ఈ లక్షణాలు కనిపిస్తే.. కొంచెం బ్రేక్ తీసుకోండి, మీ Bodyకి అవసరం

Published by: Geddam Vijaya Madhuri

సరిపడా నిద్రపోయినా కూడా రోజంతా నీరసం, శక్తి లేనట్టు అనిపిస్తే.. శరీరం ఓవర్‌వర్క్ చేస్తుందని సంకేతం.

స్ట్రెస్, ఒత్తిడి ఎక్కువైతే తలనొప్పి, మైగ్రేన్ సమస్యలు పెరుగుతాయి.

పడుకున్నా నిద్ర రాకపోవడం లేదా మధ్యలో మెలకువ రావడం.. కూడా శరీరానికి రెస్ట్ ఇవ్వాలని సూచించే సంకేతమే.

చిన్న చిన్న విషయాలకే కోపం రావడం, అసహనం, బాధ అనిపించడం.. మానసికంగా అలసిపోయారని చెప్పే సంకేతం.

గ్యాస్, అజీర్ణం, కడుపు ఉబ్బరం లాంటి జీర్ణ సమస్యలు స్ట్రెస్ వల్ల కూడా వస్తాయి.

ఎలాంటి పని చేయకపోయినా గుండె వేగంగా కొట్టుకోవడం.. శరీరం స్ట్రెస్‌లో ఉందని సూచిస్తుంది.

జుట్టు ఎక్కువగా రాలిపోతుంది. ఒత్తిడి, నిద్రలేమి వల్ల హెయిర్ ఫాల్ పెరుగుతుంది.

ఇమ్యూనిటీ తగ్గిపోయి.. జలుబు, దగ్గు వంటి ఇన్ఫెక్షన్లు తరచుగా వస్తాయి.

పని మీద దృష్టి పెట్టలేకపోవడం, చిన్న విషయాలు మర్చిపోవడం.. మెంటల్ ఎగ్జాస్షన్ దాని సంకేతమే.

ఎక్కువగా తినడం లేదా అసలు ఆకలి లేకపోవడం కూడా శరీరం ఇచ్చే సిగ్నలే.