వేసవిలో పుదీనా తింటే కలిగే లాభాలు ఇవే

Published by: Geddam Vijaya Madhuri

పుదీనా సహజంగా కూలింగ్ ఎఫెక్ట్ కలిగిస్తుంది. వేసవిలో వేడి నుంచి ఉపశమనం కలిగిస్తుంది.

పుదీనా ఆకులు తినడం వల్ల అజీర్ణం, గ్యాస్ సమస్యలు తగ్గుతాయి.

పుదీనా నీరు లేదా పుదీనా పానీయాలు శరీరంలో నీటి శాతం నిలుపుతాయి.

పుదీనా నోటిలో దుర్వాసనను తగ్గించి తాజాగా ఉంచుతుంది.

వేసవిలో వచ్చే తలనొప్పిని పుదీనా తగ్గించడంలో సహాయపడుతుంది.

పుదీనా చర్మాన్ని చల్లగా ఉంచి పింపుల్స్ తగ్గించడంలో సహాయపడుతుంది.

పుదీనాలో ఉన్న యాంటీ ఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తిని పెంచుతాయి.

మెటబాలిజాన్ని పెంచి ఫ్యాట్ బర్నింగ్‌కు దోహదం చేస్తుంది.

పుదీనా శ్వాసకోశ సమస్యలను తగ్గించడంలో ఉపయోగపడుతుంది.

టాక్సిన్స్‌ను బయటకు పంపించి శరీరాన్ని శుభ్రపరుస్తుంది.