పళ్లు స్ట్రాంగ్‌గా ఉండాలంటే ఈ ఫుడ్స్ తినండి

Published by: Geddam Vijaya Madhuri

కాల్షియం, ఫాస్ఫరస్ ఎక్కువగా ఉండే పాలు, పెరుగు వంటివి పళ్లను బలంగా ఉంచుతాయి.

పళ్లపై ఆమ్లాలను తగ్గించి, ఎనామెల్‌ను రక్షించడంలో చీజ్ హెల్ప్ చేస్తుంది. కెవిటీస్ రిస్క్ తగ్గుతుంది.

ఆకుకూరల్లో కాల్షియం, ఫోలేట్ సమృద్ధిగా ఉంటుంది. దంత ఆరోగ్యానికి మేలు చేస్తాయి.

ఆపిల్ సహజమైన టూత్ క్లీనర్లా పనిచేస్తుంది. లాలాజలం పెంచి బ్యాక్టీరియా తగ్గిస్తుంది.

క్యారెట్ క్రంచీ ఫుడ్ కావడంతో పళ్లను శుభ్రం చేసి.. గమ్ హెల్త్ మెరుగుపరుస్తుంది.

బాదంలో కాల్షియం, ప్రోటీన్ ఎక్కువగా ఉండి పంటి బలానికి ఉపయోగపడతాయి.

నువ్వులు కాల్షియం రిచ్. పళ్లపై ఉండే ప్లాక్‌ను తగ్గించడంలో సహాయపడతాయి.

గ్రీన్ టీలోని యాంటీఆక్సిడెంట్లు.. బ్యాక్టీరియా పెరుగుదలను తగ్గిస్తుంది.

స్ట్రాబెర్రీలోని విటమిన్ C గమ్ హెల్త్ మెరుగుపరుస్తుంది. పళ్లను తెల్లగా కనిపించేలా చేస్తుంది.

తిన్న తర్వాత నీళ్లు తాగడం వల్ల ఆహారపు మిగతా కణాలు తొలగి పళ్లు శుభ్రంగా ఉంటాయి.