కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ తాగాల్సిన డ్రింక్స్

Published by: Geddam Vijaya Madhuri

కిడ్నీలను శుభ్రంగా ఉంచడానికి నీళ్లు ముఖ్యమైనవి. రోజుకు 2.5 నుంచి 3 లీటర్లు తాగితే మంచిది.

నిమ్మరసం రసంలోని సిట్రేట్ కిడ్నీ స్టోన్స్ ఏర్పడకుండా సహాయపడుతుంది. ఉదయం తాగితే ఇంకా మంచిది.

కొబ్బరి నీళ్లలోని ఎలక్ట్రోలైట్స్ సమతుల్యం చేస్తుంది. శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచి కిడ్నీలకు మేలు చేస్తుంది.

బార్లీ నీళ్లు డిటాక్స్ డ్రింక్‌గా పనిచేస్తుంది. మూత్రం ద్వారా వ్యర్థాలను బయటకు పంపడంలో సహాయపడుతుంది.

కీరదోస జ్యూస్లో నీటి శాతం ఎక్కువగా ఉండి శరీరాన్ని చల్లగా ఉంచుతుంది. కిడ్నీ ఫంక్షన్‌కు మేలు చేస్తుంది.

క్రాన్‌బెర్రీ జ్యూస్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్లను తగ్గించడంలో సహాయపడుతుంది. కిడ్నీ ఆరోగ్యానికి పరోక్షంగా మేలు చేస్తుంది.

గ్రీన్ టీలోని యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. కిడ్నీలపై ఒత్తిడి తగ్గించడంలో సహాయపడుతుంది.

మజ్జిగ జీర్ణక్రియ మెరుగుపరుస్తుంది. శరీరాన్ని చల్లగా ఉంచి కిడ్నీలకు సపోర్ట్ ఇస్తుంది.

అరటిపండులోని పొటాషియం కిడ్నీ సమస్యలు ఉన్నవారు డాక్టర్ సలహాతో మాత్రమే తీసుకోవాలి.

పుదీనా, అల్లం టీలు శరీరాన్ని రిలాక్స్ చేస్తాయి. టాక్సిన్స్ బయటకు వెళ్లేందుకు సహాయపడతాయి.