ప్రేమించుకుని పెళ్లి చేసుకునేవారికి బెస్ట్ విషెస్ ఇలా తెలుగులో చెప్పేయండి

Published by: Geddam Vijaya Madhuri

మీ ప్రేమ ఎప్పటికీ ఇలాగే సంతోషంగా, ఆనందంగా కొనసాగాలని కోరుకుంటున్నాను. హ్యాపీ మ్యారేజ్ లైఫ్.

మీరు ఇద్దరూ కలిసి ప్రారంభించిన ఈ ప్రయాణం ఎన్నో సంతోషాలు, విజయాలతో నిండిపోవాలి. హ్యాపీ మ్యారేజ్ లైఫ్.

మీ ప్రేమ కథను పెళ్లి మరింత అందంగా, అద్భుతంగా మార్చాలని కోరుకుంటూ.. హ్యాపీ మ్యారేజ్ లైఫ్.

ప్రేమతో మొదలైన మీ నవ్వులు.. పెళ్లితో జీవితాంత ఆనందాన్ని ఇవ్వాలని విష్ చేస్తూ.. హ్యాపీ మ్యారేజ్ లైఫ్.

ఆనందాల్లోనే కాదు.. ఇప్పుడు కష్ట సుఖాల్లో కూడా ఒకరికి ఒకరు తోడుగా, నీడగా ఉండాలని కోరుకుంటూ హ్యాపీ మ్యారేజ్ లైఫ్.

మీ బంధం కాలంతో మరింత గట్టిపడాలి. ప్రతి కష్టాన్ని కలిసి ఎదుర్కొని విజయాన్ని సాధించాలి. హ్యాపీ మార్యేజ్ లైఫ్.

మీ పెళ్లి ప్రయాణం ప్రేమతో, శాంతితో నిండిపోవాలి. గొడవలు వచ్చినా కలిసి వాటిని దూరం చేసుకోవాలి. హ్యాపీ మారేజ్ లైఫ్.

చిన్న చిన్న క్షణాలను కూడా కలిసి సెలబ్రేట్ చేసుకుంటూ.. లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండాలని విష్ చేస్తూ హ్యాపీ మ్యారేజ్ లైఫ్.

మీ ఇద్దరి మధ్య ఉన్న ప్రేమ ఎప్పటికీ తగ్గకుండా పెరుగుతూ ఉండాలని కోరుకుంటూ హృదయపూర్వక శుభాకాంక్షలు.