QDENGA అనేది డెంగీని నియంత్రించడానికి జపాన్‌లోని టకేడా ఫార్మా సంస్థ తయారుచేసిన ఒక వ్యాక్సిన్. భారత ప్రభుత్వం దీనిని అమ్మకాలకు ఆమోదించింది.
Dengue Vaccine India: డెంగీకి హైదరాబాద్ మందు! జపాన్‌కు చెందిన QDENGA వ్యాక్సిన్ అమ్మకాలకు భారత్ గ్రీన్ సిగ్నల్!
Dengue Vaccine India: జపాన్‌కు చెందిన QDENGA వ్యాక్సిన్ అమ్మకాలకు భారత్ ఓకే చెప్పింది. దీన్ని హైదరాబాద్‌లోనే తయారు చేస్తున్నారు. ఈ వ్యాక్సిన్ వేసుకోవడానికి ప్రభుత్వం కొన్ని పరిమితులు విధించింది.

- జపాన్ QDENGA డెంగీ వ్యాక్సిన్‌కు భారత్ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
- గత డెంగీ చరిత్రతో సంబంధం లేకుండా ఎవరైనా వ్యాక్సిన్ తీసుకోవచ్చు.
- 4-60 ఏళ్ల వారు రెండు డోసులు తీసుకోవాలి; గర్భిణీలకు ఇది కాదు.
- QDENGA ఆసుపత్రి చేరికను 90% తగ్గిస్తుంది, హైదరాబాద్‌లో ఉత్పత్తి.
Dengue Vaccine India: వర్షాకాలం వస్తే వైరల్ ఫీవర్‌తోపాటు డెంగీ జనాలను భయపెడుతుంది. సామాన్యుడి నుంచి సెలబ్రిటీల వరకు అంతా డెంగీ పేరు చెబితేనే వణికిపోతారు. అలా జనాలను భయపెట్టే వ్యాధికి జపాన్ ఫార్మా కంపెనీ QDENGA వ్యాక్సిన్ తయారు చేసింది. దీన్ని ఇప్పుడు భారత్‌లో అమ్మకాలు జరిపేందుకు ప్రభుత్వం ఓకే చెప్పింది. దీంతో డెంగీ కారణంగా ప్రాణాలు కోల్పోవడం తగ్గనుంది. ఇంతకీ ఈ డెంగీ మెడిసిన్ ఎవరు వేసుకోవచ్చు? ఈ మెడిసిన్ ఎలా పని చేస్తుందో చూద్దాం.
భారత్‌లోకి తొలిసారి డెంగీని నియంత్రించే వ్యాక్సిన్ వచ్చేస్తోంది. ఇప్పటి వరకు డెంగీ బారిన పడకుండా ఉండేందుకు దోమ తెరలు లాంటి నియంత్రణలు మాత్రమే పాటించేవాళ్లు. ఇప్పుడు వ్యాక్సిన్ రావడంతో అది శక్తివంతంగా పని చేస్తుందని భావిస్తున్నారు. జపాన్‌కు చెందిన టకేడా ఫార్మా సంస్థ తయారు చేసిన QDENGA వ్యాక్సిన్‌కు భారత్ ప్రభుత్వం అత్యున్నత ఔషద నియంత్రణ సంస్థ డీసీజీఐ ఓకే చెప్పడంతో వైద్య రంగంలోనే కీలక మలుపుగా చెబుతున్నారు.
QDENGA కథేంటీ?
ప్రపంచవ్యాప్తంగా డెంగీ కారణంగా కోట్ల మంది చనిపోతున్నారు. అయితే ఆ మరణాల్లో భారత్‌లోనే ఎక్కువ ఉండటం ఆందోళన కలిగించే అంశం. పట్టణీకరణ వేగంగా పెరగడంతోపాటు వాతావరణంలో వచ్చిన మార్పులు కూడా ఈ డెంగీ కేసులు పెరగడానికి కారణమవుతున్నాయి. ఇప్పుడు వీటికి చెక్ పడే టైం వచ్చింది. పరిస్థితి తీవ్రతను గ్రహించిన కేంద్రం గేమ్‌ఛేంజర్‌గా ఉన్న QDENGA(TAK-003) వ్యాక్సిన్ దేశంలో వాడుకునేందుకు ఓకే చెప్పింది. ఇది ఒక లైవ్ అటెన్యూయేటెడ్ టెట్రావాలెంట్ వ్యాక్సిన్. అంటే డెంగీని వైరస్‌ను బలహీనపరుస్తుంది. దీన్ని ల్యాబ్‌లో టెస్టు చేసి వైరస్‌పై విజయవంతంగా పని చేసి, మనిషిలో రోగనిరోధక శక్తి పెంపొందించేలా డిజైన్ చేశారు. ఇది 2022 నుంచి అంతర్జాతీయ మార్కెట్‌లో అందుబాటులో ఉంది. ఈయూ, బ్రిటన్, బ్రెజిల్, అర్జెంటీనా, ఇండోనేషియా సహా 43 దేశాల్లో అందుబాటులో ఉంది. దాదాపు 32 మిలియన్ల మంది దీన్ని వేసుకున్నారు.
ఇప్పటికే ఉన్న వ్యాక్సిన్‌లతో పోలిస్తే వ్యత్యాసం ఏంటీ?
ఇప్పటి వరకు అందుబాటులో ఉన్న వ్యాక్సిన్ కేవలం గతంలో డెంగీ వచ్చిన వారికి మాత్రమే వేయాల్సి వచ్చేది. అంటే డెంగీ రాని వ్యక్తికి వ్యాక్సిన్ వేస్తే భవిష్యత్‌లో డెంగీ వచ్చినా ప్రాణాంతకం అయ్యే అవకాశం ఉంది. ఇప్పుడు అందుబాటులోకి వచ్చిన వ్యాక్సిన్‌తో అలాంటి చిక్కులు లేవు. అంటే గతంలో మీకు డెంగీ వచ్చిందా లేదా అని తెలుసుకునేందుకు రక్త పరీక్షలు, ఇతర పరీక్షలు చేయాల్సిన పని లేదు. డెంగీ వచ్చిన వాళ్లు కానీ, రాని వాళ్లు ఎవరైనా వ్యాక్సిన్ వేసుకోవచ్చు. భారత్ లాంటి దేశాలకు ఇది చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. అందుకే దీన్ని వైద్య రంగంలో గేమ్ ఛేంజర్‌గా భావిస్తున్నారు.
నాలుగు వేరియంట్స్‌పై యుద్ధం
డెంగీలో నాలుగు రకాల వేరియంట్స్ ఉన్నాయి. మీకు ఒకసారి DENV-1 వేరియంట్ వస్తే తర్వాత మీ శరీరంలోని ఇమ్యూనిటీ సిస్టమ్ దాన్ని తట్టుకునే శక్తిని బిల్డ్ చేసుకుంటుంది. అయితే తర్వాత ఎప్పుడైనా మిగతా మూడు రకాల వేరియంట్స్‌లో ఒకటి వస్తే మాత్రం మీ ఇమ్యూన్ సిస్టమ్ కన్ఫ్యూజ్ అవుతుంది. ఇంతలో డెంగీ విస్తరించి వ్యవస్థలను తన ఆధీనంలోకి తీసుకుంటుంది. దీంతో వ్యక్తి ప్రాణాలు ప్రమాదంలో పడతాయి. దీన్నే వైద్య పరిభాషలో సెరోటైప్ వైరస్ అంటారు. ఇప్పుడు మార్కెట్‌లోకి వస్తున్న QDENGA వ్యాక్సిన్ మీ శరీరంలోని ఇమ్యూన్‌ను అందుకుతగ్గట్టుగా రెడీ చేస్తుంది. ఇి టెట్రావాలెంట్ వ్యాక్సిన్ కావడంతో మీకు DENV-2 వైరస్ సోకితే దీనికి సంబంధించిన జన్యు నిర్మాణాన్ని బ్యాక్‌బోన్‌గా వాడుకొని నాలుగో వేరియంట్‌కు వ్యతిరేకంగా యాంటీ బాడీస్‌ను డెవలప్ చేస్తుంది. అందుకే మీకు ఈ నాలుగు వేరియంట్స్‌లో ఏది సోకినా ఎదుర్కొని ఇమ్యూన్ మీ బాడీలో సిద్దం చేస్తుంది.
ఎవరెవరు వ్యాక్సిన్ తీసుకోవచ్చు?
భారత్‌లో డీసీజీఐ రూల్స్ ప్రకారం ఈ వ్యాక్సిన్ అందరూ తీసుకోవడానికి లేదు. దీనికి కొన్ని పరిమితులు విధించారు. నాలుగు సంవత్సరాల నుంచి 60 ఏళ్ల వయసు ఉన్న వారు ఎవరైనా ఈ వ్యాక్సిన్ తీసుకోవచ్చు. బాలింతలు, గర్భిణీలు దీన్ని తీసుకోవడానికి లేదు. దీన్ని రెండు డోసులుగా ఇస్తారు. మొదటి డోసు తీసుకున్న 3 నెలల తర్వాత రెండో డోస్ తీసుకోవాల్సి ఉంటుంది. దీనిని చేతి పైభాగంలో చర్మం కింద మాత్రమే ఇస్తారు. ఇది కండరాల్లో ఇవ్వకూడదు.
ఇది ఎంత వరకు సేఫ్?
దీన్ని ప్రపంచవ్యాప్తంగా 28వేల మంది వాలంటీర్లపై పరీక్షించారు. భారత్‌లో కూడా ఫేజ్ త్రీలో క్లినికల్ ట్రయల్స్ జరిపారు. వాటన్నింటినీ పరిశీలించిన తర్వాతే భారత్‌లో వ్యాక్సిన్ అమ్మకాలకు అనుమతి ఇచ్చారు. సాధారణ వ్యాక్సిన్ మాదిరిగానే ఇంజెక్షన్ చేసిన తర్వాత చిన్నగా తలనొప్పి, కండరాల నొప్పులు ఉంటాయి.
ప్రపంచానికి డెంగీ వ్యాక్సిన్ అందిస్తున్న హైదరాబాద్
అయితే ఇంకో ఆసక్తికర విషయం ఏంటంటే? ఈ వ్యాక్సిన్ తయారీ హైదరాబాద్‌లోనే జరుగుతుంది. హైదరాబాద్‌లో ఉన్న బయోలజికల్ ఇ సంస్థతో జపాన్ ఫార్మా సంస్థ టకేడా చేసుకున్న ఒప్పందంలో భాగంగా వ్యాక్సిన్‌ను ఇక్కడ తయారు చేసి ప్రపంచానికి సప్లై చేస్తోంది. ఏటా దాదాపు 50 మిలియన్ల డోస్ అంటే ఐదు కోట్ల మందికి సరిపడా వ్యాక్సిన్‌లు ఉత్పత్తి చేస్తుంది. దీన్ని మరింత పెంచాలని చూస్తున్నారు. దీని వల్ల భారత్‌లో వ్యాక్సిన్ కొరత లేకుండా జాగ్ర్తత పడుతుంది.
క్యూడెంగా వ్యాక్సిన్ దోమ కాటు తర్వాత ఆసుపత్రిలో చేరాల్సిన అవసరాన్ని 90 శాతం తగ్గిస్తుంది. కానీ వైరస్ శరీరంలోకి ప్రవేశించడాన్ని అడ్డుకోలేదు. కాబట్టి వ్యాక్సిన్ తీసుకున్నప్పటికీ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం చాలా అవసరం.
Frequently Asked Questions
QDENGA వ్యాక్సిన్ అంటే ఏమిటి మరియు దీనిని ఎవరు తయారు చేశారు?
QDENGA వ్యాక్సిన్‌ను ఎవరు తీసుకోవచ్చు?
4 నుండి 60 సంవత్సరాల వయస్సు ఉన్న వారు ఈ వ్యాక్సిన్‌ను తీసుకోవచ్చు. అయితే, గర్భిణీలు మరియు బాలింతలు దీనిని తీసుకోకూడదు. దీనిని రెండు డోసులుగా ఇస్తారు.
ఇతర డెంగీ వ్యాక్సిన్లతో పోలిస్తే QDENGA ప్రత్యేకత ఏమిటి?
గతంలో డెంగీ వచ్చిన వారికి మాత్రమే వేయగల వ్యాక్సిన్‌ల వలె కాకుండా, QDENGA డెంగీ వచ్చిన లేదా రాని వారు ఎవరైనా తీసుకోవచ్చు. రక్త పరీక్షలు అవసరం లేదు.
QDENGA వ్యాక్సిన్ ఎక్కడ ఉత్పత్తి అవుతుంది?
ఈ వ్యాక్సిన్ హైదరాబాద్‌లోని బయోలాజికల్ ఇ సంస్థలో జపాన్ ఫార్మా సంస్థ టకేడా ఒప్పందంలో భాగంగా ఉత్పత్తి అవుతుంది. ఏటా 50 మిలియన్ల డోస్‌లను ఉత్పత్తి చేస్తారు.
ట్రెండింగ్ వార్తలు





















