అన్వేషించండి

Hair Growth Foods : జుట్టు ఒత్తుగా, బలంగా పెరగాలంటే ఇవి తినండి.. కుదుళ్ల నుంచి పోషణ అందుతోందంటోన్న పరిశోధనలు

Foods to Reduce Hair Fall : జుట్టు ఎక్కువగా రాలుతోందా? అయితే ఖరీదైన హెయిర్ సీరమ్స్ కంటే ఈ ఆహారాలపై దృష్టి పెట్టండి.. జుట్టు బలంగా పెరగడానికి ఇవి కీలకమంటోన్నాయి పరిశోధనలు.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • జుట్టు ఆరోగ్యానికి సరైన పోషకాహారం అత్యవసరం, పరిశోధనలు సూచిస్తున్నాయి.
  • ప్రోటీన్, ఐరన్, విటమిన్ డి జుట్టు పెరుగుదలకు కీలకం.
  • విటమిన్ సి, ఒమేగా-3, జింక్ జుట్టు బలాన్ని పెంచుతాయి.
  • సప్లిమెంట్లకు ముందు వైద్యుల సలహా తీసుకోవడం శ్రేయస్కరం.

Foods for Hair Growth : జుట్టు ఒత్తుగా, బలంగా, మెరుస్తూ ఉండాలని ఖరీదైన షాంపూలు, హెయిర్ సీరమ్స్ వాడుతుంటారు. కానీ జుట్టు ఆరోగ్యం కేవలం బయట ఉపయోగించే ఉత్పత్తులపైనే ఆధారపడదని.. లోపలి నుంచి తీసుకునే ఆహారంపై ఆధారపడి ఉంటుందని చెప్తున్నారు పోషకాహార నిపుణులు. శరీరానికి సరిపడా ప్రోటీన్, ఐరన్, జింక్, విటమిన్లు అందకపోతే జుట్టు బలహీనపడటం, ఎక్కువగా రాలడం జరుగుతుందని అంటున్నారు. 

జుట్టు ఆరోగ్యంపై పరిశోధనలు

జుట్టు ఆరోగ్యం, ఆహారం మధ్య సంబంధాన్ని పరిశీలనలో భాగంగా 2026లో ప్రచురితమైన ఒక సిస్టమాటిక్ రివ్యూలోని 17 అధ్యయనాలు, మొత్తం 61,332 మంది వివరాలను విశ్లేషించారు. ఇందులో విటమిన్ డి, ఐరన్ స్థాయులు ఎక్కువగా ఉన్నవారిలో జుట్టు రాలే సమస్య తక్కువగా ఉన్నట్లు గుర్తించారు. అలాగే American Academy of Dermatology ప్రకారం.. శరీరానికి సరిపడా ప్రోటీన్, ఐరన్ అందకపోతే జుట్టు రాలుతుంది. 

Also Read : జుట్టు ఒత్తుగా, మెరుస్తూ ఉండాలా? మీ జుట్టు రకాన్ని బట్టి ఆముదాన్ని ఇలా అప్లై చేయండి

అందుకే జుట్టు ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి కొన్ని ఫుడ్స్ కచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది. మరి జుట్టుకు కుదుళ్ల నుంచి పోషణ అందించి.. హెయిర్ ఫాల్ కంట్రోల్ చేసి.. పెరుగుదలకు తోడ్పడే ఆహారాలు ఏంటో.. వాటి గురించి నిపుణులు ఏమంటున్నారో తెలుసుకుందాం.

ప్రోటీన్ ఫుడ్స్

జుట్టులో ప్రధానంగా ఉండే కెరాటిన్ ఒక రకమైన ప్రోటీన్. అందుకే శరీరానికి సరిపడా ప్రోటీన్ అందకపోతే జుట్టు పెరుగుదలపై ప్రభావం పడుతుంది. అందుకే డైట్లో ప్రోటీన్ కోసం గుడ్లు, పాలు, పెరుగు, పనీర్, పప్పులు, శనగలు, రాజ్మా, చేపలు, చికెన్ వంటివి ఉండేలా చూసుకోవాలి. శాఖాహారులు పప్పులు, సోయా, పనీర్ వంటివి తినవచ్చు.

Also Read : నువ్వులు తింటే చర్మం మెరుస్తుందా? జుట్టు బలంగా పెరుగుతుందా? నిజాలు ఇవే

ఐరన్ రిచ్ ఫుడ్స్

శరీరంలోని కణాలకు ఆక్సిజన్ అందించడంలో ఐరన్ కీలక పాత్ర పోషిస్తుంది. అందుకే ఐరన్ లోపం ఉన్నవారిలో జుట్టు ఎక్కువగా రాలే అవకాశం ఉంటుంది. అలాంటి వారు పాలకూర, మెంతికూర, మునగాకు, శనగలు, రాజ్మా వంటి వాటిని తీసుకోవడం వల్ల ఐరన్ లభిస్తుంది. వీటితో పాటు నిమ్మరసం, ఉసిరి, జామ వంటి విటమిన్ సి ఫుడ్స్ తీసుకుంటే ఐరన్ శోషణ మెరుగవుతుంది.

ఒమేగా-3 కోసం..

జుట్టు పోషణకు హెల్తీ ఫ్యాట్స్ కూడా అవసరం. ముఖ్యంగా ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ అందించే చేపలు, వాల్‌నట్స్, అవిసె గింజలు, చియా సీడ్స్‌ను డైట్లో చేర్చుకోవాలి. ఇవి సమతుల్య ఆహారంలో భాగంగా ఉపయోగపడతాయి. 

Also Read : జుట్టు ఎక్కువగా రాలుతోందా? ఒత్తుగా, ఆరోగ్యంగా పెరగాలంటే ఈ టిప్స్ ఫాలో అవ్వండి

బాదం, వాల్‌నట్స్, గుమ్మడి గింజలు

బాదం, జీడిపప్పు, వాల్‌నట్స్‌లో విటమిన్ ఇ, ఆరోగ్యకరమైన కొవ్వులు, కొన్ని ఖనిజాలు ఉంటాయి. గుమ్మడి గింజలు, పొద్దుతిరుగుడు గింజల్లో జింక్ వంటి పోషకాలు లభిస్తాయి. ఇవి శరీరానికి అవసరమైన పోషకాలను అందించడంలో సహాయపడతాయి. రోజూ వీటిని కొద్దిమొత్తంలో తినవచ్చు.

విటమిన్ సి ఫుడ్స్

విటమిన్ సి శరీరంలో కొల్లాజెన్ తయారీకి అవసరం. అంతేకాదు ఆకుకూరలు, పప్పుల్లో ఉండే ఐరన్‌ను గ్రహించడానికి ఇది హెల్ప్ చేస్తుంది. కాబట్టి ఉసిరి, జామ, నారింజ, నిమ్మకాయ, బత్తాయి వంటి పండ్లను రోజువారీ ఆహారంలో చేర్చుకోవాలి. వీటిలోని యాంటీఆక్సిడెంట్లు శరీర కణాలను ఆక్సిడేటివ్ ఒత్తిడి నుంచి రక్షించడంలోనూ సహాయపడతాయి.

Also Read : జుట్టు, స్కిన్, ఆరోగ్యానికి మెంతులు మంచివే అయినా.. కొందరు వీటిని తినకూడదట, ఎందుకంటే?

బీటా కెరోటిన్ 

క్యారెట్, గుమ్మడికాయ, చిలగడదుంపల్లో బీటా కెరోటిన్ ఉంటుంది. ఇది శరీరంలో విటమిన్ ఎగా మారుతుంది. విటమిన్ ఎ చర్మం, కణాల సాధారణ ఆరోగ్యానికి అవసరం. అయితే విటమిన్ ఎ సప్లిమెంట్లను అధిక మోతాదులో తీసుకోవడం మాత్రం మంచిది కాదు. ఎందుకంటే దీనిని ఎక్కువగా తీసుకుంటే జుట్టు రాలే సమస్య కూడా రావచ్చు.

విటమిన్ డి ఫుడ్స్

విటమిన్ డి లోపం.. కొన్ని రకాల జుట్టు రాలే సమస్యల మధ్య సంబంధం ఉన్నట్లు పరిశోధనలు సూచిస్తున్నాయి. దీనికోసం ఎండలో ఉండడంతో పాటు.. గుడ్డు పచ్చసొన, కొవ్వు ఎక్కువగా ఉండే చేపలు, విటమిన్ డి కలిపిన పాలు వంటివి తీసుకోవాలి. లోపం ఉంటే సప్లిమెంట్లు అయినా తీసుకోవాలి. 

గుర్తించుకోవాల్సిన విషయాలు..

అమెరికన్ అకాడమీ ఆఫ్ డెర్మాటాలజీ ప్రకారం బయోటిన్, ఐరన్, జింక్, విటమిన్ డి సప్లిమెంట్లను పరీక్షలు చేయించుకోకుండా సొంతంగా వాడకూడదు. అవసరానికి మించి తీసుకుంటే హాని కలగవచ్చు. జుట్టు అకస్మాత్తుగా ఎక్కువగా రాలుతున్నా, పలుచబడుతున్నా లేదా పాచెస్‌లా ఊడుతున్నా చర్మవ్యాధి నిపుణులను సంప్రదించాలి.

Also Read : మినాక్సిడిల్ ఎవరు వాడాలి? ఎంత మోతాదులో అప్లై చేయాలి? ఆపేస్తే మళ్లీ జుట్టు రాలిపోతుందా?

గమనిక : ఈ కథనంలో అందించిన సమాచారం నిపుణులు పంచుకున్నారు. ఇది సాధారణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది. వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, ఎల్లప్పుడూ మీ వైద్యుడు లేదా ఇతర అర్హత కలిగిన ఆరోగ్య సంరక్షణ ప్రదాత సలహా తీసుకోండి.

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Foods For Weight Loss : కొవ్వును తగ్గించి, మెటబాలిజాన్ని మెరుగుపరిచే ఫుడ్స్ ఇవే.. బరువు తగ్గాలనుకుంటే తీసుకోవచ్చు
కొవ్వును తగ్గించి, మెటబాలిజాన్ని మెరుగుపరిచే ఫుడ్స్ ఇవే.. బరువు తగ్గాలనుకుంటే తీసుకోవచ్చు
Homemade Amla Hair Oil : ఇంట్లోనే ఉసిరి నూనె ఇలా చేసుకోండి.. జుట్టుకు ఎలా అప్లై చేస్తే లాభామో తెలుసా?
ఇంట్లోనే ఉసిరి నూనె ఇలా చేసుకోండి.. జుట్టుకు ఎలా అప్లై చేస్తే లాభామో తెలుసా?
Munagaku Pappu Recipe : మునగాకు పప్పు రెసిపీ.. ఆంధ్రా స్టైల్లో ఇలా చేసుకోండి, రుచితో పాటు ఆరోగ్యం కూడా!
మునగాకు పప్పు రెసిపీ.. ఆంధ్రా స్టైల్లో ఇలా చేసుకోండి, రుచితో పాటు ఆరోగ్యం కూడా!
Waking Up at 3 AM : రోజూ తెల్లవారుజామున 3-4 గంటలకే మెలకువ వస్తోందా? కారణాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి
రోజూ తెల్లవారుజామున 3-4 గంటలకే మెలకువ వస్తోందా? కారణాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి
Advertisement

వీడియోలు

Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
PV Sindhu's Declining Form & Finals Choke | పీవీ సింధు కెరీర్‌లో అసలు ఏం జరుగుతోంది? ఫైనల్స్‌లో చేతులెత్తేయడానికి అసలు కారణం ఏంటి?
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Bandi Sanjay Kumar: ఇందిరా గాంధీ, పీవీ నరసింహా రావు ఓట్లు తొలగిస్తే ఓట్లు చోరీ అంటారా ?: బండి సంజయ్ ఫైర్
ఇందిరా గాంధీ, పీవీ నరసింహా రావు ఓట్లు తొలగిస్తే ఓట్లు చోరీ అంటారా ?: బండి సంజయ్ ఫైర్
Murala Jyothi: నిడదవోలు చైర్‌పర్సన్‌గా పారిశుధ్య కార్మికుడి కుమార్తె.. స్ఫూర్తినింపుతున్న దళిత బిడ్డ మురాల జ్యోతి ప్రస్థానం
నిడదవోలు చైర్‌పర్సన్‌గా పారిశుధ్య కార్మికుడి కుమార్తె.. దళిత బిడ్డ మురాల జ్యోతిని ఉన్నతస్థానంలో నిలిపిన పవన్ కల్యాణ్
YS Jagan: చంద్రబాబుకు కంగ్రాట్స్ చెబుతూ జగన్ విమర్శలు.. మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై తీవ్ర వ్యాఖ్యలు
చంద్రబాబుకు కంగ్రాట్స్ చెబుతూ జగన్ విమర్శలు.. మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై తీవ్ర వ్యాఖ్యలు
Pocket Rockkets Teaser : గ్యాంబ్లింగ్ క్రైమ్ థ్రిల్లర్‌గా మెగా డాటర్ కొత్త మూవీ - 'పాకెట్ రాకెట్స్' స్పెషల్ వీడియో రిలీజ్... కీ రోల్‌లో జేడీ చక్రవర్తి
గ్యాంబ్లింగ్ క్రైమ్ థ్రిల్లర్‌గా మెగా డాటర్ కొత్త మూవీ - 'పాకెట్ రాకెట్స్' స్పెషల్ వీడియో రిలీజ్... కీ రోల్‌లో జేడీ చక్రవర్తి
Nandikotkuru Municipal Elections: కూటమిని ప్రభంజనంలోనూ వైసీపీ విజయం.. నందికొట్కూరులో బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి మ్యాజిక్
కూటమిని ప్రభంజనంలోనూ వైసీపీ విజయం.. నందికొట్కూరులో బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి మ్యాజిక్
Anirudh Kavya Maran Marriage : అనిరుధ్ కావ్య మారన్ వెడ్డింగ్ ఇన్విటేషన్ - 4 నెలల టైం... రోమన్ ఆర్కిటెక్చర్ 3D డిజైన్... స్పెషాలిటీస్ ఏంటంటే?
అనిరుధ్ కావ్య మారన్ వెడ్డింగ్ ఇన్విటేషన్ - 4 నెలల టైం... రోమన్ ఆర్కిటెక్చర్ 3D డిజైన్... స్పెషాలిటీస్ ఏంటంటే?
Raptadu Incident Update: రాప్తాడు దాడి ఘటన.. నిందితుడు హేమంత్‌ కాలు తొలగించిన డాక్టర్లు
రాప్తాడు దాడి ఘటన.. నిందితుడు హేమంత్‌ కాలు తొలగించిన డాక్టర్లు
ENE Repeat Trailer Review : 'ఈఎన్ఈ రిపీట్' ట్రైలర్‌ వచ్చేసింది - విశ్వక్ కొత్త మూవీలో విజయ్ దేవరకొండ వాయిస్
'ఈఎన్ఈ రిపీట్' ట్రైలర్‌ వచ్చేసింది - విశ్వక్ కొత్త మూవీలో విజయ్ దేవరకొండ వాయిస్
Embed widget