కిడ్నీ ఆరోగ్యానికి మేలు చేసే ఫుడ్స్ ఇవే

Published by: Geddam Vijaya Madhuri

కాలీఫ్లవర్‌లో విటమిన్ C, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి టాక్సిన్స్‌ తగ్గించి కిడ్నీల పనితీరుకు మద్దతు ఇస్తాయి.

క్యాబేజీలో ఫైటోకెమికల్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టాన్ని తగ్గించి కిడ్నీలను రక్షించడంలో సహాయపడతాయి.

బ్లూబెర్రీస్‌లో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఇన్‌ఫ్లమేషన్ తగ్గించి కిడ్నీ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.

వెల్లుల్లి శరీరంలో చెడు కొలెస్ట్రాల్, ఇన్‌ఫ్లమేషన్ తగ్గించడంలో సహాయపడుతుంది. కిడ్నీలపై ఒత్తిడిని తగ్గిస్తుంది.

ఆపిల్‌లో ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ఇది బీపీ, షుగర్ నియంత్రణలో సహాయపడి కిడ్నీలను కాపాడుతుంది.

క్రాన్బెర్రీస్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ల రిస్క్ తగ్గించడంలో సహాయపడతాయి. దీంతో కిడ్నీ ఇన్ఫెక్షన్ల ప్రమాదం కూడా తగ్గుతుంది.

సాల్మన్, సార్డిన్ వంటి చేపల్లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు ఉంటాయి. ఇవి ఇన్‌ఫ్లమేషన్ తగ్గించి కిడ్నీలకు మేలు చేస్తాయి.

గుడ్డు తెల్లసొనలో హై క్వాలిటీ ప్రోటీన్ ఉంటుంది. ఇది కిడ్నీలపై అధిక ఒత్తిడి లేకుండా శరీరానికి అవసరమైన పోషకాలను అందిస్తుంది.

ఆలివ్ ఆయిల్‌లో హెల్తీ ఫ్యాట్స్, యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి గుండెతో పాటు కిడ్నీ ఆరోగ్యానికీ మేలు చేస్తాయి.

ఎర్ర ద్రాక్షలో ఉండే యాంటీఆక్సిడెంట్లు శరీరంలో ఇన్‌ఫ్లమేషన్ తగ్గించి కిడ్నీ కణాలను రక్షించడంలో సహాయపడతాయి.