డ్రై ఫ్రూట్స్ ఎక్కువగా తింటే ఆరోగ్యానికి కలిగే నష్టాలు ఇవే

Published by: Geddam Vijaya Madhuri

డ్రై ఫ్రూట్స్‌లో క్యాలరీలు ఎక్కువగా ఉంటాయి. ఎక్కువ మోతాదులో తింటే బరువు పెరిగే ప్రమాదం ఉంటుంది.

ఖర్జూరం, కిస్మిస్ వంటి కొన్ని డ్రై ఫ్రూట్స్‌లో సహజ చక్కెరలు అధికంగా ఉంటాయి. ఇవి ఎక్కువైతే బ్లడ్ షుగర్ పెరగొచ్చు.

అతిగా తింటే గ్యాస్, బ్లోటింగ్, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు రావచ్చు.

డయేరియా వచ్చే అవకాశం ఉంది. ఫైబర్ ఎక్కువగా తీసుకోవడం వల్ల కొందరికి విరేచనాలు రావచ్చు.

చక్కెరలు ఎక్కువగా ఉండే డ్రై ఫ్రూట్స్ పళ్లకు అంటుకుని క్యావిటీస్ వచ్చే ప్రమాదాన్ని పెంచవచ్చు.

కొంతమందికి బాదం, జీడిపప్పు, వాల్‌నట్స్ వంటి నట్స్ వల్ల అలర్జీ సమస్యలు రావచ్చు.

పొటాషియం, ఫాస్ఫరస్ ఎక్కువగా ఉండటం వల్ల కిడ్నీ సమస్యలు ఉన్నవారు ఎక్కువగా తింటే ఇబ్బందులు రావచ్చు.

డ్రై ఫ్రూట్స్ ఎక్కువగా తింటే కొందరికి శరీరంలో హీట్ పెరిగి మొటిమలు, నోటి పుండ్లు రావచ్చు.

కొన్ని డ్రై ఫ్రూట్స్ మందుల ప్రభావాన్ని తగ్గిస్తాయి. కాబట్టి తీసుకునే మోతాదు విషయంలో జాగ్రత్త.

కొన్ని నట్స్‌లో ఆక్సలేట్స్ ఎక్కువగా ఉండటం వల్ల కిడ్నీ స్టోన్స్ వచ్చే ప్రమాదం పెరగవచ్చు.