Telangana Men Health : తెలంగాణ పురుషులకు డబుల్ ట్రబుల్.. జుట్టు ఊడిపోతోంది, జీర్ణశక్తి తగ్గుతోంది
Men Health : తెలంగాణ పురుషుల్లో జుట్టుతో పాటే జీర్ణక్రియ సామర్థ్యం క్షీణించిపోతుందని తాజా అధ్యయనం తెలిపింది. ఈ స్టడీలో విస్తుపోయే నిజాలు బయటకు వచ్చాయి. అవేంటంటే..

- తెలంగాణలో జీర్ణఆరోగ్యం క్షీణించింది, పురుషుల్లో జుట్టు రాలడం పెరిగింది.
- పదేళ్ల అధ్యయనంలో తెలంగాణలో జీర్ణఆరోగ్యం అత్యంత క్షీణించింది.
- పట్టణ జీవనశైలి, ఆహారపు అలవాట్లు ఆరోగ్య క్షీణతకు కారణాలు.
- జీర్ణవ్యవస్థ లోపం వల్ల జుట్టుకు పోషకాలు అందవు.
Gut Health and Hair Loss Connection in Men : దేశంలో జుట్టు రాలుదల సమస్యలకు పరిష్కారాలు అందిస్తున్న ప్రముఖ బ్రాండ్ త్రాయ హెల్త్ తెలంగాణలో ఓ అధ్యయనం (Traya health study India) నిర్వహించింది. గట్-హెయిర్‌హెల్త్ స్టడీలో భాగంగా.. తెలంగాణలో నిశ్శబ్దంగా ముదురుతున్న ఆరోగ్య సంక్షోభాన్ని తెరపైకి తెచ్చింది. అధ్యయనంలో భాగమైన పది రాష్ట్రాల్లో తెలంగాణలోనే జీర్ణఆరోగ్యం అత్యధికంగా క్షీణించినట్లు తేల్చింది.
దేశవ్యాప్తంగా స్టడీ..
దేశంలోని పది ప్రధాన ప్రాంతాలపై 2024 డిసెంబర్ నుంచి 2025 డిసెంబర్ వరకు 1.6 లక్షల మంది మగవారి నుంచి సేకరించిన ఆరోగ్య వివరాలను ఈ అధ్యయనం పోల్చింది. జీర్ణ వ్యవస్థ పని తీరును అంచనా వేయడానికి మలబద్ధకాన్ని ప్రధానసూచికగా తీసుకుని, పురుషుల్లో జుట్టు రాలుదలతో సంబంధం ఉన్న మార్పులను విశ్లేషించింది. ఈ అధ్యయనంలో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి.
తెలంగాణలో క్షీణించిపోతుంది
జీర్ణఆరోగ్యం అత్యంత వేగంగా క్షీణిస్తున్న రాష్ట్రంగా తెలంగాణ తొలిస్థానంలో నిలిచింది. పురుషుల్లో జుట్టురాలడం, జీర్ణఆరోగ్యానికి మధ్య ప్రత్యక్ష సంబంధం ఉన్నట్లు పరిశోధన ఫలితాలు సూచిస్తున్నాయి. తెలంగాణలో మలబద్ధకం లేదని చెప్పిన పురుషుల శాతం 2024 డిసెంబర్‌లో 19.13శాతం ఉండగా.. 2025 డిసెంబర్‌కు 15.03%కు పడిపోయింది. ఏడాదిలోనే 4.10 శాతం పాయింట్ల పడిపోవడమనేది.. రాష్ట్రస్థాయిలో నమోదైన అతి పెద్ద క్షీణతగా నిపుణులు గుర్తించారు. రాష్ట్ర జనాభా పరిమాణాన్ని దృష్టిలో ఉంచుకుంటే ఈ తగ్గుదల వేలాది మంది పురుషులను తెలియకుండానే ఎఫెక్ట్ చేస్తుందని చెప్తున్నారు.
| State / Region | Dec 2024 | Dec 2025 | Change (pp) |
| Telangana | 19.13% | 15.03% | −4.10% |
| Rajasthan | 23.18% | 19.87% | −3.30% |
| Delhi | 22.75% | 19.78% | −2.97% |
| Madhya Pradesh | 24.36% | 22.06% | −2.30% |
| Gujarat | 24.05% | 21.78% | −2.27% |
| Bihar | 26.27% | 24.27% | −2.00% |
| Uttar Pradesh | 25.47% | 23.65% | −1.81% |
| Maharashtra | 20.57% | 18.77% | −1.80% |
| Tamil Nadu | 17.92% | 16.62% | −1.30% |
దేశంలో అత్యంత పట్టణీకరణ, విద్యావంతుల శాతం, ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి. హైదరాబాద్ దేశ ఐటీ రంగానికి కేంద్రంగా నిలుస్తోంది. ఇదే సమస్యకు ప్రధాన కారణమవుతోందని త్రాయ హెల్త్ పేర్కొంది. ఆధునిక పట్టణ జీవనశైలి కారణాలు జీర్ణ ఆరోగ్య క్షీణతకు దారితీస్తున్న ప్రధాన అంశాలుగా గుర్తించింది.
- 10 నిమిషాల డెలివరీ ప్లాట్‌ఫారమ్‌ల వల్ల అధికంగా ప్రాసెస్ చేసే ఆహారం సులభంగా అందుబాటులోకి వస్తోంది.
- ఐటీ, సర్వీసెస్ రంగాల్లో రెగ్యులర్ వర్క్ కల్చర్ కారణంగా భోజన సమయాలు మారుతున్నాయి.
- పనిలో పడి నీరు తాగడంలో నిర్లక్ష్యం చేయడం.
- ఒత్తిడిని తగ్గించుకోవడానికి ఎక్కువగా తినేయడం.
జీర్ణక్రియతో జుట్టు రాలిపోతుందా?
మన జీర్ణవ్యవస్థనే జుట్టుకు అవసరమైన పోషకాల సరఫరా గొలుసుగా నిపుణులు వివరిస్తున్నారు. జుట్టు ప్రధానంగా ప్రోటీన్‌తో తయారవుతుంది. ఐరన్, జింక్, విటమిన్లు వంటి పోషకాలు జుట్టు మూలాలకు చేరాలంటే ముందుగా అవి పేగుల ద్వారా శరీరం గ్రహించాలి. జీర్ణక్రియ బలహీనపడితే శరీరం అవసరమైన పోషకాలను ముఖ్య అవయవాలకు మళ్లిస్తుంది. జుట్టుకు మిగిలినదే అందుతుంది. దీని ప్రభావం కాలక్రమేణా జుట్టు రాలుదలగా కనిపిస్తుంది.
అలాగే బలహీనమైన జీర్ణ వ్యవస్థ శరీరంలో ఇన్‌ఫ్లమేషన్ పెంచుతుంది. ఇది జుట్టు పెరుగుదల చక్రాన్ని దెబ్బతీసి.. జుట్టు ముందుగానే రాలేలా చేస్తుంది. కొత్త జుట్టు పెరుగుదల తగ్గి, పాత జుట్టు రాలడం పెరుగుతుంది. ఈ సమస్యలను షాంపూలు లేదా ఆయిల్స్ ద్వారా పరిష్కరించడం సాధ్యం కాదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఇదే జీవనశైలి కొనసాగితే దీర్ఘకాలిక జీర్ణ సమస్యలు తప్పవని.. తలపై జుట్టు కూడా ఉండదని.. వెంటనే లైఫ్‌స్టైల్ మార్చుకోవాలని సూచిస్తున్నారు.
అయితే ఇది కేవలం త్రాయ హెల్త్ కంపెనీ మాత్రమే చేసిన అధ్యయనమని గుర్తించాలి. అలాగే జుట్టు రాలుదలకు నేరుగా గట్ కారణం అనేది సైంటిఫిక్‌గా ఇంకా నిరూపించాల్సి ఉంది. కాబట్టి మీ కారణాలు తెలుసుకుని జాగ్రత్తలు తీసుకోవడం మంచిది.
మరిన్ని హెల్త్ న్యూస్ కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.
గమనిక : ఈ కథనంలో అందించిన సమాచారం నిపుణులు పంచుకున్నారు. ఇది సాధారణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది. వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, ఎల్లప్పుడూ మీ వైద్యుడు లేదా ఇతర అర్హత కలిగిన ఆరోగ్య సంరక్షణ ప్రదాత సలహా తీసుకోండి.
Before You Go
Simple Yoga for Body Fat | చెడు కొవ్వును సింపుల్ యోగాసనాలతో దూరం చేయండి
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు























