పాలు పాడవకుండా ఎలా ఉంచాలి? ఫ్రెష్‌గా ఉంచే టిప్స్ ఇవే

Published by: Geddam Vijaya Madhuri

పాలు కొనుగోలు చేసిన వెంటనే ఫ్రిజ్‌లో ఉంచాలి. బయట ఎక్కువసేపు ఉంచితే త్వరగా పాడవుతాయి.

డోర్‌లో టెంపరేచర్ మారుతూ ఉంటుంది. కాబట్టి పాలను లోపలి షెల్ఫ్‌లో ఉంచడం మంచిది.

పాలను ఎప్పుడూ గాలి చేరని కంటైనర్లో ఉంచాలి. ఇలా చేస్తే బ్యాక్టీరియా పెరగదు.

పాలు తీసుకునేటప్పుడు చేతులు లేదా పాత్రలు శుభ్రంగా లేకపోతే అవి త్వరగా పాడవుతాయి.

తాజా పాలను ఒకసారి మరిగించి చల్లార్చి ఫ్రిజ్‌లో ఉంచితే ఎక్కువసేపు ఫ్రెష్‌గా ఉంటాయి.

ఒకేసారి పెద్ద కంటైనర్లో ఉంచకుండా.. చిన్న చిన్న భాగాలుగా నిల్వ చేసుకుంటే మంచిది.

ఫ్రిజ్ 3–4°C లో ఉండాలి. ఇది పాలు పాడవకుండా కాపాడుతుంది.

పాలు వాడిన వెంటనే మళ్లీ ఫ్రిజ్‌లో పెట్టాలి. బయట ఎక్కువసేపు ఉంచితే త్వరగా పాడవుతాయి.

పాత పాలను కొత్త పాలలో కలిపితే రెండూ త్వరగా పాడవుతాయి.

పాలను ఎప్పుడూ చల్లని, చీకటి ప్రదేశంలో ఉంచాలి. నేరుగా సూర్యరశ్మి తగలకుండా జాగ్రత్త.