అన్వేషించండి

Kidney Disease : కిడ్నీ వ్యాధులను ముందుగా గుర్తించే టెస్ట్ ఇదే.. కేవలం 300 రూపాయలతో తెలుసుకోవచ్చు అంటోన్న వైద్యులు

Kidney Disease Detection Test : కిడ్నీ వ్యాధి ప్రాణాంతక దశకు చేరుకునే వరకు ఎలాంటి సంకేతాలు ఇవ్వకపోవచ్చు. కానీ కేవలం 300 రూపాయలతో చేసే టెస్ట్​లు చేయించుకుంటే ముందుగానే గుర్తించవచ్చని తెలుసా?

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధులు గుర్తించబడకుండా పనితీరును తగ్గిస్తాయి.
  • తక్కువ ఖర్చు పరీక్షలతో కిడ్నీ సమస్యలను ముందే తెలుసుకోవచ్చు.
  • మధుమేహం, బీపీ వంటివారు తప్పనిసరిగా కిడ్నీ పరీక్షలు చేయాలి.
  • ముందుగా గుర్తించినవారు జీవనశైలి మార్పులతో వ్యాధిని నియంత్రించగలరు.

Rs 300 Test Detect Kidney Damage Early : కిడ్నీ వ్యాధులను (క్రానిక్ కిడ్నీ డిసీజ్-CKD)ను వైద్యులు తరచుగా సైలెంట్ కిల్లర్ అంటారు. దీనికి కారణం.. ఈ వ్యాధి ప్రారంభ దశల్లో ఎలాంటి స్పష్టమైన లక్షణాలు కనిపించవు కాబట్టి. కిడ్నీలు ఎన్నో ఏళ్లుగా నెమ్మదిగా దెబ్బతింటూ.. లక్షణాలు ఆలస్యంగా బయటపడతాయి. అప్పటికే చాలా మందిలో కిడ్నీల పనితీరు దాదాపు తగ్గిపోతుంది. దీంతో డయాలసిస్ లేదా కిడ్నీ మార్పిడి వంటి ఖరీదైన చికిత్సలు చేయించాల్సిన పరిస్థితి వస్తుందని వైద్యులు చెప్తున్నారు.

ప్రపంచవ్యాప్తంగా సుమారు 85 కోట్ల మందికి పైగా ఏదో ఒక రూపంలో కిడ్నీ సంబంధిత సమస్యలు ఉన్నట్లు అధ్యయనాలు చెప్తున్నాయి. అయితే వీటిలో తెలిసిన షాకింగ్ విషయం ఏంటంటే.. చాలా మందికి తమకు కిడ్నీ వ్యాధి ఉందనే విషయం కూడా తెలియదట. అందుకే వైద్యులు ముందస్తు పరీక్షలను తప్పనిసరిగా చేయించుకోవాలని సూచిస్తున్నారు.

కిడ్నీలు డ్యామేజ్ అని  తెలిపే ప్రధాన లక్షణాలు..

ముఖం, కాళ్లు లేదా శరీరంలో వాపు, తరచుగా అలసట, నీరసం, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది, వికారం, వాంతులు, ఆకలి తగ్గిపోవడం వంటి లక్షణాలు ప్రధానంగా కనిపిస్తాయి. అప్పటికే వ్యాధి ముదిరిపోయి ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
కిడ్నీ వ్యాధులు ఆలస్యంగా ఎందుకు బయటపడతాయి..

మన కిడ్నీలు చాలా సామర్థ్యంతో పనిచేస్తాయి. దీంతో కిడ్నీల పనితీరు క్రమంగా తగ్గుతున్నా కూడా శరీరం కొంతకాలం వరకు దానిని తట్టుకోగలదు. అందుకే చాలా మందిలో 70 నుంచి 75 శాతం వరకు కిడ్నీ పనితీరు దెబ్బతిన్న తర్వాతే లక్షణాలు కనిపిస్తాయి.

కేవలం 300తోనే కిడ్నీ టెస్ట్

కిడ్నీ వ్యాధిని ప్రారంభ దశలోనే గుర్తించడానికి ఖరీదైన పరీక్షలు అవసరం లేదు. సాధారణ మూత్ర పరీక్ష (యూరిన్ టెస్ట్), సీరమ్ క్రియాటినిన్ రక్తపరీక్ష వంటి బేసిక్ టెస్టులతోనే కిడ్నీల పనితీరును అంచనా వేయొచ్చు. ఈ టెస్ట్​లు చేయించుకుంటే 300 నుంచి 800 మధ్య ఖర్చు అవుతుంది. కానీ ఆలస్యం చేసి.. కిడ్నీ వ్యాధి ముదిరిపోతే.. చికిత్స ఖర్చులు భారీగా పెరుగుతాయని నిపుణులు హెచ్చరిస్తన్నారు. 

ఈ పరీక్షల ద్వారా మూత్రంలో ప్రోటీన్ లీక్ అవుతోందా.. మూత్రంలో రక్తపు ఆనవాళ్లు ఉన్నాయా.. క్రియాటినిన్, యూరియా స్థాయిలు పెరిగాయా.. గ్లోమెరులర్ ఫిల్ట్రేషన్ రేట్ తగ్గిందా వంటి విషయాలు తెలుసుకోవచ్చు. ఇవన్నీ కిడ్నీ వ్యాధి ప్రారంభ హెచ్చరికలుగా వైద్యులు పరిగణిస్తారు.

కచ్చితంగా కిడ్నీ టెస్ట్​ చేసుకోవాల్సింది వీరే..

కొన్ని సమస్యలు ఉన్నవారు రెగ్యులర్‌గా కిడ్నీ స్క్రీనింగ్ చేయించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. మధుమేహం, అధిక రక్తపోటు బాధితులు, గుండె జబ్బులు, ఊబకాయం ఉన్నవారు, కుటుంబంలో కిడ్నీ వ్యాధులు ఉన్నవారు, తరచుగా కిడ్నీ రాళ్లు లేదా యూరినరీ ఇన్ఫెక్షన్లు వచ్చే వారు, 60 ఏళ్లు దాటినవారు, ఆటో ఇమ్యూన్ వ్యాధులతో బాధపడేవారు కచ్చితంగా కిడ్నీ టెస్ట్​లు చేయించకోవాలని అంటున్నారు. 

ముందే గుర్తిస్తే.. తీసుకోవాల్సిన జాగ్రత్తలు

క్రానిక్ కిడ్నీ డిసీజ్‌ను ప్రారంభ దశలోనే గుర్తిస్తే దాని పురోగతిని చాలా వరకు నియంత్రించవచ్చు. రక్తపోటు, రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచడం, సరైన మందులు వాడడం, ఆహారపు అలవాట్లలో మార్పులు చేయడం ద్వారా కిడ్నీలను మరింత దెబ్బతినకుండా కాపాడుకోవచ్చు. తగినంత నీరు తాగడం, సమతుల్య ఆహారం తీసుకోవడం, అవసరం లేని మందులను ఎక్కువగా వాడకూడదు. ఈ అలవాట్లు కిడ్నీ ఆరోగ్యాన్ని కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తాయి.

కిడ్నీ హెల్త్ గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవాలనుకుంటే దీనిని క్లిక్ చేయండి. 

గమనిక : ఈ కథనంలో అందించిన సమాచారం నిపుణులు పంచుకున్నారు. ఇది సాధారణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది. వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, ఎల్లప్పుడూ మీ వైద్యుడు లేదా ఇతర అర్హత కలిగిన ఆరోగ్య సంరక్షణ ప్రదాత సలహా తీసుకోండి. 

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Habits To Quit Before 40 : 40 ఏళ్లు వచ్చేలోపు మానేయాల్సిన 7 అలవాట్లు.. లేదంటే ఆరోగ్యంపై ఈ ప్రభావాలు తప్పవు
40 ఏళ్లు వచ్చేలోపు మానేయాల్సిన 7 అలవాట్లు.. లేదంటే ఆరోగ్యంపై ఈ ప్రభావాలు తప్పవు
Independence Day 2026 : స్వాతంత్య్ర దినోత్సవం 2026 చరిత్ర, ప్రాముఖ్యత.. ఆగస్టు 15నే ఎందుకు జరుపుకుంటామంటే
స్వాతంత్య్ర దినోత్సవం 2026 చరిత్ర, ప్రాముఖ్యత.. ఆగస్టు 15నే ఎందుకు జరుపుకుంటామంటే
Korean Beauty Secrets : కొరియన్ గ్లాస్ స్కిన్ వెనుక సీక్రెట్ ఇదే.. రోజూ ఫాలో అవ్వగలిగే స్కిన్‌కేర్ టిప్స్ ఇవే
కొరియన్ గ్లాస్ స్కిన్ వెనుక సీక్రెట్ ఇదే.. రోజూ ఫాలో అవ్వగలిగే స్కిన్‌కేర్ టిప్స్ ఇవే
White Sneakers Cleaning Tips : తెల్లటి షూస్ మురికిగా మారాయా? ఇంట్లోనే శుభ్రం చేసేందుకు 9 ఈజీ చిట్కాలు
తెల్లటి షూస్ మురికిగా మారాయా? ఇంట్లోనే శుభ్రం చేసేందుకు 9 ఈజీ చిట్కాలు
Advertisement

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan: అమరావతి పనుల ప్రారంభోత్సవానికి పవన్ కళ్యాణ్‌కు మంత్రి నారాయణ ఆహ్వానం.. డిప్యూటీ సీఎం హాజరవుతారా
అమరావతి పనుల ప్రారంభోత్సవానికి పవన్ కళ్యాణ్‌కు మంత్రి నారాయణ ఆహ్వానం.. డిప్యూటీ సీఎం హాజరవుతారా
IND vs SL Test Series: గాయంతో టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. లంక టెస్ట్ సిరీస్ నుంచి మ‌రో ఆల్‌రౌండర్ అవుట్!
గాయంతో టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. లంక టెస్ట్ సిరీస్ నుంచి మ‌రో ఆల్‌రౌండర్ అవుట్!
Sridhar Babu: బీఆర్ఎస్ హయాంలోనే తక్కువ ధర! భూ కేటాయింపుల ఆరోపణలపై కేటీఆర్‌కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్
బీఆర్ఎస్ హయాంలోనే తక్కువ ధర! భూ కేటాయింపుల ఆరోపణలపై కేటీఆర్‌కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్
Free NEET Coaching: నీట్ ఫ్రీ లాంగ్ టర్మ్ కోచింగ్.. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన TGSWREIS
నీట్ ఫ్రీ లాంగ్ టర్మ్ కోచింగ్.. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన TGSWREIS
Indias Top 10 Business Families: భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
Bigg Boss Agnipariksha: 'బిగ్ బాస్'లో డర్టీ పాలిటిక్స్... అగ్నిపరీక్ష సెలక్షన్స్‌లో మోసం జరిగిందా?
'బిగ్ బాస్'లో డర్టీ పాలిటిక్స్... అగ్నిపరీక్ష సెలక్షన్స్‌లో మోసం జరిగిందా?
Ayyanna Patrudu: వారికి ఎమ్మెల్యే పదవి ఎందుకు? అసెంబ్లీకి రాకుంటే అనర్హత వేటు వేయాలి: స్పీకర్ అయ్యన్నపాత్రుడు
వారికి ఎమ్మెల్యే పదవి ఎందుకు? అసెంబ్లీకి రాకుంటే అనర్హత వేటు వేయాలి: స్పీకర్ అయ్యన్నపాత్రుడు
Adilabad Crime News: ఆదిలాబాద్, మహారాష్ట్రలో టూవీలర్స్ మాయం.. అంతర్రాష్ట్ర గ్యాంగ్ అరెస్ట్, 44 బైక్స్ స్వాధీనం
ఆదిలాబాద్, మహారాష్ట్రలో టూవీలర్స్ మాయం.. అంతర్రాష్ట్ర గ్యాంగ్ అరెస్ట్, 44 బైక్స్ స్వాధీనం
Embed widget