రాత్రుళ్లు తక్కువ నిద్రపోతే కలిగే నష్టాలివే

Published by: Geddam Vijaya Madhuri

మెదడు మొద్దుబారి ఏకాగ్రత తగ్గిపోతుంది. విషయాలు మర్చిపోతారు, నిర్ణయాలు తీసుకోవడం కష్టమవుతుంది.

గుండె జబ్బుల ముప్పు పెరుగుతుంది. బీపీ పెరగడం, హార్ట్ అటాక్, స్ట్రోక్ రిస్క్ అధికమవుతుంది.

బరువు పెరిగే ప్రమాదం ఉంటుంది. ఆకలి హార్మోన్లు అసమతుల్యమై జంక్ ఫుడ్ కోరికలు పెరుగుతాయి.

ఇమ్యూనిటీ బలహీనపడుతుంది. జలుబు, వైరల్ ఇన్ఫెక్షన్లు తేలిగ్గా వస్తాయి.

మానసిక ఆరోగ్యం దెబ్బతింటుంది. ఆందోళన, చిరాకు, డిప్రెషన్ రిస్క్ పెరుగుతుంది.

షుగర్ ముప్పు పెరుగుతుంది. ఇన్సులిన్ పనితీరు దెబ్బతిని టైప్-2 డయాబెటిస్ రిస్క్ అధికమవుతుంది.

చర్మం మెరుపు తగ్గుతుంది. కళ్ల కింద నల్లటి వలయాలు, చర్మం వృద్ధాప్యం వేగంగా వస్తుంది.

అలసటగా, రోజంతా నీరసంగా అనిపిస్తుంది. పని చేయాలంటే శక్తి ఉండదు.

కాబట్టి రోజుకు 7-8 గంటల నిద్ర తప్పనిసరి. నిద్రరాకుంటే వైద్య సహాయం తీసుకోండి.

మీ ఆరోగ్యమే మీ అసలైన సంపద. నిద్రను నిర్లక్ష్యం చేయకండి.

దీనిని మీ నిద్రపోని నైట్ గుర్కాలకు (ఫ్రెండ్స్‌కు) షేర్ చేసి.. అలెర్ట్ చేయండి.