కిడ్నీ స్టోన్ రిస్క్ పెరగడానికి కారణాలు ఇవే

Published by: Geddam Vijaya Madhuri

రోజంతా సరిపడా నీరు తాగకపోతే యూరిన్ కన్‌సంట్రేట్ అయి స్టోన్స్ ఏర్పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

అధిక ఉప్పు తీసుకోవడం వల్ల కిడ్నీల్లో కాల్షియం నిల్వలు పెరిగి స్టోన్స్ ఏర్పడవచ్చు.

రెడ్ మీట్, అధిక ప్రోటీన్ డైట్ వల్ల యూరిక్ యాసిడ్ పెరిగి స్టోన్స్ రిస్క్ పెరుగుతుంది.

కాల్షియం తక్కువగా లేదా ఎక్కువగా తీసుకోవడం రెండూ స్టోన్స్ రిస్క్ పెంచవచ్చు.

పాలకూర, బీట్‌రూట్, చాక్లెట్ వంటి ఆహారాలు ఎక్కువగా తీసుకుంటే స్టోన్స్ ఏర్పడే అవకాశం ఉంటుంది.

చక్కెర ఎక్కువగా ఉన్న పానీయాలు, సోడాలు కిడ్నీ స్టోన్ ప్రమాదాన్ని పెంచుతాయి.

బరువు ఎక్కువగా ఉంటే మెటబాలిజం మార్పులు జరిగి స్టోన్స్ ఏర్పడే అవకాశం ఉంటుంది.

మీ ఫ్యామిలీలో ఎవరికైనా కిడ్నీ స్టోన్స్ ఉంటే మీకూ వచ్చే అవకాశాలు ఎక్కువ.

కాల్షియం సప్లిమెంట్స్, డయురెటిక్స్ వంటి మందలు ఎక్కువగా వాడితే స్టోన్స్ వచ్చే ప్రమాదం ఉంటుంది.

తరచూ యూరిన్ ఇన్ఫెక్షన్ ఉంటే స్ట్రువైట్ స్టోన్స్ ఏర్పడే అవకాశం పెరుగుతుంది.