఇవ్వకుండా పంటలను ఎండబెడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పట్ల దారుణ నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తోందని’ విమర్శించారు.

Also Read: IPS Uday Krishna Reddy Suicide Note: మేం రిలేషన్ షిప్‌లో ఉన్నాం - అన్నీ తప్పుడు ఆరోపణలే - ఉదయ్ కృష్ణారెడ్డి సూసైడ్‌ నోట్‌లో సంచలన విషయాలు

అయోమయంలో రైతులు.. క్రాప్ హాలిడే ఇచ్చి నష్టపరిహారం చెల్లించాలి
హరీష్ రావు ఇంకా మాట్లాడుతూ.. ‘పంటలను కాపాడుకోవడానికి వరంగల్ జిల్లా రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. బిందెలు, సీసాలతో పత్తి చేలకు నీళ్లు చల్లుకుంటున్న వీడియోలు చూస్తూనే ఉన్నారు. గతేడాది నిర్వహణ బిల్లులు చెల్లించకపోవడం వల్ల మోటార్ల ప్రారంభం ఆలస్యమైంది. వేసవి టైంలోనే సకాలంలో రిపేర్లు చేయకపోవడం వల్ల వందల కోట్ల విలువైన పంటలు ఎండిపోయాయి. ఈ ఏడాది ఎల్ నినో ప్రభావం ఉంటుందని శాస్త్రవేత్తలు వేసవిలోనే కొన్ని నెలల ముందుగానే హెచ్చరించినా సర్కార్ మొద్దునిద్ర పోయింది. నీటిని సకాలంలో విడుదల చేయలేని పరిస్థితుల్లో ఉన్నట్లయితే తెలంగాణ ప్రభుత్వం క్రాప్ హాలిడే ప్రకటించి రైతులకు తగిన ఆర్థిక సాయం అందించాలన్నది మా డిమాండ్.

కేసీఆర్ కట్టిన ప్రాజెక్టులను కాంగ్రెస్ నిర్వీర్యం చేస్తోంది

కేసీఆర్ హయాంలో బీఆర్ఎస్ ప్రభుత్వం 3.17 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించేలా దేవాదుల ప్రాజెక్టును నిర్మించింది. కేవలం స్విచ్ నొక్కితే చాలు నీళ్లు అందే వ్యవస్థను తయారు చేసి మేం ఇచ్చాం. కానీ దేవాదుల పరిధిలోని 22 రిజర్వాయర్ల సామర్థ్యం 12 టీఎంసీలు కాగా, ప్రతిరోజూ పావు టీఎంసీ నీటిని తోడే ఛాన్స్ ఉన్నా ఇప్పటివరకు ఆ పని చేయలేదు. రాష్ట్ర రైతుల ప్రయోజనాలను పక్కనబెట్టి నీళ్లను దిగువకు వదిలేయడం వెనుక ఉన్న ఉద్దేశం ఏంటో ప్రజలకు చెప్పాలి. ప్రతిపక్షం తాము ప్రెస్ మీట్ పెట్టి ప్రశ్నించగానే దేవాదులలో 2 మోటార్లు స్టార్ట్ చేశారు. మేం నిలదీస్తే తప్ప ఈ ప్రభుత్వంలో చలనం రావడం లేదని’ మండిపడ్డారు. బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా రైతుల హక్కుల కోసం బీఆర్ఎస్ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. 

 

Frequently Asked Questions

రైతులు ఎందుకు మోసపోయారని హరీష్ రావు అంటున్నారు?

దేవాదుల ప్రాజెక్టు నుంచి సాగునీరు అందిస్తామని ఇరిగేషన్ మంత్రి హామీ ఇవ్వడంతో రైతులు నారుమడులు వేశారు. కానీ ఇప్పుడు నీటిని ఎత్తిపోయకుండా ప్రభుత్వం మోసం చేస్తోందని హరీష్ రావు ఆవేదన వ్యక్తం చేశారు.

సాగునీటి సరఫరాపై హరీష్ రావు ఏ విరుద్ధమైన ప్రకటనలను ఎత్తిచూపారు?

మంత్రులు ప్రతీ ఎకరానికీ నీళ్లు ఇస్తామని చెబుతున్నారు. మరోవైపు వరంగల్ జిల్లా కలెక్టర్ నీళ్లు ఇవ్వలేమని చెబుతున్నారు, ఇది పాలనపై క్లారిటీ లేకపోవడాన్ని సూచిస్తుంది.

దేవాదుల ప్రాజెక్టు, సమ్మక్క బ్యారేజీలో ప్రస్తుత నీటిమట్టం ఎంత ఉంది?

సమ్మక్క బ్యారేజీలో 3 టీఎంసీల నీళ్లు నిండుగా ఉన్నాయి. దేవాదుల వద్ద 73 మీటర్ల నీటిమట్టం ఉంటే మోటార్లు రన్ చేయవచ్చు, ప్రస్తుతం 78 మీటర్ల ఎత్తులో నీళ్లు ప్రవహిస్తున్నాయి.

ప్రభుత్వం నీటిని అందించలేని పక్షంలో హరీష్ రావు డిమాండ్ ఏమిటి?

నీటిని సకాలంలో విడుదల చేయలేని పరిస్థితుల్లో ఉంటే, ప్రభుత్వం క్రాప్ హాలిడే ప్రకటించి రైతులకు తగిన ఆర్థిక సాయం అందించాలని హరీష్ రావు డిమాండ్ చేశారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Indiramma Housing Scheme: ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుల గడువు పూర్తి.. లబ్ధిదారుల ఎంపిక ఎప్పుడంటే
ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుల గడువు పూర్తి.. లబ్ధిదారుల ఎంపిక ఎప్పుడంటే
Harish Rao: రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలు నిరూపించకపోతే పరువు నష్టం దావాతో కోర్టుకు లాగుతా: హరీష్ రావు
రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలు నిరూపించకపోతే పరువు నష్టం దావాతో కోర్టుకు లాగుతా: హరీష్ రావు
CM Revanth Reddy: రేషన్ కార్డు అంటే కేవలం బియ్యం ఇచ్చే సాధనం కాదు.. ప్రజల ఆత్మగౌరవం: సీఎం రేవంత్ రెడ్డి
రేషన్ కార్డు అంటే కేవలం బియ్యం ఇచ్చే సాధనం కాదు.. ప్రజల ఆత్మగౌరవం: సీఎం రేవంత్ రెడ్డి
Molesting Minor Girl: ఆలయంలో బాలికపై పూజారి లైంగిక దాడి..! బయట లాక్ వేసి లోపల దారుణం
ఆలయంలో బాలికపై పూజారి లైంగిక దాడి..! బయట లాక్ వేసి లోపల దారుణం
Advertisement

వీడియోలు

Bindu Madhavi Reacts to Uppal Balu Controversy | ఉప్పల్ బాలు vs బిందు మాధవి
Devdutt Padikkal Historic Test Century | స్వతంత్ర దినోత్సవం రోజు పడిక్కల్ సెంచరీ
Devdutt Padikkal Century vs Sri Lanka | శ్రీలంకపై దేవదత్ పడిక్కల్ సూప‌ర్ సెంచ‌రీ
KL Rahul Retired Hurt Near Century | సెంచరీకి చేరువలో కేఎల్ రాహుల్ రిటైర్డ్ హర్ట్
IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
BAN Defeats AUS In 1st Test: ఆస్ట్రేలియా గడ్డపై బంగ్లాదేశ్ చారిత్రాత్మ‌క‌ టెస్ట్ విక్టరీ.. 9 వికెట్ల‌తో కంగారులపై ఘ‌న విజ‌యం.. ఆసియా ఆవ‌త‌ల అతిపెద్ద గెలుపు, సిరీస్ పై క‌న్ను!
ఆస్ట్రేలియా గడ్డపై బంగ్లాదేశ్ చారిత్రాత్మ‌క‌ టెస్ట్ విక్టరీ.. 9 వికెట్ల‌తో కంగారులపై ఘ‌న విజ‌యం.. ఆసియా ఆవ‌త‌ల అతిపెద్ద గెలుపు, సిరీస్ పై క‌న్ను!
Tirumala Viral Video: తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
TTD Online Booking: తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
భారత్‌లో చిన్న కార్ల టైమ్‌ వచ్చిందా? మిడ్‌సైజ్‌ SUVల జోరు తగ్గుతుందా?
SUVల హవాకు చెక్.. ఇక చిన్న కార్లదే జోరు, ట్రెండ్‌ మారుతోందా?
రూ.19.45 లక్షల నుంచి మహీంద్రా BE 6 Sporteq.. మీ అవసరానికి సరిపోయే వేరియంట్‌ ఇదే!
మహీంద్రా BE 6 Sporteqలో ఏ వేరియంట్‌ బెస్ట్? ధర, బ్యాటరీ, ఫీచర్ల పూర్తి వివరాలు!
Indiramma Housing Scheme: ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుల గడువు పూర్తి.. లబ్ధిదారుల ఎంపిక ఎప్పుడంటే
ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుల గడువు పూర్తి.. లబ్ధిదారుల ఎంపిక ఎప్పుడంటే
RRB JE Posts 2026: రైల్వేలో 3,993 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. ముఖ్యమైన తేదీలు, అభ్యర్థుల అర్హతలు
RRB JE Posts: రైల్వేలో 3,993 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. ముఖ్యమైన తేదీలు, అభ్యర్థుల అర్హతలు
Deputy CM Pawan Kalyan: పవన్ కళ్యాణ్‌కు అస్వస్థత.. డాక్టర్ల సూచన మేరకు హైదరాబాద్‌కు ఏపీ డిప్యూటీ సీఎం
పవన్ కళ్యాణ్‌కు అస్వస్థత.. డాక్టర్ల సూచన మేరకు హైదరాబాద్‌కు ఏపీ డిప్యూటీ సీఎం
Embed widget