అన్వేషించండి

Hemorrhoids Risk : యువకుల్లో పెరుగుతోన్న హెమరాయిడ్స్.. ఈ అలవాట్లే మొలలకు ప్రధాన కారణమంటోన్న పరిశోధనలు

Hemorrhoids in Young Adults : ఈ మధ్య యువతలో మొలల సమస్య పెరుగుతుంది. దీనికి కారణమవుతున్న ప్రధాన అంశాలు ఏంటో.. తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • మారుతున్న ఆహారపు అలవాట్లతో యువతలో మొలలు సమస్య పెరుగుతోంది.
  • మలబద్ధకం, పీచు తక్కువ ఆహారం, ఎక్కువసేపు కూర్చోవడం ప్రధానం.
  • శారీరక శ్రమ లేకపోవడం, నీరు తక్కువ త్రాగడం కూడా కారణాలు.
  • మలవిసర్జనలో రక్తం, నొప్పి వస్తే వైద్యులను సంప్రదించాలి.

Hemorrhoid Risk and Prevention Tips : హెమరాయిడ్స్ (మొలలు) అంటే ఒకప్పుడు వయసు పైబడిన వారిలో ఎక్కువగా కనిపించేది. కానీ మారుతున్న ఆహారపు అలవాట్లు, ఎక్కువసేపు కూర్చుని పనిచేయడం, శారీరక శ్రమ తగ్గడం వంటి కారణాలతో యువతలోనూ ఈ సమస్య పెరుగుతోంది. మలబద్ధకం, టాయిలెట్‌లో ఎక్కువసేపు కూర్చోవడం, ఆహారంలో పీచు పదార్థం తక్కువగా తీసుకోవడం వంటి అలవాట్లు మొలల ముప్పును పెంచుతున్నాయని చెప్తున్నారు నిపుణులు. అసలు హెమరాయిడ్స్ ఎందుకు వస్తాయి? యువతలో ఈ సమస్య పెరగడానికి కారణం ఏంటో.. ఎలాంటి లక్షణాలను నిర్లక్ష్యం చేయకూడదో చూసేద్దాం.

హెమరాయిడ్స్ లక్షణాలు 

హెమరాయిడ్స్ ఉంటే మల విసర్జన సమయంలో రక్తం పడుతుంది. మలద్వారం చుట్టూ దురద, మంట ఉండటం. మలద్వారం దగ్గర వాపు లేదా చిన్న గడ్డలు కనిపించడం. కూర్చున్నప్పుడు నొప్పి, అసౌకర్యం కలగడం. మల విసర్జన సమయంలో నొప్పి లేదా ఇబ్బంది ఉండటం కూడా దీనిలో భాగమే. అయితే ఈ లక్షణాలన్నీ హెమరాయిడ్స్ వల్లే అని నిర్ధారించుకోకుండా వైద్యులను సంప్రదిస్తే మంచిది. 

Also Read : పైల్స్ ఎన్ని రకాలు ఉంటాయి? వాటిలో ఏది ప్రమాదకరం? ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త

పరిశోధనలు ఏం చెబుతున్నాయంటే..

గుజరాత్‌లోని ఒక ఆసుపత్రిలో 2022 జులై నుంచి డిసెంబర్ వరకు నిర్వహించిన అధ్యయనంలో హెమరాయిడ్స్‌తో బాధపడుతున్న 429 మంది రోగులను పరిశీలించారు. వీరిలో 40 ఏళ్లలోపు వారు 54.9 శాతం ఉన్నారు. అలాగే 78.43 శాతం మందిలో మలబద్ధకం, 64.70 శాతం మందిలో తక్కువ ఫైబర్ తీసుకునే అలవాటు ఉన్నట్లు గుర్తించారు. తగినంత నీరు తాగకపోవడం, శారీరక శ్రమ లేకపోవడం వంటి అంశాలు కూడా నమోదయ్యాయి.

తినే ఆహారంలో ఫైబర్ లేకపోవడం

యువతలో మొలల సమస్యకు దారితీసే ముఖ్యమైన కారణాల్లో మలబద్ధకం ఒకటి. రోజువారీ ఆహారంలో పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు, తృణధాన్యాలు, పప్పుధాన్యాలు తగ్గించి జంక్ ఫుడ్, ప్రాసెస్ చేసిన ఆహారాలు ఎక్కువగా తీసుకోవడం వల్ల ఫైబర్ లోపం ఏర్పడుతుంది. దీంతో మలం గట్టిపడి విసర్జన సమయంలో ఒత్తిడి చేయాల్సి వస్తుందని.. ఈ ఒత్తిడి వల్ల మలద్వారం చుట్టూ ఉండే రక్తనాళాలపై భారం పెరిగి హెమరాయిడ్స్ సమస్య వచ్చే అవకాశం ఉంటుందని నిపుణులు చెప్తున్నారు.

Also Read : జీర్ణ సమస్యలను దూరం చేసే 9 హెల్తీ ఫుడ్స్.. కడుపు ఉబ్బరం నుంచి మలబద్ధకం వరకు

టాయిలెట్‌లో ఎక్కువసేపు కూర్చోవడం

మొబైల్ ఫోన్ చూస్తూ టాయిలెట్‌లో ఎక్కువసేపు కూర్చోవడం చాలామందికి అలవాటుగా మారింది. ముఖ్యంగా సోషల్ మీడియా, వీడియోలు చూస్తూ సమయం గడపడం వల్ల అవసరానికి మించి టాయిలెట్‌లో ఉంటున్నారు. ఇలా ఎక్కువసేపు కూర్చోవడం వల్ల మలద్వారం చుట్టూ ఉండే రక్తనాళాలపై ఒత్తిడి పెరగవచ్చు. మల విసర్జన సమయంలో ఎక్కువగా ఒత్తిడి పెట్టడం కూడా సమస్యను మరింత పెంచుతుంది. కాబట్టి టాయిలెట్‌లో అవసరమైనంత సమయం మాత్రమే గడపాలి. 

శారీరక శ్రమ లేకపోవడం

చాలామంది ఉద్యోగాల కారణంగా రోజులో ఎక్కువ సమయం కుర్చీల్లో కూర్చునే ఉంటున్నారు. ఇంటికి వెళ్లాక కూడా టీవీ, మొబైల్ చూస్తూ రెస్ట్ తీసుకుంటున్నారు. వ్యాయామం, నడక వంటి శారీరక శ్రమ తగ్గిపోవడం వల్ల మలబద్ధకం సమస్య పెరుగుతుంది. దీనికి తోడు అధిక బరువు కూడా హెమరాయిడ్స్ ముప్పును పెంచుతుంది. అందుకే రోజూ కొంత సమయం నడక, ఇతర వ్యాయామాలకు కేటాయించాలని నిపుణులు సూచిస్తున్నారు. 

Also Read : మలబద్ధకాన్ని నిర్లక్ష్యం చేస్తే కిడ్నీలకు ముప్పు? కీలక విషయాలు బయటపెట్టిన తాజా అధ్యయనం

నీరు తాగకపోవడం

రోజంతా టీ, కాఫీలు తాగుతూ చాలామంది నీటిని తక్కువగా తాగుతారు. ఈ సమయంలో శరీరానికి తగినంత ద్రవాలు అందకపోతే మల విసర్జన కష్టంగా మారవచ్చు. ముఖ్యంగా ఆహారంలో ఫైబర్ పెంచినప్పుడు తగినంత నీరు కూడా తీసుకోవాలి. లేకపోతే మలబద్ధకం సమస్య తగ్గకపోవచ్చు. 

మల విసర్జన సమయంలో ఒత్తిడి పెట్టకండి

మల విసర్జనకు వెళ్లినప్పుడు త్వరగా పూర్తిచేయాలనే ఆతృతతో కొందరు ఎక్కువగా ఒత్తిడి పెడుతుంటారు. మరికొందరు మల విసర్జన వచ్చినా పని ఉందని ఆపుకుంటారు. ఈ అలవాట్లు మల విసర్జన ప్రక్రియను ఇబ్బందికరంగా మార్చుతాయి. అందుకే మల విసర్జన వచ్చినప్పుడు నిర్లక్ష్యం చేయకుండా.. బలవంతంగా ఒత్తిడి పెట్టకుండా సహజంగా విసర్జించే అలవాటు చేసుకోవాలి. 

Also Read : ఇసబ్​గోల్​ని దివ్యౌషధం అంటోన్న నిపుణులు.. బెనిఫిట్స్ తెలుసుకుంటే మీరు కూడా షాక్ అవుతారు

అనారోగ్యకరమైన జీవనశైలి

అధిక బరువు, ధూమపానం, శారీరక శ్రమ లేకపోవడం వంటి అంశాలు హెమరాయిడ్స్ సమస్యతో సంబంధం కలిగి ఉన్నాయని పరిశోధనలు సూచిస్తున్నాయి. ముఖ్యంగా అధిక బరువు ఉన్నవారిలో మలద్వార ప్రాంతంపై ఒత్తిడి పెరిగే అవకాశం ఉంటుంది. 2021లో ప్రచురితమైన ఒక పరిశోధనలో 1,94,620 మంది ఆరోగ్య పరీక్షలు చేయించుకున్నవారిని పరిశీలించగా అధిక బరువు, ధూమపానం, అధిక రక్తపోటు వంటి అంశాలు హెమరాయిడ్స్‌తో సంబంధం కలిగి ఉన్నట్లు గుర్తించారు. అయితే ఈ అధ్యయనం భారతీయులపై చేసినది కాదు.

ఫ్యామిలీ హిస్టరీ..

కొందరిలో కుటుంబ చరిత్ర కూడా హెమరాయిడ్స్ సమస్యకు కారణమవుతుంది. కుటుంబంలో తల్లిదండ్రులు లేదా ఇతర దగ్గరి బంధువులకు ఈ సమస్య ఉంటే వచ్చే అవకాశం పెరగవచ్చు. అలాగే దీర్ఘకాలిక మలబద్ధకం, తరచూ విరేచనాలు వంటి సమస్యలు కూడా మలద్వారం చుట్టూ ఉండే రక్తనాళాలపై ఒత్తిడిని పెంచుతాయి. గర్భధారణ సమయంలోనూ ఈ సమస్య వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి కేవలం ఆహారపు అలవాట్లే కాకుండా ఇతర ఆరోగ్య పరిస్థితులను కూడా పరిగణనలోకి తీసుకోవాలి.

Also Read : రోజూ చియా సీడ్స్ తీసుకుంటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే.. మలబద్ధకం నుంచి బరువు తగ్గడం వరకు

మొలల సమస్య రాకుండా ఉండాలంటే చేయాల్సిన పనులివే

రోజువారీ ఆహారంలో ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు, పప్పుధాన్యాలు ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. రోజంతా తగినంత నీరు తాగాలి. కనీసం 30 నిమిషాల అయిన నడక లేదా వ్యాయామం చేయాలి. మల విసర్జన సమయంలో ఎక్కువగా ఒత్తిడి పెట్టకూడదు. టాయిలెట్‌లో మొబైల్ ఫోన్ చూస్తూ ఎక్కువసేపు కూర్చోకూడదు. అలాగే మల విసర్జన వచ్చినప్పుడు ఆపుకోకుండా వెళ్లాలి. మలబద్ధకం సమస్య దీర్ఘకాలంగా ఉంటే వైద్యులను కచ్చితంగా సంప్రదించాలి.

Also Read : ఐటీ ఉద్యోగుల్లో పెరుగుతోన్న పైల్స్ సమస్యలు.. కారణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే

గమనిక : ఈ కథనంలో అందించిన సమాచారం నిపుణులు పంచుకున్నారు. ఇది సాధారణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది. వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, ఎల్లప్పుడూ మీ వైద్యుడు లేదా ఇతర అర్హత కలిగిన ఆరోగ్య సంరక్షణ ప్రదాత సలహా తీసుకోండి.

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Coconut Benefits : కొబ్బరి కేవలం రుచి కోసమే కాదు.. రోజూ తింటే ఆరోగ్యానికి ఎన్ని లాభాలో తెలుసా? ఇలా తీసుకోండి
కొబ్బరి కేవలం రుచి కోసమే కాదు.. రోజూ తింటే ఆరోగ్యానికి ఎన్ని లాభాలో తెలుసా? ఇలా తీసుకోండి
Mens Day 2026 Wishes : హ్యాపీ మెన్స్ డే 2026.. మీ జీవితంలోని స్పెషల్ Menకి ఫేస్​బుక్, వాట్సాప్​​లలో ఇలా విషెష్ చెప్పేయండి
హ్యాపీ మెన్స్ డే 2026.. మీ జీవితంలోని స్పెషల్ Menకి ఫేస్​బుక్, వాట్సాప్​​లలో ఇలా విషెష్ చెప్పేయండి
Mens Day 2026 : అంతర్జాతీయ పురుషుల దినోత్సవం 2026.. మెన్స్ డే నవంబర్ 19నే ఎందుకు జరుపుతారు? చరిత్ర, థీమ్, ప్రాముఖ్యతలు ఇవే
అంతర్జాతీయ పురుషుల దినోత్సవం 2026.. మెన్స్ డే నవంబర్ 19నే ఎందుకు జరుపుతారు? చరిత్ర, థీమ్, ప్రాముఖ్యతలు ఇవే
Type 2 Diabetes : ఇంటి భోజనం తిన్నా కూడా టైప్ 2 డయాబెటిస్ వస్తుందా? మధుమేహానికి ఈ అలవాట్లే కారణం
ఇంటి భోజనం తిన్నా కూడా టైప్ 2 డయాబెటిస్ వస్తుందా? మధుమేహానికి ఈ అలవాట్లే కారణం
Advertisement

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Henry Nicholls Century: బుమ్రా నిప్పులు చెరిగినా కోలుకున్న కివీస్.. నికోల్స్,  ఫిలిప్స్ అద్భుత పోరాటం, తొలి రోజు న్యూజిలాండ్ దే..
బుమ్రా నిప్పులు చెరిగినా కోలుకున్న కివీస్.. నికోల్స్,  ఫిలిప్స్ అద్భుత పోరాటం, తొలి రోజు న్యూజిలాండ్ దే..
Cyclone Akvan Latest Update: ఏపీకి తప్పిన ‘అక్వాన్’ పెనుముప్పు.. దిశ మార్చుకుని ఒడిశా వైపు తుపాను, ఉత్తరాంధ్రకు వర్ష సూచన!
ఏపీకి తప్పిన ‘అక్వాన్’ పెనుముప్పు.. దిశ మార్చుకుని ఒడిశా వైపు తుపాను, ఉత్తరాంధ్రకు వర్ష సూచన!
Personal Rapid Transit: హైదరాబాద్‌లో సరికొత్త రవాణా వ్యవస్థ.. డ్రైవర్‌లెస్ పాడ్ ట్యాక్సీలు రాబోతున్నాయ్‌!
హైదరాబాద్‌లోకి 'డ్రైవర్‌ అవసరం లేని పాడ్ ట్యాక్సీలు'.. 35 కి.మీ. PRTS నెట్‌వర్క్‌!
Ramayana Collections : 1500 కోట్ల క్లబ్‌లో రామాయణ - ఫస్ట్ ఇండియన్ సినిమాగా రికార్డ్
1500 కోట్ల క్లబ్‌లో రామాయణ - ఫస్ట్ ఇండియన్ సినిమాగా రికార్డ్
Bandla Ganesh: బండ్ల గణేశ్‌కు ఏడాది జైలు శిక్ష, రూ.95 లక్షల జరిమానా.. చెక్ బౌన్స్ కేసులో ఒంగోలు కోర్టు సంచలన తీర్పు!
బండ్ల గణేశ్‌కు ఏడాది జైలు శిక్ష, రూ.95 లక్షల జరిమానా.. చెక్ బౌన్స్ కేసులో ఒంగోలు కోర్టు సంచలన తీర్పు!
Samantha : బుజ్జోడా... ఎంత ప్రేమను తీసుకొచ్చావో చూడు - డెలివరీకి ముందు సమంతకు వేడుక... రాజ్ సోదరి ఎమోషనల్
బుజ్జోడా... ఎంత ప్రేమను తీసుకొచ్చావో చూడు - డెలివరీకి ముందు సమంతకు వేడుక... రాజ్ సోదరి ఎమోషనల్
CM Revanth Reddy Siddipet Public Meeting: సిద్ధిపేటలో రేవంత్ సభ హడావుడి సరే.. స్వయంగా సీఎం పోటీ చేసినా హరీశ్ రావును ఓడించడం సాధ్యమేనా?
సిద్ధిపేటలో రేవంత్ సభ హడావుడి సరే.. స్వయంగా సీఎం పోటీ చేసినా హరీశ్ రావును ఓడించడం సాధ్యమేనా?
Litton Das World Record:  టెస్టుల్లో బంగ్లా వికెట్ కీప‌ర్ లిట్టన్ దాస్ ప్రపంచ రికార్డు.. ఒక ఇన్నింగ్స్ లో అత్య‌ధిక డిస్మిస‌ల్స్ తో అరుదైన ఘనత
టెస్టుల్లో బంగ్లా వికెట్ కీప‌ర్ లిట్టన్ దాస్ ప్రపంచ రికార్డు.. ఒక ఇన్నింగ్స్ లో అత్య‌ధిక డిస్మిస‌ల్స్ తో అరుదైన ఘనత
Embed widget