బీర్ తాగి పడుకుంటే శరీరంలో జరిగే మార్పులు ఇవే

Published by: Geddam Vijaya Madhuri

బీర్ తాగితే త్వరగా నిద్ర వచ్చినట్లు అనిపించినా.. మధ్యలో మెలకువలు రావడం వల్ల డీప్ స్లీప్ తగ్గుతుంది.

బీర్‌లో క్యాలరీలు ఎక్కువగా ఉంటాయి. రాత్రి సమయంలో తాగడం వల్ల బెల్లీ ఫ్యాట్ పెరగవచ్చు.

తరచూ బీర్ తాగడం వల్ల లివర్‌పై ప్రభావం పడే అవకాశం ఉంటుంది.

ఆల్కహాల్ శరీరంలోని నీటిని తగ్గిస్తుంది. దీంతో ఉదయం అలసట, తలనొప్పి రావచ్చు.

రాత్రి బీర్ తాగితే గ్యాస్, అసిడిటీ, ఛాతిలో మంట వంటి సమస్యలు ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది.

అధిక మోతాదులో బీర్ తీసుకోవడం వల్ల బీపీ పెరగడం, గుండె ఆరోగ్యం దెబ్బతినే ప్రమాదం ఉంటుంది.

రెగ్యులర్‌గా తాగడం వల్ల ఆందోళన, ఒత్తిడి, డిప్రెషన్ లక్షణాలు పెరిగే అవకాశం ఉంది.

బీర్ డయూరెటిక్‌లా పనిచేస్తుంది. దీంతో నిద్ర మధ్యలో పదేపదే బాత్రూమ్‌కు వెళ్లాల్సి రావచ్చు.

రాత్రి ఆలస్యంగా బీర్ తాగడం వల్ల జీర్ణక్రియ సరిగా జరగక కడుపు ఉబ్బరం అనిపించవచ్చు.

రోజూ రాత్రి బీర్ తాగడం అలవాటై.. తర్వాత ఆల్కహాల్‌పై ఆధారపడే పరిస్థితికి దారితీయవచ్చు.