అన్వేషించండి

White Sneakers Cleaning Tips : తెల్లటి షూస్ మురికిగా మారాయా? ఇంట్లోనే శుభ్రం చేసేందుకు 9 ఈజీ చిట్కాలు

White Shoes Cleaning Tips : షూలను చాలామంది ఇష్టంగా వేసుకుంటారు. ముఖ్యంగా వైట్ షూస్ క్రేజ్ వేరు. కానీ వీటికి మురికి అయితే తొలగించడం కష్టంగా ఉంటుంది. కానీ ఈ టిప్స్ సులభంగా మరకలు తొలగిస్తాయి.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • పొడి దుమ్ము తొలగించి, లేసులు విడిగా శుభ్రం చేయాలి.
  • బేకింగ్ సోడా, టూత్‌పేస్ట్‌తో మరకలు సులువుగా తొలగించండి.
  • శుభ్రం చేసిన షూస్ సహజంగా ఆరబెట్టి, దుర్వాసన పోగొట్టాలి.
  • షూ ప్రొటెక్టర్ వాడి, చిన్న మరకలు వెంటనే శుభ్రం చేయాలి.

Home Remedies to Clean White Shoes : తెల్లటి షూస్ వేసుకుంటే లుక్ చాలా స్టైలిష్‌గా కనిపిస్తుంది. కానీ వాటిని శుభ్రంగా, తెల్లగా ఉంచడం మాత్రం అంత ఈజీ కాదు. దుమ్ము, బురద, ఫుడ్ మరకలు, స్కఫ్ మార్క్స్ కారణంగా తెల్లటి షూస్ కొద్దిరోజులకే మురికిగా కనిపిస్తాయి. బైక్ కిక్ కొట్టినప్పుడు కూడా మరకలు పడటం, వర్షాకాలంలో అయితే పరిస్థితి చెప్పనవసరం లేదు. ఆ సమయంలో మీ షూస్ శుభ్రం చేసుకునేందుకు కొన్ని ఇంటి చిట్కాలు ఫాలో అవ్వవచ్చు. 

కొన్ని టిప్స్ ఫాలో అయితే షూస్‌ను శుభ్రం చేయడం సులభమే అవుతుంది. అయితే ముందుగా షూ మెటీరియల్ ఏంటో తెలుసుకోవాలి. అవి లెదర్, కాన్వాస్ లేదా మెష్ వంటి మెటీరియల్‌తో తయారయ్యాయో తెలుసుకుంటే.. వాటికి తగ్గట్లు టిప్స్ ఫాలో అవుతూ.. షూస్ దెబ్బతినకుండా శుభ్రంగా చేసుకోవచ్చు. మరి షూస్ శుభ్రం చేసేందుకు ఇంట్లో ఫాలో అవ్వగలిగే టిప్స్ ఏంటో చూసేద్దాం. 

పొడి దుమ్మును దులిపేయండి..

షూస్‌పై నీరు లేదా క్లీనింగ్ లిక్విడ్ ఉపయోగించే ముందు.. వాటిపై ఉన్న పొడి దుమ్ము, మట్టిని తొలగించాలి. ఇందుకోసం సాఫ్ట్ బ్రిస్టిల్స్ ఉన్న బ్రష్ లేదా పాత టూత్‌బ్రష్ ఉపయోగించవచ్చు. షూస్ పైభాగం, సోల్, కుట్టిన ప్రాంతాలు, అంచులను నెమ్మదిగా బ్రష్ చేయాలి. ఇలా చేయడం వల్ల నీటితో తడిపినప్పుడు దుమ్ము మరింతగా వ్యాపించకుండా తేలికగా వదిలిపోతుంది. షూస్ శుభ్రం చేసే ముందు లేసులు, ఇన్‌సోల్స్‌ను తొలగించి విడిగా శుభ్రం చేయడం మంచిది.

బేకింగ్ సోడాతో పేస్ట్

కాన్వాస్ లేదా ఫ్యాబ్రిక్ షూస్‌పై ఉన్న మరకలను తొలగించేందుకు బేకింగ్ సోడా ఉపయోగించవచ్చు. ఇందుకోసం కొద్దిగా బేకింగ్ సోడాను తక్కువ మొత్తంలో మైల్డ్ సోప్, కొద్దిగా నీటిని కలిపి పేస్ట్‌లా చేసుకోవాలి. ఈ పేస్ట్‌ను మరక ఉన్న ప్రాంతంలో అప్లై చేసి సాఫ్ట్ టూత్‌బ్రష్‌తో నెమ్మదిగా చిన్న చిన్న సర్కిల్స్‌లో రుద్దాలి. సుమారు 15–20 నిమిషాల తర్వాత తడి క్లాత్‌తో పేస్ట్‌ను పూర్తిగా తుడిచేయాలి. అయితే షూస్‌పై ఉన్న కుట్టు, ప్రింటెడ్ డిజైన్స్ వంటి సున్నితమైన ప్రాంతాల్లో గట్టిగా రుద్దకూడదు. ఇది మురుకును వదిలించేందుకు మంచి మార్గంగా చెప్తారు.

స్కఫ్ మార్క్స్‌కు వైట్ టూత్‌పేస్ట్

షూస్‌పై చిన్న చిన్న స్కఫ్ మార్క్స్ లేదా మచ్చలు ఉంటే కొద్దిగా వైట్, నాన్-జెల్ టూత్‌పేస్ట్ ఉపయోగించవచ్చు. మరక ఉన్న ప్రాంతంలో కొద్దిగా టూత్‌పేస్ట్ అప్లై చేసి సాఫ్ట్ టూత్‌బ్రష్‌తో నెమ్మదిగా రుద్దాలి. కొన్ని నిమిషాల తర్వాత శుభ్రమైన తడి క్లాత్‌తో టూత్‌పేస్ట్ అవశేషాలను పూర్తిగా తుడిచేయాలి. అయితే ఏదైనా కొత్త క్లీనింగ్ పద్ధతిని మొత్తం షూకు ఉపయోగించే ముందు కనిపించని చిన్న ప్రాంతంలో దానిని టెస్ట్ చేసి.. ఓకే అనుకున్నాక వాడటం మంచిది.

లేసులను విడిగా క్లీన్ చేయండి

షూస్ కంటే లేసులు కొన్నిసార్లు ఎక్కువగా మురికిని పట్టుకుంటాయి. అందుకే వాటిని తొలగించి విడిగా శుభ్రం చేయాలి. గోరువెచ్చని నీటిలో కొద్దిగా మైల్డ్ డిటర్జెంట్ వేసి లేసులను అందులో ఉంచి శుభ్రం చేయవచ్చు. వైట్ లేసులపై బ్లీచ్ ఉపయోగించాలనుకుంటే ప్యాకెట్‌పై ఉన్న డైల్యూషన్ సూచనలను తప్పకుండా పాటించాలి. బ్లీచ్‌ను వెనిగర్, అమ్మోనియా లేదా ఇతర క్లీనింగ్ ఉత్పత్తులతో కలపకూడదు. లేసులను శుభ్రం చేసిన తర్వాత నీటితో బాగా కడగాలి.

ఇన్‌సోల్స్ దుర్వాసన ఇలా పోగొట్టండి

షూస్‌లో చెమట, తేమ కారణంగా దుర్వాసన రావచ్చు. ముఖ్యంగా తొలగించగలిగే ఇన్‌సోల్స్‌ ఉన్నప్పుడు ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. అలాంటప్పుడు ఇన్‌సోల్స్‌పై లేదా షూస్ లోపల కొద్దిగా బేకింగ్ సోడా చల్లి కొన్ని గంటలు లేదా రాత్రంతా ఉంచవచ్చు. ఇది తేమ, దుర్వాసనను కొంతవరకు గ్రహించడంలో సహాయపడుతుంది.

మళ్లీ షూస్ వేసుకునే ముందు బేకింగ్ సోడాను పూర్తిగా షేక్ చేసి లేదా బ్రష్‌తో తొలగించాలి. ఇన్‌సోల్స్‌ను నీటితో కడిగే ముందు సూచనలు చూడటం మంచిది.

శుభ్రం చేసిన తర్వాత..

షూస్‌ను శుభ్రం చేసిన తర్వాత బేకింగ్ సోడా, సోప్ లేదా టూత్‌పేస్ట్ అవశేషాలు ఉపరితలంపై మిగిలిపోకుండా చూసుకోవాలి. శుభ్రమైన తడి క్లాత్‌తో షూస్‌ను మెల్లగా తుడవాలి. క్లీనింగ్ మిశ్రమం షూస్‌పై అలాగే ఉండిపోతే అవి ఆరిన తర్వాత తెల్లటి పొర లేదా మరకల రూపంలో కనిపించవచ్చు. లెదర్ షూస్‌ను నీటిలో పూర్తిగా ముంచకూడదు. బదులుగా కొద్దిగా తడి చేసిన క్లాత్‌తో శుభ్రం చేసి.. లెదర్‌కు సరిపోయే కేర్ ప్రొడక్ట్స్‌ను ఉపయోగించాలి.

ఎలా ఆరబెట్టాలంటే..

షూస్ శుభ్రం చేసినంత ముఖ్యంగా వాటిని సరిగ్గా ఆరబెట్టడం కూడా ముఖ్యం. శుభ్రం చేసిన షూస్‌ను చల్లగా, గాలి బాగా ప్రసరించే ప్రదేశంలో ఉంచి సహజంగా ఆరబెట్టాలి. మండే ఎండలో లేదా ఎక్కువ వేడి ఉన్న ప్రదేశంలో ఎక్కువసేపు ఉంచడం వల్ల కొన్ని మెటీరియల్స్ దెబ్బతినే అవకాశం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో షూస్ రంగు మారడం లేదా పసుపురంగులోకి మారడం కూడా జరగవచ్చు.
షూస్ ఆకారం మారకుండా ఉండేందుకు లోపల సాదా పేపర్ టవల్స్‌ను వదులుగా పెట్టవచ్చు. అయితే హెయిర్ డ్రయ్యర్, రేడియేటర్ లేదా ఇతర ప్రత్యక్ష వేడి వనరులతో షూస్‌ను ఆరబెట్టకూడదు.

ప్రొటెక్టర్ వినియోగం

షూస్ పూర్తిగా ఆరిన తర్వాత వాటి మెటీరియల్‌కు సరిపోయే షూ ప్రొటెక్టర్‌ను ఉపయోగిస్తే భవిష్యత్తులో దుమ్ము, తేమ ప్రభావాన్ని కొంతవరకు తగ్గించవచ్చు. అయితే లెదర్, కాన్వాస్, మెష్ వంటి ప్రతి మెటీరియల్‌కు ఒకే ప్రొటెక్టర్‌ను ఉపయోగించకూడదు. షూస్ తయారీదారు సూచనలు, ప్రొడక్ట్‌పై ఉన్న ఉపయోగించే విధానాన్ని పరిశీలించి మాత్రమే అప్లై చేయాలి. లెదర్ షూస్‌కు ఫ్యాబ్రిక్ ప్రొటెక్టర్ బదులుగా లెదర్ కేర్ ప్రొడక్ట్ ఉపయోగించడం మంచిది.

చిన్న మరకలను వెంటనే శుభ్రం చేయండి

షూస్ పూర్తిగా మురికిగా మారిన తర్వాత శుభ్రం చేయడం కంటే చిన్న మరకలు కనిపించిన వెంటనే వాటిని తొలగించడం మంచిది. కొన్ని సార్లు వేసుకున్న తర్వాత షూస్‌పై పేరుకున్న దుమ్మును బ్రష్ చేయడం, కొత్తగా పడిన మరకలను వెంటనే తుడవడం అలవాటు చేసుకుంటే డీప్ క్లీనింగ్ చేయాల్సిన అవసరం తగ్గుతుంది.

ఖరీదైన లేదా సున్నితమైన షూస్‌పై ఇంట్లో లభించే క్లీనింగ్ పదార్థాలను ఉపయోగించే ముందు తయారీదారు ఇచ్చిన సూచనలను తప్పకుండా పరిగణలోకి తీసుకోవాలి. 

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

White Sneakers Cleaning Tips : తెల్లటి షూస్ మురికిగా మారాయా? ఇంట్లోనే శుభ్రం చేసేందుకు 9 ఈజీ చిట్కాలు
తెల్లటి షూస్ మురికిగా మారాయా? ఇంట్లోనే శుభ్రం చేసేందుకు 9 ఈజీ చిట్కాలు
Curry Leaves and Hair Oil : జుట్టు ఒత్తుగా, బలంగా కనిపించాలంటే.. కరివేపాకుతో ఈ 5 రకాల నూనెలను కలిపి ట్రై చేయండి
జుట్టు ఒత్తుగా, బలంగా కనిపించాలంటే.. కరివేపాకుతో ఈ 5 రకాల నూనెలను కలిపి ట్రై చేయండి
Best Foods for Dinner : రాత్రి భోజనం ఇలా ఉంటే ఆరోగ్యానికి చాలా మంచిదట.. ఏం తినాలి? ఏం తినకూడదు?
రాత్రి భోజనం ఇలా ఉంటే ఆరోగ్యానికి చాలా మంచిదట.. ఏం తినాలి? ఏం తినకూడదు?
IRCTC Japan Tour Package : IRCTC జపాన్ టూర్ ప్యాకేజీ.. తక్కువ బడ్జెట్‌లో 10 రోజుల ప్రత్యేక ప్యాకేజీని పొందండి, పూర్తి వివరాలివే
IRCTC జపాన్ టూర్ ప్యాకేజీ.. తక్కువ బడ్జెట్‌లో 10 రోజుల ప్రత్యేక ప్యాకేజీని పొందండి, పూర్తి వివరాలివే
Advertisement

వీడియోలు

Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?
Rahane Saved Jaiswal From 4-Match Ban | జైస్వాల్‌ను గ్రౌండ్ నుంచి బయటకు పంపిన రహానే
Ganguly & Yuvraj Singh In Delhi Capitals Camp | ఢిల్లీ క్యాపిటల్స్‌లోకి దాదా, యువి
PM Modi Meets CWG 2026 Medal Winners | ప్రధాని మోడీని కలిసిన గ్లాస్గో కామన్వెల్త్ విజేతలు
Gundenininda Gudigantalu Serial August 10 | రోహిణిని రోడ్డుపైకి నెట్టేసిన ప్రభావతి
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Job Notifications Politics: ఉద్యోగాలు భర్తీ చేస్తే విజేతలు తప్ప అందర్నీ రెచ్చగొట్టడమే - నిరుద్యోగులతో రాజకీయ పార్టీల కొత్త రాజకీయం - ప్రభుత్వాలు రిస్క్ తీసుకుంటాయా?
ఉద్యోగాలు భర్తీ చేస్తే విజేతలు తప్ప అందర్నీ రెచ్చగొట్టడమే - నిరుద్యోగులతో రాజకీయ పార్టీల కొత్త రాజకీయం - ప్రభుత్వాలు రిస్క్ తీసుకుంటాయా?
West Bengal Politics : బెంగాల్‌లో తృణమూల్‌కు కరవైన రక్షణ - ఎక్కడికెళ్లినా దాడులు - బీజేపీ వచ్చినా పరిస్థితి మారలేదా?
బెంగాల్‌లో తృణమూల్‌కు కరవైన రక్షణ - ఎక్కడికెళ్లినా దాడులు - బీజేపీ వచ్చినా పరిస్థితి మారలేదా?
Colombia Earthquake: కొలంబియాలో 7.4 తీవ్రతతో భూకంపం! వేలల్లో ఇళ్లు ధ్వంసం, వంద మందికిపైగా మృతి! 
కొలంబియాలో 7.4 తీవ్రతతో భూకంపం! వేలల్లో ఇళ్లు ధ్వంసం, వంద మందికిపైగా మృతి! 
Priyanka Chopra: సిద్ధి వినాయక టెంపుల్‌లో ప్రియాంక చోప్రా... Varanasi కోసం ఇండియా వచ్చి...
సిద్ధి వినాయక టెంపుల్‌లో ప్రియాంక చోప్రా... Varanasi కోసం ఇండియా వచ్చి...
AP DSC Notification 2026: అక్టోబర్‌లో వచ్చే డీఎస్సీ  సిలబస్ ఇదేనా? మార్పులు ఉంటాయా?
అక్టోబర్‌లో వచ్చే డీఎస్సీ  సిలబస్ ఇదేనా? మార్పులు ఉంటాయా?
Fact Check: చైనా సైన్యం అరుణాచల్ ప్రదేశ్‌లోకి ప్రవేశించిందా? వైరల్ వీడియోలో నిజమెంత? 
చైనా సైన్యం అరుణాచల్ ప్రదేశ్‌లోకి ప్రవేశించిందా? వైరల్ వీడియోలో నిజమెంత? 
VIP Mobile Number:విఐపి మొబైల్ నంబర్‌ ఎలా తీసుకోవచ్చు? దాని ప్రక్రియ, ఖర్చు గురించి తెలుసా? 
విఐపి మొబైల్ నంబర్‌ ఎలా తీసుకోవచ్చు? దాని ప్రక్రియ, ఖర్చు గురించి తెలుసా? 
ఆగష్టు 12వ సూర్యగ్రహణం భారతదేశంలో కనిపించదు! కానీ..ఈ 4 రాశులవారు జాగ్రత్తగా ఉండాలి?
ఆగష్టు 12వ సూర్యగ్రహణం భారతదేశంలో కనిపించదు! కానీ..ఈ 4 రాశులవారు జాగ్రత్తగా ఉండాలి?
Embed widget