అరటి పండు తింటే బ్లడ్ షుగర్ పెరుగుతుందా?

Published by: Geddam Vijaya Madhuri

అరటిలో గ్లూకోజ్, ఫ్రక్టోజ్, సుక్రోజ్ లాంటి నేచురల్ షుగర్స్ ఉంటాయి. ఇవి బ్లడ్ షుగర్ కాస్త్ పెంచుతాయి.

అరటి పండుకు గ్లైసెమిక్ ఇండెక్స్ మిడిల్ రేంజ్‌లో ఉంటుంది. కాబట్టి ఇది ఒక్కసారిగా షుగర్‌ను పెంచదు.

బాగా పండిన అరటిలో షుగర్ ఎక్కువగా ఉంటుంది. కాస్త ముదురు అరటిని తినడం బెటర్.

ఫైబర్ వల్ల షుగర్ నెమ్మదిగా పెరుగుతుంది. అరటిలోని పీచు పదార్థం షుగర్‌ను స్లోగా రిలీజ్ అవ్వడానికి సహాయపడుతుంది.

డయాబెటిస్ ఉన్నవారు పూర్తిగా మానేయాల్సిన అవసరం లేదు. కానీ ఒక మితంగా తినాలి.

ప్రోటీన్ లేదా ఫ్యాట్‌తో కలిసి తింటే మంచిది. దీనివల్ల షుగర్ స్పైక్ తగ్గుతుంది.

ఖాళీ కడుపుతో తినకపోవడం మంచిది. అలా తింటే షుగర్ త్వరగా పెరిగే అవకాశం ఉంటుంది.

వర్కౌట్ ముందు లేదా తర్వాత తింటే బెటర్. అప్పుడు బాడీ దాన్ని సరిగ్గా ఉపయోగించుకుంటుంది.

పొటాషియం, విటమిన్ B6 లాంటి పోషకాలు హార్ట్ హెల్త్‌కు, శక్తికి మంచివి.

ఒక్క అరటితోనే షుగర్ పెరగదు. మీ మొత్తం ఆహారం, లైఫ్‌స్టైల్ కూడా ప్రభావం చూపిస్తాయి.