అన్వేషించండి

Dengue vs Viral Fever : డెంగ్యూ vs వైరల్ ఫీవర్.. రెండింటి మధ్య తేడాలు ఇవే, తెలుసుకోకుంటే ప్రమాదమే

Dengue or Viral Fever : వర్షాకాలంలో ఎక్కువగా వైరల్ ఫీవర్ వస్తుంది. ఇదే సమయంలో డెంగ్యూ కూడా ఎటాక్ చేస్తుంది. ఈ రెండింటి మధ్య తేడా తెలుసుకోకుంటే కచ్చింగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. 

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • డెంగ్యూ, వైరల్ ఫీవర్‌ల లక్షణాలు, తీవ్రతల్లో స్పష్టమైన తేడాలున్నాయి.
  • డెంగ్యూలో అధిక జ్వరం, తీవ్ర కీళ్ల నొప్పులు, ప్లేట్‌లెట్స్ తగ్గుతాయి.
  • రక్తస్రావం వంటి హెచ్చరికలుంటే, దోమల నివారణ చర్యలు తప్పనిసరి.
  • అధిక జ్వరం, ప్లేట్‌లెట్లు తగ్గుతూ ఉంటే తక్షణమే వైద్య సహాయం పొందండి.

Dengue Warning Signs vs Viral Fever Symptoms : వర్షాకాలం ప్రారంభమైన వెంటనే జ్వరం, జలుబు, శరీర నొప్పులు వంటి సమస్యలు ఎక్కువగా కనిపిస్తాయి. చాలామంది వీటిని సాధారణ వైరల్ ఫీవర్‌గా భావిస్తారు. అయితే కొన్ని సందర్భాల్లో ఇవే లక్షణాలు డెంగ్యూ జ్వరానికి సంకేతాలు కావచ్చు. డెంగ్యూ, వైరల్ ఫీవర్ రెండింటికీ కొన్ని లక్షణాలు ఒకేలా ఉన్నప్పటికీ.. వాటి కారణాలు, తీవ్రత, చికిత్స విధానంలో చాలా తేడా ఉంటుంది. అందుకే ఈ రెండింటి మధ్య తేడాలను తెలుసుకోవడం చాలా ముఖ్యమని చెప్తున్నారు నిపుణులు.

డెంగ్యూ 

డెంగ్యూ అనేది ఏడిస్ (Aedes) దోమ కాటు ద్వారా వ్యాపించే వైరల్ వ్యాధి. ఇది డెంగ్యూ వైరస్ వల్ల వస్తుంది. ముఖ్యంగా వర్షాకాలంలో నిల్వ నీరు ఉన్న ప్రాంతాల్లో ఈ దోమలు ఎక్కువగా పెరుగుతాయి.

వైరల్ ఫీవర్

వైరస్‌ల వల్ల వచ్చే సాధారణ జ్వరాలను వైరల్ ఫీవర్ అంటారు. ఇవి గాలి, నీరు, దగ్గు, తుమ్ముల ద్వారా ఒకరి నుంచి మరొకరికి వ్యాపించవచ్చు. ఈ ఫీవర్ కొన్ని రోజుల్లో తగ్గిపోతుంది.

డెంగ్యూ, వైరల్ ఫీవర్ మధ్య తేడాలు

డెంగ్యూ వస్తే జ్వరం ఒక్కసారిగా 102°F నుంచి 104°F వరకు పెరుగుతుంది. వైరల్ ఫీవర్‌లో జ్వరం సాధారణంగా మోస్తరు స్థాయిలో ఉంటుంది. అలాగే డెంగ్యూ వచ్చినప్పుడు కండరాలు, కీళ్లలో తీవ్రమైన నొప్పులు ఉంటాయి. అందుకే దీనిని బ్రేక్‌బోన్ ఫీవర్ అని కూడా పిలుస్తారు. వైరల్ ఫీవర్‌లో నొప్పులు తక్కువగానే ఉంటాయి. డెంగ్యూ ఉంటే రోగుల్లో కళ్ల వెనుక భాగంలో నొప్పిగా ఉంటుంది. వైరల్ ఫీవర్‌లో ఈ లక్షణం అరుదుగా కనిపిస్తుంది. 

డెంగ్యూలో ఎర్రటి దద్దుర్లు లేదా చర్మంపై చిన్న చిన్న మచ్చలు కనిపించవచ్చు. వైరల్ ఫీవర్‌లో కొందరికి రావచ్చు. డెంగ్యూ వల్ల రక్తంలోని ప్లేట్‌లెట్ల సంఖ్య తగ్గే ప్రమాదం ఉంటుంది. వైరల్ ఫీవర్‌లో సాధారణంగా ప్లేట్‌లెట్లు పెద్దగా ప్రభావితం చేయవు. డెంగ్యూ తీవ్రమైతే చిగుళ్ల నుంచి రక్తం రావడం, ముక్కు నుంచి రక్తస్రావం వంటి లక్షణాలు కనిపించవచ్చు. వైరల్ ఫీవర్‌లో ఇవి ఉండవు. వైరల్ ఫీవర్ సాధారణంగా 3 నుంచి 7 రోజుల్లో తగ్గిపోతుంది. డెంగ్యూ నుంచి పూర్తిగా కోలుకోవడానికి ఎక్కువ సమయం పట్టవచ్చు. 

డెంగ్యూ హెచ్చరిక సంకేతాలు ఇవే..

డెంగ్యూ వస్తే తీవ్ర కడుపు నొప్పి, వాంతులు పదే పదే కావడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ముక్కు లేదా చిగుళ్ల నుంచి రక్తస్రావం, తీవ్రమైన బలహీనత, ప్లేట్‌లెట్ కౌంట్ వేగంగా తగ్గడం జరుగుతుంది. ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.

డెంగ్యూ నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే.. డెంగ్యూ రాకుండా చూసుకోవచ్చు. ఇంటి చుట్టూ నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. దోమల నివారణకు మస్కిటో నెట్స్, రిపెలెంట్స్ ఉపయోగించాలి. దుస్తులు నిండుగా ధరించాలి. నీటి ట్యాంకులు, కుండీలను శుభ్రంగా ఉంచాలి. జ్వరం వచ్చినప్పుడు స్వయంగా మందులు వాడకుండా వైద్యుడి సలహా తీసుకోవాలి.

వైద్యుడిని ఎప్పుడు సంప్రదించాలంటే..

డెంగ్యూ, వైరల్ ఫీవర్ రెండూ వైరస్‌ల వల్ల వచ్చినప్పటికీ.. డెంగ్యూ మరింత ప్రమాదకరంగా మారే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా అధిక జ్వరం, తీవ్రమైన శరీర నొప్పులు, ప్లేట్‌లెట్ కౌంట్ తగ్గడం వంటి లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే పరీక్షలు చేయించుకోవాలి. సరైన సమయంలో గుర్తించి చికిత్స తీసుకుంటే డెంగ్యూ వల్ల వచ్చే సమస్యలను చాలా వరకు నివారించవచ్చు.

మరిన్ని హెల్త్ ఆర్టికల్స్ కోసం దీనిని క్లిక్ చేయండి. 

గమనిక : ఈ కథనంలో అందించిన సమాచారం నిపుణులు పంచుకున్నారు. ఇది సాధారణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది. వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, ఎల్లప్పుడూ మీ వైద్యుడు లేదా ఇతర అర్హత కలిగిన ఆరోగ్య సంరక్షణ ప్రదాత సలహా తీసుకోండి.

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Vertigo vs Blackouts : తల తిరుగుతోందా? కళ్లు చీకట్లు కమ్ముతున్నాయా? ఈ లక్షణాలతో జాగ్రత్త, స్ట్రోక్ కావచ్చు
తల తిరుగుతోందా? కళ్లు చీకట్లు కమ్ముతున్నాయా? ఈ లక్షణాలతో జాగ్రత్త, స్ట్రోక్ కావచ్చు
Dussehra Navratri Day 1 : దసరా నవరాత్రుల్లో మొదటిరోజు బాల త్రిపుర సుందరికి పెట్టాల్సిన నైవేద్యాలు.. రెసిపీలు ఇవే
దసరా నవరాత్రుల్లో మొదటిరోజు బాల త్రిపుర సుందరికి పెట్టాల్సిన నైవేద్యాలు.. రెసిపీలు ఇవే
Saddula Bathukamma Naivedyam : సద్దుల బతుకమ్మ స్పెషల్ సత్తు పిండి.. వాయినంగా ఇచ్చేందుకు ఇంట్లోనే ఇలా తయారు చేయండి
సద్దుల బతుకమ్మ స్పెషల్ సత్తు పిండి.. వాయినంగా ఇచ్చేందుకు ఇంట్లోనే ఇలా తయారు చేయండి
Fenugreek Water 21 Days : 21 రోజులు మెంతుల నీరు తాగితే శరీరంలో జరిగే మార్పులు ఇవే.. పరిశోధనలు ఏం చెబుతున్నాయంటే
21 రోజులు మెంతుల నీరు తాగితే శరీరంలో జరిగే మార్పులు ఇవే.. పరిశోధనలు ఏం చెబుతున్నాయంటే

వీడియోలు

West Bengal Bypoll Results BJP Landslide Victory | బెంగాల్ పోరులో బీజేపీ క్లీన్ స్వీప్ - ముస్లిం ఓటు బ్యాంక్‌లో కమలం సంచలనం
Elephant Drona Recovers Broken Leg Fibreglass Casting Treatment | కాలిగాయానికి ఫైబర్‌గ్లాస్ కట్టు.. కోలుకున్న ద్రోణ ఏనుగు
India players Catch Drops vs WI 2nd T20 | క్యాచ్ డ్రాప్ వల్ల గెలిచే మ్యాచ్ పోయిందా ?
India vs West Indies 2nd T20 | వెస్టిండీస్‌తో రెండో టీ20లో ఘోర ఓటమి
Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Durga Idol Immersion: దుర్గామాత విగ్రహ ప్రతిష్ఠాపనపై వివాదం... పూజలకు ముందే అమ్మవారి విగ్రహం నిమజ్జనం
దుర్గామాత విగ్రహ ప్రతిష్ఠాపనపై వివాదం... పూజలకు ముందే అమ్మవారి విగ్రహం నిమజ్జనం
IND VS WI Indore 2nd T20 Updates: బౌలర్లకు నరకం చూపించే చిన్న మైదానం.. నేడు ఇండోర్‌లో మూడో టీ20 సమరం, 250 కొట్టినా గ్యారెంటీ లేదు..!!
బౌలర్లకు నరకం చూపించే చిన్న మైదానం.. నేడు ఇండోర్‌లో మూడో టీ20 సమరం, 250 కొట్టినా గ్యారెంటీ లేదు..!!
Hyderabad Crime News: పెళ్లి పేరుతో నమ్మించి పలుమార్లు లైంగిక దాడి.. ఖైరతాబాద్ డీఐ బాలస్వామి అరెస్ట్
పెళ్లి పేరుతో నమ్మించి పలుమార్లు లైంగిక దాడి.. ఖైరతాబాద్ డీఐ బాలస్వామి అరెస్ట్
Horror Thriller OTT : మనుషుల్ని తినేసే దెయ్యం - ఓటీటీలోకి సూపర్ నేచరల్ హారర్ థ్రిల్లర్ - తెలుగులోనూ స్ట్రీమింగ్
మనుషుల్ని తినేసే దెయ్యం - ఓటీటీలోకి సూపర్ నేచరల్ హారర్ థ్రిల్లర్ - తెలుగులోనూ స్ట్రీమింగ్
Bollaram Kidnap Case: బొల్లారంలో ఆరేళ్ల బాలిక కిడ్నాప్ విషాదాంతం.. కాళ్ల చేతులు కట్టి నీళ్ల సంపు పడేసి హత్య, సెక్యూరిటీ గార్డే కిరాతకుడు?
బొల్లారంలో ఆరేళ్ల బాలిక కిడ్నాప్ విషాదాంతం.. కాళ్ల చేతులు కట్టి నీళ్ల సంపు పడేసి హత్య, సెక్యూరిటీ గార్డే కిరాతకుడు?
CM Revanth Reddy On El Nino Crisis: రానున్న 8 నెలల్లో ఎల్‌నినో సవాళ్లు.. ముందస్తు కార్యాచరణకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం
రానున్న 8 నెలల్లో ఎల్‌నినో సవాళ్లు.. ముందస్తు కార్యాచరణకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం
Dussehra Navratri Day 1 : దసరా నవరాత్రుల్లో మొదటిరోజు బాల త్రిపుర సుందరికి పెట్టాల్సిన నైవేద్యాలు.. రెసిపీలు ఇవే
దసరా నవరాత్రుల్లో మొదటిరోజు బాల త్రిపుర సుందరికి పెట్టాల్సిన నైవేద్యాలు.. రెసిపీలు ఇవే
Court Room Drama OTT : గోల్డ్ లాకెట్... వ్యవస్థపై సామాన్యుడి పోరాటం - ఓటీటీలోకి తమిళ కోర్టు రూమ్ డ్రామా... తెలుగులోనూ స్ట్రీమింగ్
గోల్డ్ లాకెట్... వ్యవస్థపై సామాన్యుడి పోరాటం - ఓటీటీలోకి తమిళ కోర్టు రూమ్ డ్రామా... తెలుగులోనూ స్ట్రీమింగ్
Embed widget