యోని నుంచి దుర్వాసన రావడానికి కారణాలు ఇవే

Published by: Geddam Vijaya Madhuri

సరైన శుభ్రత పాటించకపోవడం, ప్రైవేట్ పార్ట్స్‌ను శుభ్రంగా ఉంచుకోకపోవడం వల్ల బ్యాక్టీరియా పెరిగి దుర్వాసన రావచ్చు.

బ్యాక్టీరియల్ వెజినోసిస్ వంటి ఇన్ఫెక్షన్లు యోని నుంచి చేపల వాసనలాంటి దుర్వాసనకు కారణమవుతాయి.

ఫంగల్, ఈస్ట్ ఇన్ఫెక్షన్ వల్ల దురద, తెల్లటి డిశ్చార్జ్‌తో పాటు అసహజ వాసన కూడా రావచ్చు.

టైట్ దుస్తులు, ఎక్కువసేపు తేమ ఉండటం వల్ల చెమట చేరి దుర్వాసన రావచ్చు.

పీరియడ్స్ సమయంలో శానిటరీ ప్యాడ్స్‌ను ఎక్కువసేపు మార్చకపోతే బ్యాక్టీరియా పెరిగి వాసన వస్తుంది.

లైంగికంగా వ్యాపించే ఇన్ఫెక్షన్లు కూడా దుర్వాసనకు కారణమవుతాయి.

పీరియడ్స్, గర్భధారణ, మెనోపాజ్ సమయంలో హార్మోన్ మార్పుల వల్ల యోని వాసనలో మార్పులు రావచ్చు.

వెల్లుల్లి, ఉల్లి, మసాలా ఫుడ్స్ ఎక్కువగా తీసుకుంటే శరీర వాసనతో పాటు యోని వాసన కూడా మారవచ్చు.

అజాగ్రత్తగా ట్యాంపాన్ ఎక్కువసేపు ఉండిపోతే తీవ్రమైన దుర్వాసన వస్తుంది.

సువాసన వచ్చే సబ్బులు, స్ప్రేలు, వాష్‌లు ఎక్కువగా వాడితే బ్యాక్టీరియా సమతుల్యత దెబ్బతిని వాసన రావచ్చు.