అన్వేషించండి

Piles Cases : ఐటీ ఉద్యోగుల్లో పెరుగుతోన్న పైల్స్ సమస్యలు.. కారణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే

Rising Piles Cases in IT Employees : రోజంతా డెస్క్ ముందు కూర్చోవడం వల్ల బరువు పెరగడమే కాదు.. పైల్స్ సమస్య కూడా వస్తుంది. కాబట్టి ఈ సమస్యను తగ్గించుకునేందుకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ఐటీ ఉద్యోగుల్లో పైల్స్ కేసులు పెరుగుతున్నాయి, నిపుణులు హెచ్చరిస్తున్నారు.
  • గంటల తరబడి కూర్చోవడం, జంక్ ఫుడ్ పైల్స్ కు కారణం.
  • నొప్పి, దురద, రక్తస్రావం పైల్స్ లక్షణాలు, చికిత్స అవసరం.
  • ఫైబర్ ఆహారం, నీళ్లు, వ్యాయామంతో పైల్స్ నివారించవచ్చు.

Piles in IT Employees : గంటల తరబడి కూర్చుని పని చేయడం.. జంక్ ఫుడ్, పని ఒత్తిడి, టార్గెట్లు ఇవి అన్నీ ఐటీ ఉద్యోగుల జీవితంలో భాగమైపోయాయి. ఈ కారణాలే పైల్స్ సమస్యకు దారితీస్తున్నాయని సెలబ్రెటీ ఫిట్​నెస్ కోచ్ విశ్వభారత్​ తెలిపారు. ఈ మధ్యకాలంలో ఐటీ ఉద్యోగుల్లో బరువు పెరగడం, మధుమేహం కన్నా.. పైల్స్ సమస్యలే ఎక్కువగా వస్తున్నాయని తెలిపారు. 

ఈ మధ్యకాలంలో 18 నుంచి 35 సంవత్సరాల మధ్య వయసు వారిలో పైల్స్ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. అయితే ఈ సమస్య గురించి బయటకు చెప్పుకోలేక.. సిగ్గుతో దాచుకుంటూ మరిన్ని ఇబ్బందులు పడుతున్నారట. కానీ ఈ సమస్యను గుర్తించి చికిత్స తీసుకోకపోతే పరిస్థితి మరింత దిగజారుతుందని అంటున్నారు విశ్వ. మరి పైల్స్ అంటే ఏంటి? రావడానికి కారణాలు.. తీసుకోవాల్సిన జాగ్రత్తలు చూసేద్దాం. 

పైల్స్ 

పైల్స్ అంటే మూత్రనాళం లోపల లేదా బయట ఉండే సిరలు వాచిపోవడం. దీని వల్ల నొప్పి, దురద, రక్తస్రావం వంటి సమస్యలు వస్తాయి. ఈ సమస్య వస్తే కూర్చోవడం, పడుకోవడం, ఆఖరికి మూత్రానికి వెళ్లాల్సి వచ్చినా ఇబ్బంది పడాల్సి ఉంటుంది. 

ఐటీ ఉద్యోగుల్లో ఎందుకు ఎక్కువ?

ఐటీ ఉద్యోగుల్లో, డెస్క్ జాబ్ చేసేవారిలో ఈ సమస్య రావడానికి చాలా కారణాలు ఉన్నాయి. గంటల తరబడి కూర్చోవడం పెల్విక్ ఏరియాలో రక్తప్రసరణ తగ్గిస్తుంది. ప్రాసెస్డ్ ఫుడ్, జంక్ ఫుడ్ వల్ల ఫైబర్ తక్కువగా అందుతుంది. దీంతో మలబద్ధకం వస్తుంది. పని ఒత్తిడి, డెడ్‌లైన్లు జీర్ణక్రియను దెబ్బతీస్తాయి. అంతేకాదు టాయిలెట్‌లో ఫోన్ వాడటం వల్ల 10 నిమిషాలకంటే ఎక్కువ కూర్చోవడం పైల్స్ రిస్క్‌ను పెంచుతుందని నిపుణులు చెప్తున్నారు. 

పైల్స్ లక్షణాలు ఏంటి?

మూత్రం నుంచి బ్లీడింగ్, దురద, నొప్పి, వాపు పైల్స్ ప్రధాన లక్షణాలు. చాలాసార్లు ఇవి తమంతట తాముగా తగ్గుతాయి. కానీ లక్షణాలు తీవ్రమైతే వైద్య సహాయం తప్పనిసరి. చికిత్స తీసుకున్నా 4, 5 వారాలు బాగా ఇబ్బంది పెడతాయి. పూర్తిగా విస్మరిస్తే సర్జరీ వరకు వెళ్లాల్సి వస్తుంది. 

ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే..

ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలు పైల్స్‌ను నివారించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. కాబట్టి పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, పప్పు ధాన్యాలు రెగ్యులర్‌గా తినాలి. నీళ్లు పుష్కలంగా తాగాలి. అలాగే ప్రతి గంటకు లేచి కాసేపు నడవండి. సాఫ్ట్ కుషన్ వాడితే మంచిది. టాయిలెట్‌లో ఫోన్ వాడడం మానుకోండి. అలాగే రెగ్యులర్ వ్యాయామం, ఫైబర్ ఫుడ్, మలబద్ధకాన్ని తగ్గించడంలో, పైల్స్‌ను నివారించడంలో హెల్ప్ చేస్తాయి. 

ఇంట్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు..

ఓవర్ ది కౌంటర్ క్రీమ్స్, ఆయింట్‌మెంట్స్ బాహ్య లక్షణాలకు తాత్కాలిక ఉపశమనం ఇస్తాయి. కానీ లక్షణాలు తగ్గకపోతే తప్పకుండా వైద్యుడిని సంప్రదించాలి. ఆలస్యం చేస్తే పరిస్థితి మరింత విషమించవచ్చు. కాబట్టి ఈ సమస్య, లేదా దాని లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించండి. సిగ్గుపడుతూ చెప్పకపోతే పరిస్థితి చేజారిపోవచ్చు. 

మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం దీనిని క్లిక్ చేయండి. 

గమనిక : ఈ కథనంలో అందించిన సమాచారం నిపుణులు పంచుకున్నారు. ఇది సాధారణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది. వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, ఎల్లప్పుడూ మీ వైద్యుడు లేదా ఇతర అర్హత కలిగిన ఆరోగ్య సంరక్షణ ప్రదాత సలహా తీసుకోండి.

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

White Sneakers Cleaning Tips : తెల్లటి షూస్ మురికిగా మారాయా? ఇంట్లోనే శుభ్రం చేసేందుకు 9 ఈజీ చిట్కాలు
తెల్లటి షూస్ మురికిగా మారాయా? ఇంట్లోనే శుభ్రం చేసేందుకు 9 ఈజీ చిట్కాలు
Curry Leaves and Hair Oil : జుట్టు ఒత్తుగా, బలంగా కనిపించాలంటే.. కరివేపాకుతో ఈ 5 రకాల నూనెలను కలిపి ట్రై చేయండి
జుట్టు ఒత్తుగా, బలంగా కనిపించాలంటే.. కరివేపాకుతో ఈ 5 రకాల నూనెలను కలిపి ట్రై చేయండి
Best Foods for Dinner : రాత్రి భోజనం ఇలా ఉంటే ఆరోగ్యానికి చాలా మంచిదట.. ఏం తినాలి? ఏం తినకూడదు?
రాత్రి భోజనం ఇలా ఉంటే ఆరోగ్యానికి చాలా మంచిదట.. ఏం తినాలి? ఏం తినకూడదు?
IRCTC Japan Tour Package : IRCTC జపాన్ టూర్ ప్యాకేజీ.. తక్కువ బడ్జెట్‌లో 10 రోజుల ప్రత్యేక ప్యాకేజీని పొందండి, పూర్తి వివరాలివే
IRCTC జపాన్ టూర్ ప్యాకేజీ.. తక్కువ బడ్జెట్‌లో 10 రోజుల ప్రత్యేక ప్యాకేజీని పొందండి, పూర్తి వివరాలివే

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana SIR : తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
MLA Pocharam Srinivas Reddy: కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
KTR: రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
Chandrababu Review: ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
Ravindra Jadeja Test: జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
GRMB ఎజెండా నుంచి 7 ప్రాజెక్టుల రద్దు ప్రతిపాదన తొలగించకపోతే జలసౌధ ముట్టడి: కేటీఆర్
GRMB ఎజెండా నుంచి 7 ప్రాజెక్టుల రద్దు ప్రతిపాదన తొలగించకపోతే జలసౌధ ముట్టడి: కేటీఆర్
Embed widget