పీరియడ్స్ సమయంలో ఇవి తింటే నొప్పి తగ్గుతుంది

Published by: Geddam Vijaya Madhuri

పాలకూరలో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. ఇది రక్తనష్టం వల్ల వచ్చే బలహీనత తగ్గిస్తుంది.

అరటి పండులో పొటాషియం అధికంగా ఉండి కండరాల క్రాంప్స్‌ను తగ్గిస్తుంది.

డార్క్ చాక్లెట్లోని మెగ్నీషియం, ఐరన్ మూడ్ స్వింగ్స్ తగ్గించి రిలాక్స్ ఫీలింగ్ ఇస్తుంది.

అల్లం వాపు, నొప్పి తగ్గించే గుణాలు ఉండటంతో పీరియడ్ క్రాంప్స్‌కు రిలీఫ్ ఇస్తుంది.

పెరుగు ప్రోబయోటిక్స్ ఉండి జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. గట్ హెల్త్ బాగుంటుంది.

వాల్‌నట్స్, బాదం వంటి వాటిలో ఓమెగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇవి ఇన్‌ఫ్లమేషన్ తగ్గించి నొప్పిని తగ్గిస్తాయి.

చేపల్లో విటమిన్ D, ఓమెగా-3 ఉండటంతో మూడ్, నొప్పి రెండింటినీ కంట్రోల్ చేస్తాయి.

మెంతుల నీరు కడుపు నొప్పి, బ్లోటింగ్ తగ్గించడంలో సహాయపడుతుంది.

బెర్రీలలో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండి ఇమ్యూనిటీ పెంచి శక్తినిస్తాయి.

మజ్జిగ శరీరాన్ని చల్లబరచి డీహైడ్రేషన్‌ను తగ్గిస్తుంది.