అన్వేషించండి

Aloe Vera Benefits : చర్మం, జుట్టు సంరక్షణకు కలబంద.. ఇంట్లోనే ఈ DIY చిట్కాలు ఫాలో అవుతూ ఉపయోగించండి

Aloe Vera for Healthy Skin and Hair : చర్మం పొడిబారడం, మొటిమలు, జుట్టు రాలడం, చుండ్రు వంటి సమస్యలు ఇబ్బంది పెడుతున్నాయా? అయితే ఇంట్లోనే చర్మం, జుట్టు సమస్యకు కలబందతో ఇలా చెక్ పెట్టండి.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • కలబంద చర్మం, జుట్టు సమస్యలకు సహజ పరిష్కారం అందిస్తుంది.
  • పొడి చర్మం, మొటిమలు, మంటకు కలబంద జెల్ ఉపయోగించండి.
  • చుండ్రు, పొడి, చిట్లిన జుట్టుకు కలబంద మాస్క్ మంచిది.
  • ఉపయోగించే ముందు ప్యాచ్ టెస్ట్, పసుపు రసం తొలగించండి.

Aloe Vera Beauty Tips : చర్మం పొడిబారుతోందా? ముఖంపై మొటిమలు, మచ్చలు ఇబ్బంది పెడుతున్నాయా? జుట్టు రాలడం, చుండ్రు సమస్యలు కూడా ఉన్నాయా? అయితే ఇలాంటి సమస్యలకు ఖరీదైన బ్యూటీ ప్రొడక్ట్స్ కొనాల్సిన అవసరం లేదని చాలామంది భావిస్తారు. ఇంట్లో పెంచుకునే కలబందతోనూ చర్మం, జుట్టు సంరక్షణ చేసుకోవచ్చని చెప్తారు. కలబందలో ఉండే విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు, అమైనో యాసిడ్స్ చర్మానికి తేమను అందించడంతో పాటు కొన్ని రకాల చికాకులను తగ్గించడంలో సహాయపడతాయి. మరి కలబందను చర్మం, జుట్టు కోసం ఎలా ఉపయోగించుకోవాలో చూసేద్దాం.

సహజమైన మాయిశ్చరైజర్‌ కోసం..

చర్మం పొడిబారినప్పుడు కలబంద జెల్ ఉపయోగించుకోవచ్చు. తాజా కలబంద గుజ్జును క్లెన్స్ చేసిన ముఖానికి పలుచగా అప్లై చేయాలి. కొద్దిసేపటి తర్వాత చర్మం ఎలా స్పందిస్తుందో గమనించాలి. ఇందులో ఉండే నీటి శాతం చర్మానికి తేమను అందించడంలో సహాయపడుతుంది. 

Also Read : జుట్టు ఒత్తుగా, బలంగా పెరగాలంటే ఇవి తినండి.. కుదుళ్ల నుంచి పోషణ అందుతోందంటోన్న పరిశోధనలు

మొటిమల సమస్యకై..

ముఖంపై మొటిమలు, ఎర్రదనం ఉన్నప్పుడు కలబంద జెల్ కొంత ఉపశమనం ఇస్తుంది. ఎందుకంటే దీనిలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి. కాబట్టి తాజా కలబంద జెల్‌ను మొటిమలు ఉన్న ప్రాంతంలో కొద్దిగా రాయవచ్చు. 

ముఖానికి గ్లో కోసం..

కలబంద జెల్‌లో కొద్దిగా తేనె కలిపి ఫేస్ ప్యాక్‌లా ఉపయోగించవచ్చు. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసి 10 నుంచి 15 నిమిషాల తర్వాత నీటితో కడిగేయాలి. కలబంద చర్మానికి తేమను అందిస్తే.. తేనె చర్మం పొడిబారకుండా ఉండటానికి తోడ్పడుతుంది. పసుపు కలపాలనుకుంటే చాలా తక్కువ మోతాదులోనే ఉపయోగించాలి. 

ఎండ వల్ల చర్మం మంటగా ఉంటే

ఎండలో ఎక్కువసేపు తిరిగినప్పుడు చర్మం ఎర్రబడటం, మంటగా అనిపించడం జరుగుతుంది. అలాంటప్పుడు చల్లగా ఉంచిన కలబంద జెల్ కొంత ఉపశమనం ఇవ్వవచ్చు. ప్రభావిత ప్రాంతంలో దీనిని పలుచగా రాసుకోవాలి. 

Also Read : జుట్టు ఒత్తుగా, మెరుస్తూ ఉండాలా? మీ జుట్టు రకాన్ని బట్టి ఆముదాన్ని ఇలా అప్లై చేయండి

చర్మ సంరక్షణ కోసం కలబంద మాస్క్

కలబంద జెల్‌లో కొద్దిగా విటమిన్ ఇ ఆయిల్ కలిపి ముఖానికి అప్లై చేయవచ్చు. 15 నిమిషాల తర్వాత కడిగేయాలి. కలబంద చర్మానికి తేమను అందించడంలో సహాయపడుతుంది. జిడ్డు లేదా మొటిమలు వచ్చే చర్మం ఉన్నవారు విటమిన్ ఇ ఆయిల్ ఉపయోగించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.

జుట్టు సంరక్షణ కోసం కలబందను ఎలా ఉపయోగించాలంటే..

కలబంద జెల్‌ను తలకు పట్టించి మృదువుగా మసాజ్ చేయవచ్చు. 30 నిమిషాల తర్వాత తేలికపాటి షాంపూతో తలస్నానం చేయాలి. ఇది తల చర్మానికి తేమను అందించి పొడిబారడం వల్ల వచ్చే అసౌకర్యాన్ని తగ్గించవచ్చు. చుండ్రు, దురద వంటి సమస్యలు ఉంటే స్కాల్ప్​కి కొద్దిగా కలబంద జెల్ రాసి 20 నిమిషాల తర్వాత కడిగేయవచ్చు. అయితే చుండ్రు తగ్గాలని దానిలో నిమ్మరసం కలిపి ఉపయోగించడం మంచిది కాదు. చుండ్రు ఎక్కువ ఉంటే యాంటీ డాండ్రఫ్ షాంపూ వాడవచ్చు. 

Also Read : నువ్వులు తింటే చర్మం మెరుస్తుందా? జుట్టు బలంగా పెరుగుతుందా? నిజాలు ఇవే

పొడి, చిట్లిన జుట్టుకు హెయిర్ మాస్క్

కలబంద జెల్‌లో కొద్దిగా కొబ్బరి నూనె లేదా ఆలివ్ ఆయిల్ కలిపి జుట్టుకు పట్టించవచ్చు. ముఖ్యంగా జుట్టు చివర్లకు అప్లై చేసి 20 నుంచి 30 నిమిషాల తర్వాత షాంపూతో కడిగేయాలి. ఈ మిశ్రమం జుట్టు పొడిబారడం, చిక్కులు పడటం తగ్గించడంలో సహాయపడవచ్చు. జుట్టు మృదువుగా కనిపించేందుకు ఉపయోగపడుతుంది.

సహజమైన హెయిర్ కండిషనర్‌..

షాంపూతో తలస్నానం చేసిన తర్వాత కొద్దిగా కలబంద జెల్‌ను తడి జుట్టుకు పట్టించవచ్చు. 5 నిమిషాల తర్వాత నీటితో కడిగేయాలి. ఇది జుట్టు చిక్కులు పడకుండా, మృదువుగా ఉండేందుకు కొంత సహాయపడవచ్చు. అయితే ఎక్కువగా జెల్ ఉపయోగిస్తే జుట్టు జిడ్డుగా లేదా గట్టిగా అనిపించవచ్చు.

Also Read : జుట్టు ఎక్కువగా రాలుతోందా? ఒత్తుగా, ఆరోగ్యంగా పెరగాలంటే ఈ టిప్స్ ఫాలో అవ్వండి

కలబంద ఉపయోగించేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

కలబందను ముఖానికి లేదా తలకు రాసుకునే ముందు చేతి లోపలి భాగంలో కొద్దిగా అప్లై చేసి ప్యాచ్ టెస్ట్ చేయాలి. కలబంద ఆకును కోసినప్పుడు వచ్చే పసుపు రంగు రసం (లాటెక్స్) చర్మానికి చికాకు కలిగించవచ్చు. దాన్ని తొలగించి లోపల ఉండే జెల్ మాత్రమే ఉపయోగించాలి. కళ్ల చుట్టూ, గాయాలపై కలబంద జెల్ రాయకూడదు. దురద, మంట, ఎర్రదనం వస్తే వెంటనే కడిగేయాలి. మొటిమలు, చుండ్రు, జుట్టు రాలడం వంటి సమస్యలు ఎక్కువగా ఉంటే ఇంటి చిట్కాలపై ఆధారపడకుండా చర్మ వైద్యులను సంప్రదించాలి.

Also Read : జుట్టు, స్కిన్, ఆరోగ్యానికి మెంతులు మంచివే అయినా.. కొందరు వీటిని తినకూడదట, ఎందుకంటే?

గమనిక : ఈ కథనంలో అందించిన సమాచారం నిపుణులు పంచుకున్నారు. ఇది సాధారణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది. వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, ఎల్లప్పుడూ మీ వైద్యుడు లేదా ఇతర అర్హత కలిగిన ఆరోగ్య సంరక్షణ ప్రదాత సలహా తీసుకోండి.

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

HIV Emergency Treatment : హెచ్ఐవీ వస్తుందని డౌట్ ఉందా? 72 గంటల్లో ఈ చికిత్స తీసుకుంటే ఇన్ఫెక్షన్‌ను అడ్డుకోవచ్చా? PEP అంటే ఏమిటి?
హెచ్ఐవీ వస్తుందని డౌట్ ఉందా? 72 గంటల్లో ఈ చికిత్స తీసుకుంటే ఇన్ఫెక్షన్‌ను అడ్డుకోవచ్చా? PEP అంటే ఏమిటి?
Winter Diet : చలికాలంలో ఈ కూరగాయలు పక్కా తినండి, ఇలా తింటే ఇంకా మంచిది.. మరి ఏవి తినకూడదు?
చలికాలంలో ఈ కూరగాయలు పక్కా తినండి, ఇలా తింటే ఇంకా మంచిది.. మరి ఏవి తినకూడదు?
Exercise Benefits : రోజుకు 50 నిమిషాలు.. వారానికి 5 రోజులు.. గుండె నుంచి మెదడు వరకు 10 ఆరోగ్య ప్రయోజనాలు
రోజుకు 50 నిమిషాలు.. వారానికి 5 రోజులు.. గుండె నుంచి మెదడు వరకు 10 ఆరోగ్య ప్రయోజనాలు
HIV Myths vs Facts : దోమ కుట్టినా, కౌగిలించుకున్నా, ఒకే గ్లాసులో నీళ్లు తాగినా HIV వస్తాదా? వీటిలో అపోహలు ఏవి? నిజమెంత?
దోమ కుట్టినా, కౌగిలించుకున్నా, ఒకే గ్లాసులో నీళ్లు తాగినా HIV వస్తాదా? వీటిలో అపోహలు ఏవి? నిజమెంత?
Advertisement

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad Crime News: హైదరాబాద్‌లో పీజీ హాస్టళ్లపై ఈగల్ టీం మెరుపు దాడులు.. ఆరుగురికి గంజాయి పాజిటివ్
హైదరాబాద్‌లో పీజీ హాస్టళ్లపై ఈగల్ టీం మెరుపు దాడులు.. ఆరుగురికి గంజాయి పాజిటివ్
Atmakur Municipal Vice Chairperson: రెండోరోజూ హైడ్రామా.. ఆత్మకూరు వైస్ ఛైర్‌పర్సన్‌గా కొలగాని శిరీష ఎన్నిక
రెండోరోజూ హైడ్రామా.. ఆత్మకూరు వైస్ ఛైర్‌పర్సన్‌గా కొలగాని శిరీష ఎన్నిక
Seethakka: కావాలని అన్న మాట కాదు, పొరపాటుకు చింతిస్తున్నాను: కవిత వ్యాఖ్యలపై మంత్రి సీతక్క వివరణ
కావాలని అన్న మాట కాదు, పొరపాటుకు చింతిస్తున్నాను: కవిత వ్యాఖ్యలపై మంత్రి సీతక్క వివరణ
Hanamkonda BRS Vs Congress: వరంగల్ పశ్చిమలో రాజకీయ రసాభాస.. అభివృద్ధి సవాళ్ల నుంచి దాడుల దాకా.. హన్మకొండలో హైటెన్షన్!
వరంగల్ పశ్చిమలో రాజకీయ రసాభాస.. అభివృద్ధి సవాళ్ల నుంచి దాడుల దాకా.. హన్మకొండలో హైటెన్షన్!
HIV Myths vs Facts : దోమ కుట్టినా, కౌగిలించుకున్నా, ఒకే గ్లాసులో నీళ్లు తాగినా HIV వస్తాదా? వీటిలో అపోహలు ఏవి? నిజమెంత?
దోమ కుట్టినా, కౌగిలించుకున్నా, ఒకే గ్లాసులో నీళ్లు తాగినా HIV వస్తాదా? వీటిలో అపోహలు ఏవి? నిజమెంత?
TTD LIC Insurance Scheme: తిరుమల భక్తులకు టీటీడీ భరోసా.. సహజ మరణానికీ రూ.2 లక్షల బీమా.. తొలిసారిగా బీమా మొత్తం అందజేత
తిరుమల భక్తులకు టీటీడీ భరోసా.. సహజ మరణానికీ రూ.2 లక్షల బీమా.. తొలిసారిగా బీమా మొత్తం అందజేత
Tata Cars Price Hike: టాటా కారు కొనేవాళ్లకు భారీ షాక్‌.. డిసెంబర్ నుంచి పెరగనున్న ICE, EV మోడళ్ల ధరలు
కొత్త కారు కొనేవాళ్లకు అలెర్ట్‌.. దాదాపు రూ.15,000 అదనపు భారం వేస్తున్న టాటా
Vaibhav Sooryavanshi World Record: చరిత్రను తిరగరాసిన వైభవ్ సూర్యవంశీ.. కేవలం 52 బంతుల్లో డబుల్ సెంచరీతో అరుదైన ప్రపంచ రికార్డు, 28 బంతుల్లో శతకంతో పాటు 28 సిక్సర్లతో సునామీ
చరిత్రను తిరగరాసిన వైభవ్ సూర్యవంశీ.. కేవలం 52 బంతుల్లో డబుల్ సెంచరీతో అరుదైన ప్రపంచ రికార్డు, 28 బంతుల్లో శతకంతో పాటు 28 సిక్సర్లతో సునామీ
Embed widget