NO చెప్పడం రావట్లేదా.. హెల్తీ బౌండరీలను ఇలా సెట్ చేసుకోండి

Published by: Geddam Vijaya Madhuri

మీ సమయానికి విలువ ఇవ్వండి. అన్నింటికీ అవును అంటే.. మీ సమయం, ఎనర్జీ వృథా అవుతుంది. కాబట్టి నో చెప్పడం నేర్చుకోండి.

ప్రతి ఒక్కరిని సంతృప్తి పరచడం ఎవరికీ సాధ్యం కాదు. అందరినీ హ్యాపీగా ఉంచాలని చూస్తే మీరు మాత్రమే అలసిపోతారు.

గిల్ట్ ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. నో అనడం తప్పు కాదు. అది మీ హక్కు.

స్పష్టంగా, సింపుల్‌గా చెప్పండి. పెద్ద ఎక్స్‌ప్లనేషన్ అవసరం లేదు. ఇప్పుడు చేయలేను అంటే సరిపోతుంది.

ముఖ్యమైన పనులు ఏవి అనేది ముందుగా నిర్ణయించుకోండి. దానికి తగినట్టే నిర్ణయాలు తీసుకోండి.

కొందరు గిల్ట్ లేదా ఎమోషన్‌తో ఒత్తిడి చేస్తారు. అలాంటి సమయంలో కూడా మీ నిర్ణయానికి స్టిక్ అవ్వండి.

వెంటనే అవును లేదా నో అని చెప్పలేకపోతే.. తర్వాత చూద్దాం అని టైమ్ తీసుకోవచ్చు.

మీరు మీ బౌండరీలను కాపాడుకుంటే.. మీపై మీకే గౌరవం పెరుగుతుంది.

క్లియర్ బౌండరీలు ఉంటే… అపార్థాలు తగ్గి రిలేషన్‌షిప్స్ బలపడతాయి.

మొదట్లో కష్టం అనిపించినా.. క్రమంగా నో చెప్పడం ఈజీ అవుతుంది.