పీనట్ బటర్ రోజూ తింటే కలిగే లాభాలివే

Published by: Geddam Vijaya Madhuri

పీనట్ బటర్‌లో హెల్తీ ఫ్యాట్స్, ప్రోటీన్ ఎక్కువగా ఉంటాయి. ఇవి రోజంతా శక్తిని ఇస్తాయి.

కండరాల పెరుగుదలకు అవసరమైన ప్రోటీన్ ఇందులో ఉంటుంది. జిమ్ చేసే వారికి బాగా ఉపయోగపడుతుంది.

ఇందులోని మోనోశాచ్యురేటెడ్ ఫ్యాట్స్ గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. చెడు కొలెస్ట్రాల్ తగ్గిస్తాయి.

ఇది తింటే తర్వాత ఎక్కువసేపు కడుపు నిండిన భావన ఉంటుంది. దీంతో ఎక్కువగా తినడం తగ్గుతుంది.

విటమిన్ E, నయాసిన్ వంటి పోషకాలు మెదడు ఆరోగ్యానికి సహాయపడతాయి.

లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఉండటం వల్ల రక్తంలో చక్కెర ఒక్కసారిగా పెరగదు.

మెగ్నీషియం, పొటాషియం, విటమిన్ B6 వంటి శరీరానికి అవసరమైన పోషకాలు అందుతాయి.

హెల్తీ ఫ్యాట్స్, విటమిన్లు ఉండటం వల్ల స్కిన్ గ్లో, హెయిర్ హెల్త్ మెరుగవుతుంది.

మెగ్నీషియం, ఫాస్పరస్ వంటి ఖనిజాలు ఎముకల బలానికి ఉపయోగపడతాయి.

బ్రెడ్, స్మూతీలు, ఓట్స్‌తో కలిపి తినవచ్చు. టైమ్ లేకపోయినా ఈజీగా తీసుకోవచ్చు.