మామిడి పండు తింటే లూజ్ మోషన్ అవుతున్నాయా? కారణాలు ఇవే

Published by: Geddam Vijaya Madhuri

మామిడి పండును ఎక్కువగా తింటే జీర్ణక్రియపై ఒత్తిడి పెరిగి విరేచనాలు రావచ్చు.

మామిడిలో ఫ్రక్టోజ్ ఎక్కువగా ఉంటుంది. ఇది కొంతమందికి జీర్ణం కాకపోతే లూజ్ మోషన్‌కు కారణమవుతుంది.

మామిడిలో ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల బౌల్ మూవ్‌మెంట్ వేగంగా జరుగుతుంది.

పచ్చి మామిడికాయలు ఎక్కువగా తింటే ఎసిడిటీ పెరిగి కడుపు సమస్యలు రావచ్చు.

పండును సరిగా కడగకపోతే బ్యాక్టీరియా వల్ల ఇన్ఫెక్షన్ అయ్యే అవకాశం ఉంది.

మార్కెట్‌లో లభించే మామిడిలో కొన్ని సార్లు కెమికల్స్ ఉండటం వల్ల జీర్ణ సమస్యలు రావచ్చు.

ఖాళీ కడుపుతో మామిడి తింటే కడుపులో ఇర్రిటేషన్ కలిగి లూజ్ మోషన్ రావచ్చు.

మామిడి తిన్న వెంటనే నీళ్లు తాగితే జీర్ణక్రియపై ప్రభావం చూపి సమస్యలు రావచ్చు.

కొంతమందికి మామిడిపై అలెర్జీ ఉండి కడుపు సమస్యలు రావచ్చు.

డైజెషన్ వీక్‌గా ఉంటే మామిడి సరిగా జీర్ణం కాక విరేచనాలు రావచ్చు.