కాన్ఫిడెన్స్ పెంచుకోవడానికి డ్రెస్సింగ్ ఇలా మార్చుకోండి

Published by: Geddam Vijaya Madhuri

మీకు ఫిట్​గా ఉండే డ్రెస్​లు వేసుకోండి. చాలా టైట్ లేదా చాలా లూజ్‌గా ఉంటే కాన్ఫిడెన్స్ తగ్గుతుంది.

మీరు సౌకర్యంగా ఫీల్ అయ్యే దుస్తులు వేసుకుంటే ఆటోమేటిక్‌గా కాన్ఫిడెన్స్ పెరుగుతుంది.

క్లీన్, నీట్‌గా ఉండాలి. ఇస్త్రీ చేసిన, శుభ్రమైన దుస్తులు మీ లుక్‌ని మెరుగుపరుస్తాయి.

మీ స్టైల్ తెలుసుకోండి. ఇతరులను కాపీ చేయకుండా నచ్చిన స్టైల్‌ను ఫాలో అవ్వండి.

కలర్స్‌ని స్మార్ట్‌గా ఎంచుకోండి. మీ స్కిన్ టోన్‌కి సూట్ అయ్యే కలర్స్ వేసుకుంటే మీరు మరింత ఆకర్షణీయంగా కనిపిస్తారు.

సింపుల్ కానీ క్లాసీ లుక్. అతి మేకప్, అతి అలంకరణ కాకుండా సింపుల్‌గా ఉంటే కాన్ఫిడెన్స్‌ పెరుగుతుంది.

వాచ్, షూస్, బ్యాగ్ వంటి చిన్న డిటైల్స్ కూడా మీ లుక్‌ని హైలైట్ చేస్తాయి.

డ్రెస్‌కు సరిపోయే షూస్ వేసుకుంటే మొత్తం లుక్ కంప్లీట్ అవుతుంది.

బాడీ లాంగ్వేజ్ కూడా ముఖ్యం. మీరు ఎలా నిలబడతారు, ఎలా నడుస్తారు అన్నది కూడా కాన్ఫిడెన్స్‌ బిల్డ్ చేస్తుంది.

ఎలాంటి దుస్తులు వేసుకున్నా… మీ మీద నమ్మకం ఉంటేనే నిజమైన కాన్ఫిడెన్స్ కనిపిస్తుంది.