తిన్న వెంటనే చేయకూడని పనులు ఇవే

Published by: Geddam Vijaya Madhuri

తిన్న వెంటనే పడుకోకండి. ఇలా చేస్తే ఆహారం సరిగ్గా జీర్ణం కాదు. అసిడిటీ, గ్యాస్ సమస్యలు వస్తాయి.

వెంటనే టీ లేదా కాఫీ తాగకండి. ఇవి ఐరన్ శోషణను తగ్గిస్తాయి. జీర్ణక్రియ కూడా మందగిస్తుంది.

తిన్న వెంటనే స్నానం చేస్తే జీర్ణక్రియకు అవసరమైన రక్తప్రవాహం తగ్గుతుంది.

పండ్లు త్వరగా జీర్ణమవుతాయి. కానీ భోజనం తర్వాత తింటే మంచిది కాదు. జీర్ణ సమస్యలు వస్తాయి.

తిన్న వెంటనే వ్యాయామం చేస్తే అజీర్ణం, కడుపునొప్పి వచ్చే అవకాశం ఉంటుంది.

ఫుడ్ తిన్నాక.. ఎక్కువ నీళ్లు తాగితే అంత మంచిది కాదు. కాస్త తక్కువగా తీసుకోవాలి.

తిన్న తర్వాత స్మోకింగ్ చేస్తే క్యాన్సర్ ప్రమాదం పెరుగుతుంది.

వెంటనే బెల్ట్ లేదా టైట్ దుస్తులు ధరించకండి. కడుపుపై ఒత్తిడి పెరిగి జీర్ణక్రియకు ఇబ్బంది కలుగుతుంది.

తిన్నాక నడిస్తే మంచిదే కానీ ఎక్కువగా నడిస్తే జీర్ణక్రియపై ప్రభావం ఉంటుంది.

భోజనం చేసిన తర్వాత 15–20 నిమిషాలు ప్రశాంతంగా కూర్చోవడం లేదా తేలికగా నడవడం జీర్ణక్రియకు మంచిది.