కడుపులో ఇబ్బందిగా ఉంటే తినకూడని పండ్లు ఇవే

Published by: Geddam Vijaya Madhuri

ఆపిల్​లో ఫైబర్ ఎక్కువగా ఉండటంతో కొంతమందికి గ్యాస్, బ్లోటింగ్ కలిగించవచ్చు.

పేర్​లో సోర్బిటాల్ ఎక్కువగా ఉండటం వల్ల డైజెషన్ సమస్యలు రావచ్చు.

మామిడిలోని ఫ్రక్టోజ్ ఎక్కువగా ఉండటం వల్ల గట్ సెన్సిటివ్ ఉన్నవారికి అసౌకర్యం కలిగిస్తుంది.

పుచ్చకాయలోని హై ఫ్రక్టోజ్ వల్ల బ్లోటింగ్, గ్యాస్ సమస్యలు పెరగవచ్చు.

చెర్రీలలోని సోర్బిటాల్ కారణంగా కొంతమందికి డయేరియా లేదా గ్యాస్ కలగొచ్చు.

పైనాపిల్​లోని అధిక ఆమ్లత్వం (acidity) వల్ల కడుపు సెన్సిటివ్‌గా ఉన్నవారికి ఇబ్బంది కలుగుతుంది.

సిట్రస్ ఫ్రూట్స్​లో యాసిడ్స్ ఎక్కువగా ఉండటం వల్ల గ్యాస్ట్రిక్ సమస్యలు పెరగవచ్చు.

ద్రాక్షల్లో చక్కెర ఎక్కువగా ఉండటం వల్ల గట్‌లో ఫెర్మెంటేషన్ పెరిగి బ్లోటింగ్ కలిగిస్తుంది.

బాగా పండిన అరటిలో కొంతమందికి గ్యాస్, హెవీనెస్ కలిగిస్తుంది.

ఖర్జూరంలో ఫైబర్, షుగర్ ఎక్కువగా ఉండటంతో ఎక్కువగా తింటే డైజెషన్ సమస్యలు వస్తాయి.