మామిడిపండ్లను ఎక్కువ రోజులు నిల్వ చేయాలంటే ఈ టిప్స్ ఫాలో అవ్వండి

Published by: Geddam Vijaya Madhuri

చాలా మెత్తగా పండిపోయిన మామిడిపండ్లు త్వరగా పాడైపోతాయి. కాస్త గట్టిగా ఉన్న పండ్లను నిల్వ చేయడం మంచిది.

మామిడిపండ్లపై ఉన్న తేమ వల్ల ఫంగస్ త్వరగా ఏర్పడుతుంది. కాబట్టి కడిగిన తర్వాత బాగా తుడిచి ఆరబెట్టాలి.

ప్రతి మామిడిపండును న్యూస్‌పేపర్ లేదా టిష్యూ పేపర్‌లో చుట్టి ఉంచితే త్వరగా పాడవకుండా ఉంటుంది.

నేరుగా ఎండ తగలకుండా గాలి ఆడే చల్లటి ప్రదేశంలో ఉంచితే పండ్లు ఎక్కువ రోజులు తాజాగా ఉంటాయి.

పండ్లు పూర్తిగా పండిన తర్వాత మాత్రమే ఫ్రిజ్‌లో పెట్టాలి. అప్పుడు 5–7 రోజులు తాజాగా ఉంటాయి.

మామిడిపండ్లు మిగిలిన పండ్లతో కలిపి పెడితే త్వరగా మెత్తబడిపోతాయి. కొంచెం దూరంగా పెట్టడం మంచిది.

పాతకాలం నుంచి ఉపయోగించే పద్ధతిలో మామిడిపండ్లను గడ్డిలో ఉంచితే సహజంగా పండుతాయి. ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి.

ఒక పండు పాడైతే మిగతావి కూడా త్వరగా చెడిపోతాయి. కాబట్టి వెంటనే వేరుచేయాలి.

ముక్కలు చేసిన మామిడిపండ్లను ఫ్రిజ్‌లో ఎయిర్‌టైట్ కంటైనర్‌లో ఉంచితే రుచి, తాజాదనం నిల్వ ఉంటాయి.

సహజంగా పండిన మామిడిపండ్లు ఎక్కువకాలం తాజాగా ఉండటమే కాకుండా ఆరోగ్యానికి కూడా మంచివి.