వెల్లుల్లి ఉదయాన్నే తింటే నిజంగానే కొవ్వు తగ్గుతుందా?

Published by: Geddam Vijaya Madhuri

వెల్లుల్లిలో ఉండే అల్లిసిన్ అనే కాంపౌండ్ కొలెస్ట్రాల్ తగ్గించడంలో సహాయపడుతుంది.

కొన్ని అధ్యయనాల ప్రకారం వెల్లుల్లి LDL స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది.

వెల్లుల్లి ప్రధానంగా చెడు కొలెస్ట్రాల్‌పై పనిచేస్తుంది. మంచి కొలెస్ట్రాల్‌పై ప్రభావం తక్కువగా ఉంటుంది.

ఉదయాన్నే ఖాళీ కడుపుతో తింటే పోషకాలు శరీరానికి సులభంగా అందుతాయి.

వెల్లుల్లి రక్తనాళాలను రిలాక్స్ చేసి రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది.

హై బీపీ ఉన్నవారికి వెల్లుల్లి కొంతవరకు ఉపయోగపడుతుంది.

వెల్లుల్లి ఫ్రీ రాడికల్స్‌ను తగ్గించి గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది.

ఒకటి రెండు రోజుల్లో కాకుండా, కొన్ని వారాలు క్రమం తప్పకుండా తీసుకుంటేనే ఫలితం కనిపిస్తుంది.

కొంతమందికి కడుపు మంట, అజీర్ణం కలగవచ్చు. అలాంటి వారు జాగ్రత్తగా తీసుకోవాలి.

రోజుకు 1–2 వెల్లుల్లి రెబ్బలు సరిపోతాయి. ఎక్కువగా తింటే సైడ్ ఎఫెక్ట్స్ రావచ్చు.