ప్రయాణంలోనూ ఆరోగ్యంగా ఉండాలంటే ఫాలో అవ్వాల్సిన టిప్స్

Published by: Geddam Vijaya Madhuri

వేసవిలో ట్రావెల్‌ చేస్తే డీహైడ్రేషన్ త్వరగా వస్తుంది. కాబట్టి తరచుగా నీళ్లు తాగడం మంచిది.

హెల్తీ స్నాక్స్ వెంట తీసుకెళ్లండి. డ్రై ఫ్రూట్స్, పండ్లు, నట్లు తీసుకుంటే జంక్ ఫుడ్ తినాల్సిన అవసరం తగ్గుతుంది.

స్ట్రీట్ ఫుడ్ విషయంలో జాగ్రత్త. పరిశుభ్రత లేని ఆహారం తింటే ఇన్‌ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉంటుంది.

పర్సనల్ హైజీన్ మెయింటైన్ చేయండి. చేతులు తరచుగా కడుక్కోవడం లేదా శానిటైజర్ వాడడం అలవాటు చేసుకోండి.

సరిపడ నిద్రపోతే మంచిది. నిద్రలేమి ఇమ్యూనిటీ తగ్గిస్తుంది. ట్రావెల్‌లో కూడా రొటీన్ మెయింటైన్ చేయాలి.

ఎక్కువసేపు కూర్చుంటే శరీరం గట్టిపడుతుంది. కాబట్టి చిన్నగా వాకింగ్ లేదా స్ట్రెచింగ్ చేయండి.

మెడిసిన్స్ వెంట పెట్టుకోండి. జ్వరము, తలనొప్పి, అజీర్ణం కోసం అవసరమైన మందులు తీసుకెళ్లడం మంచిది.

సన్ ప్రొటెక్షన్ తీసుకోండి. సన్‌స్క్రీన్, టోపీ, సన్‌గ్లాసెస్ వాడితే ఎండ ప్రభావం తగ్గుతుంది.

అధికంగా తినకండి. కొత్త ప్రదేశాల్లో ఫుడ్ ట్రై చేస్తూ ఓవర్ ఈటింగ్ చేస్తే జీర్ణ సమస్యలు వస్తాయి.

బాడీ సిగ్నల్స్‌ను వినండి. అలసట, తలనొప్పి లాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే విశ్రాంతి తీసుకోండి.