డయాబెటిస్ ఉన్నవారు రాగిపిండి తినొచ్చా?

Published by: Geddam Vijaya Madhuri

రాగుల్లో గ్లైసమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండటం వల్ల బ్లడ్ షుగర్ స్థాయిలు ఒక్కసారిగా పెరగవు.

రాగిలో ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల గ్లూకోజ్ విడుదల నెమ్మదిగా జరుగుతుంది.

రాగి తిన్న తర్వాత ఎక్కువ సేపు ఆకలి అనిపించదు. ఇది వెయిట్ మేనేజ్‌మెంట్‌కి సహాయపడుతుంది.

రాగి రెగ్యులర్‌గా తీసుకుంటే శరీరం ఇన్సులిన్‌కు మంచి స్పందన చూపే అవకాశం ఉంది.

గ్లూటెన్ లేకపోవడం వల్ల డయాబెటిస్‌తో పాటు ఇతర జీర్ణ సమస్యలున్నవారికి కూడా మంచిది.

మెగ్నీషియం శరీరంలో గ్లూకోజ్ మెటబాలిజం మెరుగుపరచడంలో సహాయపడుతుంది.

డయాబెటిస్ ఉన్నవారికి గుండె సమస్యల ప్రమాదం ఎక్కువ. రాగి హార్ట్‌ను రక్షించడంలో సహాయపడుతుంది.

ఇవి శరీరంలో ఇన్‌ఫ్లమేషన్ తగ్గించడంలో సహాయపడతాయి.

రాగి సంగటి, రాగి దోసె, రాగి జావ వంటి రూపాల్లో తీసుకోవచ్చు.

అధికంగా తింటే బ్లడ్ షుగర్ పెరగవచ్చు. కాబట్టి పరిమిత మోతాదులో తీసుకోవాలి.