మామిడి తినే ముందు నీటిలో నానబెట్టాలా? కారణాలు ఇవే

Published by: Geddam Vijaya Madhuri

మామిడి నానబెడితే దానిపై ఉండే ధూళి, పురుగుమందుల కొంతవరకు తొలగుతాయి.

మామిడిలో ఉండే ఫైటిక్ యాసిడ్ తగ్గి, పోషకాలు శరీరానికి బాగా అబ్జార్బ్ అవుతాయి.

చాలామంది మామిడి హీట్ ఫ్రూట్‌గా భావిస్తారు. నీటిలో నానబెట్టడం వల్ల దాని వేడి ప్రభావం తగ్గుతుంది.

మామిడి వల్ల వచ్చే మొటిమలు, చర్మ సమస్యలు తగ్గే అవకాశం ఉంటుంది.

కొంతమందికి మామిడిపై ఉన్న లాటెక్స్ వల్ల అలర్జీ వస్తుంది. నానబెట్టడం వల్ల ఇది తగ్గుతుంది.

నానబెట్టిన మామిడి తినడం వల్ల జీర్ణక్రియ మెరుగవుతుంది. ఇబ్బందులు ఉండవు.

మామిడిపై ఉండే చిక్కటి పాలు నీటిలో నానబెట్టడం వల్ల తొలగిపోతాయి.

పెస్టిసైడ్స్ తగ్గుతాయి. పురుగుమందుల అవశేషాలు నీటిలో కొంతవరకు కరిగిపోతాయి.

రుచి మరింత మెరుగవుతుంది. నానబెట్టిన మామిడి మరింత ఫ్రెష్‌గా అనిపిస్తుంది.

తినేముందు మామిడిని నీటిలో నానబెట్టడం చిన్న అలవాటే కానీ ఆరోగ్యానికి మేలు చేస్తుంది.