ఆరోగ్యకరమైన రోజువారీ అలవాట్లు.. ఫాలో అయితే అన్నిరకాలుగా బెటర్ అవుతారు

Published by: Geddam Vijaya Madhuri

ప్రతిరోజూ ఒకే టైమ్‌లో లేవడం అలవాటు చేసుకోండి. దీంతో మీ బాడీ క్లాక్ సెట్ అవుతుంది. ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి.

లేవగానే ఓ గ్లాసు నీళ్లు తాగితే మెటాబాలిజం మొదలై.. టాక్సిన్స్ బయటకు వెళ్లేందుకు సహాయం చేస్తుంది.

యోగా, వాకింగ్ లేదా తేలికపాటి వ్యాయామం అయినా సరే చేస్తే అది శరీరాన్ని యాక్టివ్‌గా ఉంచుతుంది.

ప్రోటీన్, ఫైబర్ ఉన్న ఆహారం తీసుకుంటే రోజంతా ఎనర్జీగా ఉంటారు.

టు-డూ లిస్ట్ రాసుకుంటే పని సులభంగా పూర్తి చేయవచ్చు, స్ట్రెస్ తగ్గుతుంది.

మొబైల్, ల్యాప్‌టాప్ ఎక్కువగా ఉపయోగించడం వల్ల నిద్ర, మానసిక ఆరోగ్యంపై ప్రభావం పడుతుంది. తగ్గిస్తే బెటర్

హెవీ ఫుడ్ తగ్గించి, పోషకాహారం తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది.

పని మధ్యలో చిన్న బ్రేక్స్ తీసుకుంటే మైండ్ ఫ్రెష్ అవుతుంది, ప్రొడక్టివిటీ పెరుగుతుంది.

రాత్రుళ్లు స్క్రీన్స్ నుంచి దూరంగా ఉండటం వల్ల మంచి నిద్ర పడుతుంది.

మంచి నిద్ర మీ శరీరాన్ని రిఫ్రెష్ చేస్తుంది. ఆరోగ్యాన్ని కాపాడుతుంది. కాబట్టి 7 నుంచి 8 గంటలు పడుకోండి.