అన్వేషించండి

Winter Diet : చలికాలంలో ఈ కూరగాయలు పక్కా తినండి, ఇలా తింటే ఇంకా మంచిది.. మరి ఏవి తినకూడదు?

Best Winter Vegetables : చలికాలంలో ఆరోగ్యంగా ఉండాలంటే తినే ఆహారం కచ్చితంగా శ్రద్ధ పెట్టాలి. అందుకే ఈ సమయంలో డైట్లో చేర్చుకోవాల్సిన కూరగాయలు ఏంటో.. వాటిని ఎలా తింటే మంచిదో చూసేద్దాం.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • వివిధ రకాల కూరగాయలు శుభ్రంగా కడిగి తీసుకోవాలి.

Vegetables To Eat And Avoid In Winter : చలికాలంలో చల్లని వాతావరణం, మారే ఆహారపు అలవాట్ల వల్ల ఆరోగ్యంపై వివిధ రకాలుగా ప్రభావం పడుతుంది. అందుకే ఈ సీజన్‌లో మార్కెట్లో లభించే కొన్ని కూరగాయలను ఆహారంలో చేర్చుకుంటే శరీరానికి అవసరమైన విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్ అందుతాయి. ముఖ్యంగా ఆకుకూరలు, క్యారెట్, బీట్‌రూట్, క్యాబేజీ వంటి కూరగాయలు మంచి పోషకాలను శరీరానికి అందిస్తాయి. మరి చలికాలంలో ఏ కూరగాయలు తినాలి? వేటికి దూరంగా ఉండాలో తెలుసుకుందాం.

చలికాలంలో తినాల్సిన కూరగాయలు లిస్ట్ ఇదే

క్యారెట్

క్యారెట్‌లో బీటా కెరోటిన్ పుష్కలంగా ఉంటుంది. ఇది శరీరంలో విటమిన్ ఎగా మారుతుంది. కంటి చూపు, చర్మ ఆరోగ్యం, రోగనిరోధక వ్యవస్థ సాధారణంగా పనిచేయడానికి విటమిన్ ఎ అవసరం. క్యారెట్‌లో ఫైబర్ కూడా ఉండటం వల్ల జీర్ణక్రియకు సహాయపడుతుంది. క్యారెట్‌ను పచ్చిగా, సలాడ్ రూపంలో లేదా కూరగా తీసుకోవచ్చు.

Also Read : మీకు షుగర్ ఉందా? చలికాలంలో డయాబెటిస్ ఉన్నవారు ఏమి తినాలి.. ఏమి తినకూడదు?

పాలకూర

పాలకూరలో ఐరన్, ఫోలేట్, విటమిన్ కె, విటమిన్ ఎ, ఫైబర్ వంటి పోషకాలు ఉంటాయి. ఇవి ఎర్ర రక్త కణాల తయారీ, ఎముకల ఆరోగ్యం, శరీరంలోని సాధారణ విధులకు తోడ్పడతాయి. చలికాలంలో పాలకూర పప్పు, కూర, సూప్ రూపంలో తీసుకోవచ్చు. అయితే కిడ్నీలో రాళ్లు ఏర్పడే సమస్య ఉన్నవారు పాలకూరను ఎక్కువ తినకపోవడమే మంచిది.

బీట్‌రూట్

బీట్‌రూట్‌లో ఫోలేట్, పొటాషియం, ఫైబర్, సహజ నైట్రేట్లు ఉంటాయి. ఇందులోని నైట్రేట్లు శరీరంలో నైట్రిక్ ఆక్సైడ్‌గా మారి రక్తనాళాలు విశ్రాంతి పొందడానికి, రక్త ప్రసరణకు తోడ్పడవచ్చు. బీట్‌రూట్‌ను ఉడికించి, కూరగా లేదా సలాడ్‌గా తీసుకోవచ్చు. 

బ్రోకలీ

బ్రోకలీలో విటమిన్ సి, విటమిన్ కె, ఫోలేట్, ఫైబర్, యాంటీఆక్సిడెంట్ సమ్మేళనాలు ఉంటాయి. ఇవి రోగనిరోధక వ్యవస్థ సాధారణ పనితీరు, ఎముకల ఆరోగ్యం, జీర్ణక్రియకు తోడ్పడతాయి. బ్రోకలీని ఎక్కువసేపు ఉడికించకుండా తేలికగా ఆవిరిపై ఉడికించి లేదా తక్కువ నూనెతో వండుకుని తినడం మంచిది.

Also Read : ఇంటి భోజనం తిన్నా కూడా టైప్ 2 డయాబెటిస్ వస్తుందా? మధుమేహానికి ఈ అలవాట్లే కారణం

క్యాబేజీ

క్యాబేజీలో విటమిన్ సి, విటమిన్ కె, ఫైబర్ ఉంటాయి. ఇవి రోగనిరోధక వ్యవస్థ, ఎముకల ఆరోగ్యం, జీర్ణక్రియకు సహాయపడతాయి. తక్కువ కేలరీలు ఉండటంతో బరువు నియంత్రణపై దృష్టి పెట్టేవారికి కూడా ఇది మంచి ఎంపిక. దీనిని కూరగా, సూప్‌లో లేదా ఇతర కూరగాయలతో కలిపి తీసుకోవచ్చు.

ముల్లంగి

ముల్లంగిలో నీటి శాతం, ఫైబర్, విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరానికి హైడ్రేషన్ అందించడంతో పాటు జీర్ణక్రియకు తోడ్పడతాయి. ముల్లంగిని పచ్చిగా సలాడ్‌లో, పప్పులో లేదా కూరగా తీసుకోవచ్చు. పచ్చి ముల్లంగి తిన్నప్పుడు గ్యాస్ లేదా కడుపు ఉబ్బరం రావచ్చు. అలాంటివారు ఉడికించి తినడం మంచిది.

మెంతికూర

మెంతికూరలో ఐరన్, ఫోలేట్, విటమిన్ కె, ఫైబర్ వంటి పోషకాలు ఉంటాయి. ఇవి రక్త కణాల తయారీ, ఎముకల ఆరోగ్యం, జీర్ణక్రియకు తోడ్పడతాయి. మెంతికూరను పప్పులో, కూరలో లేదా రొట్టెల్లో కలిపి తీసుకోవచ్చు. 

Also Read : చలికాలంలో పుట్టగొడుగులు తింటే ఆరోగ్యానికి మంచిదేనా? డైట్‌లో చేర్చుకోవడం లాభమా? నష్టమా?

కాలీఫ్లవర్

కాలీఫ్లవర్‌లో విటమిన్ సి, ఫోలేట్, ఫైబర్, ఇతర మొక్కల సమ్మేళనాలు ఉంటాయి. పైగా తక్కువ కేలరీలు ఉంటాయి. బరువు తగ్గాలని చూసేవారు దీనితో కూర, సూప్ చేసుకోవచ్చు. తక్కువ నూనె వండుకుంటే బెస్ట్.

చలికాలంలో ఆహారం విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు

చలికాలంలో పూర్తిగా మానేయాల్సిన కూరగాయలు అంటూ ఏవీ ఉండవు. అయితే ఆహారపు అలవాట్లలో మాత్రం కొన్ని మార్పులు చేసుకోవాలి. కూరగాయలను ఎక్కువ నూనెలో వేయించి తీసుకోకూడదు. పకోడీలు, ఆలూ ఫ్రై, డీప్ ఫ్రై చేసిన వంటకాల్లో నూనె, కేలరీలు ఎక్కువగా ఉంటాయి. అలాగే పచ్చళ్లల్లో ఉప్పు ఎక్కువగా ఉండవచ్చు. అధిక ఉప్పు రక్తపోటు సమస్యను పెంచే అవకాశం ఉంది. కాబట్టి తక్కువగా తీసుకోవాలి. 

Also Read : బరువు, కొలెస్ట్రాల్ తగ్గించాలనుకుంటున్నారా? అయితే బార్లీ సూప్‌ ట్రై చేయండి, రోజూ తింటే కలిగే లాభాలివే

చలికాలంలో తక్కువ నూనెతో చేసిన వంటకాలు తీసుకోవడమే ఆరోగ్యానికి మంచిది. ఆకుకూరలు, సలాడ్ కూరగాయలను శుభ్రం చేయకుండా తినకూడదు. రంగు మారిన, బూజు పట్టిన, దుర్వాసన వచ్చే కూరగాయలను తినకూడదు. ప్రతిరోజూ ఒకే రకమైన కూరగాయలు కాకుండా వివిధ రంగుల్లో ఉండే కూరగాయలను డైట్లో చేర్చుకోండి. ఆకుకూరలను బాగా శుభ్రం చేసి వండుకోవాలి. కూరగాయలతో పాటు పప్పులు, తృణధాన్యాలు, పండ్లు, ప్రోటీన్ ఫుడ్స్ డైట్లో చేర్చుకోవాలి. 

Also Read : కొబ్బరి కేవలం రుచి కోసమే కాదు.. రోజూ తింటే ఆరోగ్యానికి ఎన్ని లాభాలో తెలుసా? ఇలా తీసుకోండి

గమనిక : ఈ కథనంలో అందించిన సమాచారం నిపుణులు పంచుకున్నారు. ఇది సాధారణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది. వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, ఎల్లప్పుడూ మీ వైద్యుడు లేదా ఇతర అర్హత కలిగిన ఆరోగ్య సంరక్షణ ప్రదాత సలహా తీసుకోండి.

 

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Exercise Benefits : రోజుకు 50 నిమిషాలు.. వారానికి 5 రోజులు.. గుండె నుంచి మెదడు వరకు 10 ఆరోగ్య ప్రయోజనాలు
రోజుకు 50 నిమిషాలు.. వారానికి 5 రోజులు.. గుండె నుంచి మెదడు వరకు 10 ఆరోగ్య ప్రయోజనాలు
HIV Myths vs Facts : దోమ కుట్టినా, కౌగిలించుకున్నా, ఒకే గ్లాసులో నీళ్లు తాగినా HIV వస్తాదా? వీటిలో అపోహలు ఏవి? నిజమెంత?
దోమ కుట్టినా, కౌగిలించుకున్నా, ఒకే గ్లాసులో నీళ్లు తాగినా HIV వస్తాదా? వీటిలో అపోహలు ఏవి? నిజమెంత?
Beaver Supermoon : బీవర్ సూపర్‌మూన్ అంటే ఏమిటి? పెద్దగా, ప్రకాశవంతంగా కనిపించే చంద్రుడి ప్రత్యేకతలు ఇవే.. సాయంత్రం చూసేయండి
బీవర్ సూపర్‌మూన్ అంటే ఏమిటి? పెద్దగా, ప్రకాశవంతంగా కనిపించే చంద్రుడి ప్రత్యేకతలు ఇవే.. సాయంత్రం చూసేయండి
Contaminated Drinking Water : కలుషితమైన నీరు తాగుతున్నారా? కిడ్నీలు, లివర్‌పై ప్రభావం ఎలా ఉంటుంది? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
కలుషితమైన నీరు తాగుతున్నారా? కిడ్నీలు, లివర్‌పై ప్రభావం ఎలా ఉంటుంది? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
Advertisement

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hanamkonda BRS Vs Congress: వరంగల్ పశ్చిమలో రాజకీయ రసాభాస.. అభివృద్ధి సవాళ్ల నుంచి దాడుల దాకా.. హన్మకొండలో హైటెన్షన్!
వరంగల్ పశ్చిమలో రాజకీయ రసాభాస.. అభివృద్ధి సవాళ్ల నుంచి దాడుల దాకా.. హన్మకొండలో హైటెన్షన్!
HIV Myths vs Facts : దోమ కుట్టినా, కౌగిలించుకున్నా, ఒకే గ్లాసులో నీళ్లు తాగినా HIV వస్తాదా? వీటిలో అపోహలు ఏవి? నిజమెంత?
దోమ కుట్టినా, కౌగిలించుకున్నా, ఒకే గ్లాసులో నీళ్లు తాగినా HIV వస్తాదా? వీటిలో అపోహలు ఏవి? నిజమెంత?
TTD LIC Insurance Scheme: తిరుమల భక్తులకు టీటీడీ భరోసా.. సహజ మరణానికీ రూ.2 లక్షల బీమా.. తొలిసారిగా బీమా మొత్తం అందజేత
తిరుమల భక్తులకు టీటీడీ భరోసా.. సహజ మరణానికీ రూ.2 లక్షల బీమా.. తొలిసారిగా బీమా మొత్తం అందజేత
Vaibhav Sooryavanshi World Record: చరిత్రను తిరగరాసిన వైభవ్ సూర్యవంశీ.. కేవలం 52 బంతుల్లో డబుల్ సెంచరీతో అరుదైన ప్రపంచ రికార్డు, 28 బంతుల్లో శతకంతో పాటు 28 సిక్సర్లతో సునామీ
చరిత్రను తిరగరాసిన వైభవ్ సూర్యవంశీ.. కేవలం 52 బంతుల్లో డబుల్ సెంచరీతో అరుదైన ప్రపంచ రికార్డు, 28 బంతుల్లో శతకంతో పాటు 28 సిక్సర్లతో సునామీ
This Week Movies : శర్వానంద్ భోగి To చిన్న సినిమాల సందడి - ఈ వారం థియేటర్లలో మూవీస్... ఈ మూవీ మార్నింగ్ షో ఫ్రీగా చూడొచ్చు
శర్వానంద్ భోగి To చిన్న సినిమాల సందడి - ఈ వారం థియేటర్లలో మూవీస్... ఈ మూవీ మార్నింగ్ షో ఫ్రీగా చూడొచ్చు
TVK MLA Arul Vignesh: మహిళా కలెక్టర్‌కు వేధింపులు.. సీఎం విజయ్‌కి తలనొప్పిగా టీవీకే ఎమ్మెల్యే అరుల్ విఘ్నేష్‌ వ్యవహారం!
మహిళా కలెక్టర్‌కు వేధింపులు.. సీఎం విజయ్‌కి తలనొప్పిగా TVK ఎమ్మెల్యే అరుల్ విఘ్నేష్‌ వ్యవహారం
బాచుపల్లిలో విషాదం.. సెప్టిక్ ట్యాంక్‌ క్లీన్ చేస్తూ ఊపిరాడక ముగ్గురు యువకులు మృతి!
బాచుపల్లిలో విషాదం.. సెప్టిక్ ట్యాంక్‌ క్లీన్ చేస్తూ ఊపిరాడక ముగ్గురు యువకులు మృతి!
Gaganayan Mission: గగన్‌యాన్‌కు సిద్ధమవుతున్న భారత వ్యోమగాములు.. రష్యాలో Zero Gravity Training!
గగన్‌యాన్‌కు సిద్ధమవుతున్న భారత వ్యోమగాములు.. రష్యాలో Zero Gravity Training!
Embed widget